Site icon HashtagU Telugu

China Urine Business : ఇండియాకు మూత్రం సప్లై లో చైనా టాప్.. ఆత్మ నిర్భర్ దిశగా ఇండియా

China Urine Business

China Urine Business

China Urine Business : సంతానం కోసం ఇప్పటికే ఎన్నో రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి.. 

అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ(ART), ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) గురించి మనకు బాగా తెలుసు.. 

అయితే ఈ చికిత్సలలో భాగంగా అందించే ఫెర్టిలిటీ హార్మోన్లలో మూత్రం నుంచి సేకరించే ప్రోటీన్స్ కూడా ఉంటాయని మనకు తెలియదు..

మన ఇండియాలో ఫెర్టిలిటీ హార్మోన్ల తయారీలో టాప్ కంపెనీ “భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్” కు అత్యధికంగా మూత్రం సప్లై చైనా నుంచే జరుగుతుందని మనకు తెలియదు.. 

ఇందులోనూ ఆత్మనిర్భర్ గా మారేందుకు “భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్”  రెడీ అవుతోంది.. ఎలా అంటే.. ?

చివరకు మూత్రం సప్లై బిజినెస్ లోనూ చైనా టాప్ ప్లేస్ లో ఉంది. వైద్య పరిశోధనలకు, ఔషధ తయారీ సంస్థలకు మూత్రాన్ని సప్లై(China Urine Business) చేసే విషయంలోనూ డ్రాగన్ ముందంజలో ఉంది. అయితే త్వరలోనే చైనాకు ఇండియా షాక్ ఇవ్వబోతోంది. ఫెర్టిలిటీ హార్మోన్ల తయారీ కోసం  చైనా నుంచి భారీగా మూత్రాన్ని దిగుమతి చేసుకుంటున్న మన ఇండియా కంపెనీ “భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్” ఒక కొత్త టెక్నాలజీని రెడీ చేసుకుంటోంది. అదే.. రీకాంబినెంట్ టెక్నాలజీ. ఇప్పటివరకు చైనా నుంచి మూత్రాన్ని కొని..  దాన్ని చల్లటి వాతావరణంలో స్టోర్ చేసి, వివిధ ప్రాసెస్ ల తర్వాత అందులో నుంచి ప్రత్యేక ప్రోటీన్ ను సేకరించేవారు. రీకాంబినెంట్ టెక్నాలజీతో ఆ ప్రాసెస్ అక్కర లేకుండానే కృత్రిమంగా ల్యాబ్ లో మూత్రపు ప్రోటీన్ ను తయారు చేసే వీలు ఉంటుంది. వచ్చే ఏడాదికల్లా ఈ దిశగా తమ ఫ్యాక్టరీలను అప్ గ్రేడ్ చేసుకోవడంపై  “భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్” దృష్టిపెట్టింది.

Also read  : Virgin Birth : సెక్స్ లేకుండానే సంతానం.. తొలిసారిగా మొసళ్లలో గుర్తింపు

అదే జరిగితే చైనా యూరిన్ బిజినెస్ ఢమాల్ అవుతుంది. ఫెర్టిలిటీ హార్మోన్లలో గుర్రం నుంచి సేకరించిన సీరం, మనిషి రక్తం, మనిషి మూత్రం వాడుతారు. ఇప్పటికే  రీకాంబినెంట్ టెక్నాలజీతో గుర్రం సీరం, మనిషి రక్తంలను “భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్” తయారు చేస్తోంది. ఇక మనిషి మూత్రంను కూడా ఈ టెక్నాలజీతో డెవలప్ చేయడమే తరువాయి. ఇది కూడా త్వరలో జరగడం ఖాయమని  “భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్” వర్గాలు వెల్లడించాయి.   “మొత్తం 5 రకాల ఫెర్టిలిటీ హార్మోన్లను మేం తయారు చేస్తుంటాం. అయితే వీటిలో రెండు పూర్తిగా రీకాంబినెంట్ టెక్నాలజీతో రెడీ అవుతున్నాయి. వచ్చే ఏడాదికల్లా మిగితా మూడింటిని కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానంతో డెవలప్ చేస్తాం” అని తెలిపాయి.