Site icon HashtagU Telugu

Alert To Banks : బ్యాంకులకు కేంద్ర ఆర్థికశాఖ అలర్ట్.. ఎందుకో తెలుసా ?

Cyber Criminals Phone Cal

Cyber Criminals Phone Cal

Alert To Banks : బ్యాంకులకు కేంద్ర  ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. సైబర్ నేరగాళ్ల బారి నుంచి ఖాతాదారులను రక్షించేందుకు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని కోరింది. ఇందులో భాగంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు అందించే మర్చంట్లు, బిజినెస్ కరస్పాండెంట్ల (బీసీల)పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. సైబర్ మోసాలలో కొందరు బిజినెస్ కరస్పాండెంట్లు,  పలువురు మైక్రో ఏటీఎంల నిర్వాహకుల ప్రమేయం ఉంటోందన్న విషయాన్ని బ్యాంకులకు కేంద్రం గుర్తు చేసింది. అలాంటి వారిని గుర్తించాల్సిన బాధ్యత బ్యాంకులపైనే ఉంటుందని తెలిపింది. మర్చంట్లు, బిజినెస్ కరస్పాండెంట్ల స్థాయిలోనే రాజీపడే అవకాశాలు, మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆర్థిక శాఖ(Alert To Banks) గుర్తించినట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం డేటా భద్రత, రక్షణ కూడా ఎంతో కీలకమని కేంద్రం పేర్కొంది.ఈ అంశాలపై సమీక్షించాలంటూ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి కూడా మార్గదర్శకాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ‘బీఓబీ వరల్డ్’ యాప్‌లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఇలాంటి ఆర్థిక మోసాలను అరికట్టేందుకు కేంద్ర ఆర్థిక  శాఖ రంగంలోకి దిగింది. కాగా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2023లో మన దేశంలో రూ.7,489 కోట్ల విలువైన సైబర్ మోసాలు జరిగాయి. వాటికి సంబంధించి 11.28  లక్షల కేసులు నమోదయ్యాయి.

Also Read :TDP : వారందరికీ పదవులు.. టీడీపీ కీలక నిర్ణయం

వాహనదారులకు ఈ–చలాన్ల పేరిట నకిలీ ఎస్‌ఎంఎస్‌లు 

సైబర్ కేటుగాళ్లు రోజుకో కొత్త మోసానికి తెరతీస్తున్నారు. తాజాగా వాహనదారులకు ఈ–చలాన్ల పేరిట నకిలీ ఎస్‌ఎంఎస్‌లు  పంపుతూ మోసాలకు పాల్పడ్డారు. అచ్చం పోలీసుల నుంచే వచ్చినట్లుగా అనిపించే నకిలీ వెబ్‌సైట్‌ లింకులను సైబర్ కేటుగాళ్లు పంపినట్లు వెల్లడైంది. వాటిపై క్లిక్‌ చేసిన తర్వాత ఆన్‌లైన్‌ పేమెంట్‌ పేరిట బ్యాంకు ఖాతా, వ్యక్తిగత వివరాలు సేకరించి అందినకాడికి సొమ్ము కొల్లగొట్టారని వెలుగులోకి వచ్చింది. తాజాగా ముంబైలో ఈ తరహా కేసు ఒకటి నమోదైంది. ముంబైలోని పెద్దార్‌రోడ్‌ ప్రాంతానికి చెందిన ఓ వాహనదారుడికి ఇలా నకిలీ మెసేజ్‌ పంపి పలు దఫాల్లో రూ.3 లక్షలు కొట్టే సినట్లు వెల్లడించారు. ‘వాహన్‌పరివాహన్‌. ఏపీకే (vahanaparivahan.apk)అనే మొబైల్‌ యాప్‌ పేరిట ఈ లింక్‌‌ను సైబర్ నేరగాళ్లు పంపారు. ఈ–చలాన్‌ చెల్లించాలంటే ఈ యాప్‌ ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటూ సాధారణ మెసేజ్‌ల తోపాటు వాట్సాప్‌ సందేశాలను వారు పంపుతున్నట్లు వెల్లడైంది.