Home Loan : హోం లోన్ తీసుకునే ముందు.. ఇవి తప్పక తెలుసుకోండి

హోం లోన్ తీసుకుంటున్నారా ? అయితే తొందరపడొద్దు. కొన్ని విషయాలను మీరు ముందుగా తెలుసుకోండి.

  • Written By:
  • Publish Date - June 12, 2024 / 02:35 PM IST

Home Loan : హోం లోన్ తీసుకుంటున్నారా ? అయితే తొందరపడొద్దు. కొన్ని విషయాలను మీరు ముందుగా తెలుసుకోండి. ఆ తర్వాతే బ్యాంకు ఇచ్చే హోం లోన్ ఆఫర్‌కు ఓకే చెప్పండి. లేదంటే తర్వాత  ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మిగతా లోన్లతో పోలిస్తే హోం లోన్ (Home Loan) చాలా రిస్కీ. మన సంపాదనలో, జీవితంలో ఎక్కువ భాగాన్ని దాని రీపేమెంటుకే వెచ్చించాల్సి వస్తుంది. ఈవిషయాన్ని గుర్తుంచుకొని తెలివైన నిర్ణయం తీసుకోవాలి.

We’re now on WhatsApp. Click to Join

  • మీ క్రెడిట్‌ స్కోరు బాగుంటేనే బ్యాంకులు మీకు హోం లోన్ ఇస్తాయి.  అప్పులు, క్రెడిట్‌ కార్డు బకాయిల చెల్లింపుల్లో మీరు ఎంత బాగా ఉన్నారనేది సిబిల్ స్కోరు చెబుతుంది.  తక్కువ వడ్డీ రేటుతో ఎక్కువ హోం లోన్ కావాలంటే మీ సిబిల్‌ స్కోరు 750 కంటే ఎక్కువ ఉండాలి.
  • హోం లోన్‌కు అప్లై చేశాక కేవైసీ పత్రాలు, ఆదాయ పత్రాలు, ఆస్తి పత్రాలను బ్యాంకుకు సమర్పించాలి.  పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీలను కేవైసీ పత్రాలుగా పరిగణిస్తారు. వీటిని మీ గుర్తింపు, చిరునామా రుజువులుగా బ్యాంకు పరిగణిస్తుంది. మీ 3 నెలల శాలరీ స్లిప్‌లు, బ్యాంకు స్టేట్‌మెంట్స్‌, ఆదాయపు పన్ను రిటర్న్‌లు, గత మూడు సంవత్సరాల ఆదాయ అసెస్‌మెంట్‌ వివరాలను బ్యాంకుకు ఇవ్వాలి.
  • మన హోం లోన్ అప్లికేషన్‌ను ఆమోదించిన తర్వాత బ్యాంకు ప్రాసెసింగ్‌ ఫీజును వసూలు చేస్తుంది. హోం లోన్ మొత్తంలో 0.50 నుంచి 1 శాతం వరకు లోన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు ఉంటుంది. ఈ ఫీజు తక్కువగా తీసుకునే బ్యాంకు ఆఫరుకు మనం ప్రయారిటీ ఇవ్వాలి.

Also Read :Gender Equality : లింగ సమానత్వంలో దిగజారిన భారత్ ర్యాంక్.. పాక్ ఎక్కడుందంటే..

  • మనం తీసుకునే హోం లోన్ మొత్తంలో దాదాపు 10 నుంచి 15 శాతం మొత్తాన్ని డౌన్‌ పేమెంట్‌గా చెల్లించాలి. మిగిలిన హోం లోన్ అమౌంటును ఈఎంఐలుగా మారుస్తారు. ఈఎంఐ భారం తక్కువ ఉండాలనుకుంటే.. డౌన్‌ పేమెంట్‌ సాధ్యమైనంత ఎక్కువగా చేయాలి.
  • కొన్ని బ్యాంకులు దరఖాస్తుదారుడి అర్హతను బట్టి హోం లోన్‌ రీపేమెంట్ కాలపరిమితిని 30 ఏళ్ల వరకు అందిస్తాయి. సాధ్యమైనంత త్వరగా లోన్ కట్టేందుకు ఇష్టపడే వారికి బ్యాంకులు ప్రయారిటీ ఇస్తాయి.
  • హోం లోన్ ఈఎంఐ ఎంత ఉండాలి అనేది మన ఆదాయ వనరుల ఆధారంగా నిర్ణయించుకోవాలి.  మీ మొత్తం ఆదాయంలో 45 శాతానికి మించకుండా ఈఎంఐ ఉండాలని గుర్తుంచుకోండి.
  • హోం లోన్ తీసుకునేటప్పుడు వడ్డీ రేటు చాలా ముఖ్యం. వడ్డీరేటు తక్కువగా విధించే బ్యాంకులకు మీరు ప్రయారిటీ ఇవ్వాలి. ఫిక్స్‌డ్‌ (స్థిర) వడ్డీరేట్లు, ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లు ఉంటాయి.  స్థిర వడ్డీ రేట్లపై మనం హోం లోన్ తీసుకుంటే రుణ కాలవ్యవధిపై ఈఎంఐలు మారవు. ఒకవేళ మనం ఫ్లోటింగ్‌ వడ్డీ రేటుపై హోం లోన్ తీసుకుంటే.. రుణంపై విధించే వడ్డీ రేట్లలో మార్పులు జరుగుతుంటాయి.
  • ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఏ బ్యాంకు/ఆర్థిక సంస్థ కూడా ముందస్తు చెల్లింపు పెనాల్టీలను వసూలు చేయకూడదు. లోన్ తీసుకున్న తర్వాత మీకు మిగులు నగదు ఉన్నప్పుడు కొంత లోన్‌ మొత్తాన్ని ముందే కట్టేయొచ్చు.
  • హోం లోన్ తీసుకునేవారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 24 కింద, సెక్షన్‌ 80సీ కింద పన్ను రాయితీలు పొందొచ్చు.
  • హోం లోన్‌ ఇన్సూరెన్స్‌ అనేది ఈ రుణం తీసుకున్న వారికి అందించే బీమా ప్లాన్‌. ఈ పాలసీ కొనుగోలు చేసిన వ్యక్తికి ఏదైనాా జరిగితే.. బకాయి ఉన్న రుణ మొత్తాన్ని బీమా సంస్థ తిరిగి చెల్లిస్తుంది.
  • హోం లోన్ తీసుకున్నాక కట్టకపోతే క్రెడిట్‌ స్కోరు తగ్గిపోతుంది. బ్యాంకు చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే మీ ఆస్తిని విక్రయిస్తుంది.