Site icon HashtagU Telugu

Turkey-Syria Earthquake: కూలిన ఇళ్లు.. బయటపడుతున్న మృతదేహాలు!

Tc6mo15 Turkey Earthquake 650 625x300 06 February 23

Tc6mo15 Turkey Earthquake 650 625x300 06 February 23

టర్కీ (Turkey), సిరియాను అతలాకుతలం చేసిన భూకంపం (Earthquake) లో కూలిన కట్టడాలను తవ్వుతున్న కొద్దీ మృతదేహాలు (Dead bodies) బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 8 వేలు దాటింది. ఇంకా వేలాది మంది క్షతగాత్రులు ఉన్నారు. భూకంపంతో తల్లడిల్లిన ఆ రెండు దేశాలకు మానవీయ కోణంతో భారీగా సహాయం అందించే కార్యక్రమాన్ని భారత్ (India) వెనువెంటనే చేపట్టింది.  భారత్ నుండి బయల్దేరిన వైద్య, ఇతర వస్తు సామగ్రితో పాటు వైద్య సిబ్బంది, సైనికులు తుర్కియే కు నిన్న చేరుకున్నారు. ప్రత్యేకంగా అక్కడ 30 పడకల ఆస్పత్రిని తాత్కాలికంగా ఏర్పాటు చేసి వైద్య సహాయంపై భారత్ బృందాలు దృష్టి కేంద్రీకరించాయి. ఆరు టన్నుల వైద్య ఉపకరణాలు, మందులను భారత్ అక్కడకు చేరవేసింది.

టిబెట్ పీఠభూమి యొక్క ఎత్తును కొనసాగిస్తూ.. భారత ప్లేట్ సుమారుగా ఏడాదికి 47 మి.మీ చొప్పున ఆసియాలోకి వెళ్తోంది. ఇది హిమాలయ, ఆల్టిన్ టాగ్, టియన్ షాన్ పర్వతాలను విచ్ఛిన్నం చేస్తుంది. దీన్ని బట్టి భారతదేశం భూకంపాల (Earthquake) నుంచి సురక్షితం కాదని ఒక నివేదిక పేర్కొంది. దీనివలన ఆసియా, ఇంకా భారత్ లోని కొన్ని ప్రాంతాల్లో స్థిరమైన, అనూహ్యమైన భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. హిమాలయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని.. దీనికోసం భారత్ సిద్ధంగా ఉండాలని గత నవంబర్ లో శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇంక ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించే మార్గాలపై దృష్టిపెట్టాలని సూచించారు. భారత్, యురేషియన్ ప్లేట్ ల మధ్య ఘర్షణ ఫలితంగా హిమాలయాల్లో భూకంపాలు సంభవించవచ్చని.. వాడియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ సీనియర్ జియోఫిజిసిస్ట్ అజయ్ పాల్ (Ajay paul) తెలిపారు.

‘హిమాలయాల కింద వడకట్టిన శక్తి చేరడం వలన భూకంపాలు సంభవించడం అనేది సాధారణ ప్రక్రియ. మొత్తం హిమాలయ ప్రాంతంలో ప్రకంపనలు రావొచ్చు. అలాగే పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉంది. అయిన భూకంపం (Earthquake) ఎప్పుడు వస్తుందో అంచనా వేయలేము. తదుపరి క్షణం, వచ్చే నెల, లేదా 100 తర్వాతైనా భూకంపాలు రావచ్చు’ అని అజయ్ అన్నారు. భారతదేశం (India)లో గత 150 ఏళ్లలో హిమాలయ ప్రాంతంలో 4 భారీ భూకంపాలు వచ్చాయి. 1897లో షిల్లాంగ్‌లో, 1905లో కాంగ్రాలో, 1934లో బీహార్-నేపాల్‌లో, 1950లో అస్సాంలో భూకంపాలు వచ్చాయి.

Also Read: SSMB 28 Update: మహేష్ బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు.. శరవేగంగా SSMB 28 షూటింగ్!