Site icon HashtagU Telugu

Credit Card : ‘క్రెడిట్ కార్డు’ పోయిందా ఇలా చేయండి

Credit Card Disadvantages

Credit Card Disadvantages

Credit Card : క్రెడిట్ కార్డులను ఇప్పుడు చాలామంది వాడుతున్నారు. డబ్బులు చేతిలో లేనప్పుడు మనల్ని అవసరాల నుంచి గట్టేక్కించేవే క్రెడిట్ కార్డులు.  క్రెడిట్ కార్డు పోతే ఏం చేయాలి ? వైఫై యాక్సిస్ ఉన్న క్రెడిట్ కార్డులు పోతే ఎలా ? అనే దానిపై చాలామంది హైరానా పడుతుంటారు.  ఆందోళన చెందడం ఆపేసి.. కొన్ని టిప్స్‌ను ఫాలో అయితే క్రెడిట్ కార్డు దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేయొచ్చు. ఈక్రమంలో క్రెడిట్ కార్డ్(Credit Card) యూజర్స్ ఏం చేయాల్సి ఉంటుందనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

We’re now on WhatsApp. Click to Join

కస్టమర్ కేర్

ఒకవేళ మీ క్రెడిట్ కార్డు పోతే వెంటనే మీ బ్యాంకు కస్టమర్ కేర్​కు కాల్ చేయండి. సాధారణంగా బ్యాంకు టోల్ ఫ్రీ నెంబర్ కార్డు వెనుక భాగంలో ఉంటుంది. ఒకవేళ ఆ నంబరు మీ దగ్గర లేకుంటే .. టోల్ ఫ్రీ నెంబర్ కోసం గూగుల్​లో వెతకండి. అయితే కాల్ చేసేటప్పుడు తప్పనిసరిగా మీ అకౌంట్ నెంబర్, ఇటీవల కాలంలో చేసిన లావాదేవీల వివరాలను మీ దగ్గర రెడీగా ఉంచుకోండి. ఎందుకంటే కస్టమర్ కేర్ ప్రతినిధి ఆ వివరాలను మీ నుంచి అడుగుతారు. వాటిని చెప్పాక మీ కార్డును బ్లాక్ చేసి, కొత్త కార్డును ఇష్యూ చేస్తారు.

నెట్ బ్యాంకింగ్

క్రెడిట్ కార్డు పోయిన వారికి ఒకవేళ  నెట్ బ్యాంకింగ్ వసతి ఉంటే..  వెంటనే నెట్ బ్యాంకింగ్ ద్వారా అకౌంట్​లోకి లాగిన్ కావాలి. అందులో కార్డు లేదా సర్వీస్ అనే ఆప్షన్​ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోండి. అక్కడ లాస్ట్ కార్డు (lost card) అనే ఆప్షన్ వద్దకు వెళ్లి బ్లాక్ రిక్వెస్ట్​పై క్లిక్ చేయండి. అంతే మీ కార్డును బ్లాక్ చేసే రిక్వెస్ట్ బ్యాంకుకు వెళ్లిపోతుంది.

ఎస్​ఎం​ఎస్​

క్రెడిట్ కార్డు పోయినవారు ఎస్​ఎం​ఎస్​ల ద్వారా కూడా దాన్ని బ్లాక్ చేయొచ్చు.  అయితే ఈవిధంగా బ్లాక్ చేసే ఆప్షన్​ను కొన్ని బ్యాంకులు మాత్రమే కల్పిస్తాయి. ఒకవేళ మీ బ్యాంకుకు ఆ ఆప్షన్ ఉంటే వెంటనే మీ రిజిస్టర్డ్ మెుబైల్ నెంబర్ నుంచి బ్లాక్ అని టైప్ చేసి మీ బ్యాంకు ప్రొవైడ్ చేసిన నెంబర్​కు మెసేజ్ చేయండి. దాని ఆధారంగా మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేసే ప్రక్రియను బ్యాంకు మొదలుపెడుతుంది.

బ్యాంక్ విజిట్

మీ క్రెడిట్ కార్డు పోతే.. నేరుగా బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేయడం ద్వారా కూడా దాన్ని బ్లాక్ చేయించవచ్చు. అయితే ఇందుకోసం ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది. కాసేపు బ్యాంకులో కూర్చొని వెయిట్ చేయాల్సి ఉంటుంది. మొత్తాన్ని మీ కార్డు దుర్వినియోగం కాకుండా బ్లాక్ అయితే చేసేస్తారు. ఈ పద్ధతి కంటే పైన చెప్పిన మిగతా మార్గాల్లోనే మీ టైం ఎక్కువగా సేవ్ అవుతుంది.

Also Read : Submarine Missile : సముద్ర గర్భం నుంచి ప్రయోగించే మిస్సైల్.. వచ్చే నెలలోనే టెస్టింగ్