Site icon HashtagU Telugu

Luxury King : హెయిర్ కటింగ్ కు నెలకు 16 లక్షలు.. ఇంట్లో 257 స్నానపు గదులు

Luxury King

Luxury King

Luxury King : హెయిర్ కట్ కు మీరు ఎంత పే చేస్తారు ?

మామూలు సెలూన్ లో రూ.100 .. లగ్జరీ  సెలూన్ లో రూ.300.. అల్ట్రా లగ్జరీ  సెలూన్ లో రూ.500!!

కానీ ఒకాయన ప్రతినెలా హెయిర్ కట్ కు రూ.16 లక్షలు ఖర్చు చేస్తున్నాడు..

లండన్ నుంచి వాళ్ళ ఇంటికి ప్రతినెలా రెండుసార్లు ప్రత్యేక విమానంలో బార్బర్ వస్తాడు..

ఆయన ఇంట్లో.. 257 స్నానం గదులు, 7000 లగ్జరీ కార్లు ఉన్నాయి. 

బ్రూనై.. ఇది ఒక చిన్నదేశం. ఇండోనేషియా పక్కనే ఈ కంట్రీ ఉంటుంది. ఆ దేశపు రాజు(Luxury King) పేరు  హస్సనల్ బోల్కియా ఇబ్న్ ఉమర్ అలీ సైఫుద్దీన్. ఆయనకు రూ.1.4 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక ప్యాలెస్‌ విషయానికి వస్తే.. అది 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. దాని గోడలపై బంగారు పూత ఉంటుంది. ఈ ప్యాలెస్ గోపురం 22 క్యారెట్ల బంగారంతో నిండి ఉంది. దీన్ని శుభ్రపరిచేందుకు ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు. రాజులు ఇచ్చే విందులలో బంగారు పాత్రలలో భోజనాన్ని వడ్డిస్తారు. ఎంపిక చేసిన కొద్దిమందికి మాత్రమే ప్యాలెస్‌లోకి ప్రవేశించే హక్కు ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ప్యాలెస్. ఇందులో 1788 గదులు, 257 స్నానపు గదులు, ఐదు ఈత కొలనులు ఉన్నాయి. ప్యాలెస్‌లో 110 గ్యారేజీలు, 200 గుర్రాల కోసం ఎయిర్ కండిషన్డ్ లాయం కూడా ఉన్నాయి. ఈ ప్యాలెస్‌లో 800 కార్లు ఉంచడానికి గారేజ్ ఉంది. బ్రూనై సుల్తాన్ సైఫుద్దీన్ హెయిర్‌కట్ కోసం ప్రతినెలా దాదాపు రూ. 16 లక్షలు ఖర్చు చేస్తాడు. అతని హెయిర్‌ స్టైలిస్ట్‌లను నెలకు రెండుసార్లు ప్రైవేట్ చార్టర్డ్ విమానం ద్వారా లండన్ నుంచి తీసుకొస్తారు. బ్రూనై సుల్తాన్‌ ప్యాలెస్ లో ఒక జంతు ప్రదర్శనశాల కూడా ఉంది. ఇందులో 30 బెంగాల్ పులులు, గద్దలు, ఫ్లెమింగోలు, కాకాటూలు ఉన్నాయి. సుల్తాన్‌కు గోల్ఫ్ అంటే ఇష్టం. అతను గోల్ఫ్ కోర్స్ రూపకల్పన కోసం ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన గోల్ఫ్ క్రీడాకారుడు జాక్ నిక్లాస్‌ను నియమించుకున్నాడు. సుల్తాన్ తన వందలాది హోటళ్లలో ఒకటైన ఎంపైర్ హోటల్‌లో గోల్ఫ్ కోర్స్ నిర్మించాలని కోరుకున్నాడు.

Also read : King Charles III : కింగ్ చార్లెస్ తర్వాత బ్రిటన్ రాజు ఎవరు ? పోటీదారులు ఎవరెవరు ?

7000 లగ్జరీ కార్లు.. బంగారం పూతతో రోల్స్ రాయిస్    

బ్రూనై సుల్తాన్ సైఫుద్దీన్ వద్ద 7000 లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటి విలువ దాదాపు 341 బిలియన్లు. ఇందులో 600 రోల్స్ రాయిస్ ,300 ఫెరారీ కార్లు ఉన్నాయి. 1990లలో విక్రయించబడిన రోల్స్ రాయిస్‌లలో సగం బోల్కియా కుటుంబమే కొనుగోలు చేసిందని అంటారు.  2011లో అతను అతిపెద్ద రోల్స్ రాయిస్ కార్ల  సేకరణకుగానూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ లోకి ఎక్కాడు. సుల్తాన్‌ దగ్గర  ప్రత్యేక రోల్స్ రాయిస్ ఒకటి ఉంది. ఇది తెరవగలిగే పైకప్పును కలిగి ఉంది. ఈ కారు గ్రిల్స్ నుంచి టైర్ల వరకు అంతా బంగారం పూతతో నిండి ఉంటుంది. సుల్తాన్ కార్ల కలెక్షన్లలో లంబోర్ఘిని ముర్సిలాగో LP640, బెంట్లీ కాంటినెంటల్ R, ఫెరారీ మైథోస్ కాన్సెప్ట్ కారు, ఫెరారీ 456 GT సెడాన్, ప్రపంచంలోనే ఏకైక కుడి చేతి Mercedes-Benz CLK-GTR కారు, ఐదు మెక్‌లారెన్ F1లు కూడా ఉన్నాయి.

Also read : Charles III Coronation: కాబోయే బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3 గురించి A టు Z

బంగారం పూత పూసిన  ప్రైవేట్ జెట్

బ్రూనై సుల్తాన్‌కు బంగారం పూతపూసిన ప్రైవేట్ జెట్ కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 3,000 కోట్లు. విమానం లోపల రాజు కూర్చోవడానికి విలాసవంతమైన సోఫా ఉంది. బంగారు వాష్ బేసిన్లు, బంగారు పూతతో కూడిన కిటికీలతో సహా ఎన్నో యాక్సెసరీస్ ఉన్నాయి. ఈ విమానంలో నేలపై బంగారు నక్షత్రాల తివాచీ పరిచి ఉంది. దానిలోపల పడుకోవడానికి పడక ఏర్పాటు కూడా ఉంది. సుల్తాన్ వద్ద బోయింగ్ 767-200,  ఎయిర్‌బస్ A340-200, రెండు సికోర్స్కీ హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. వీటిలో ఆయన  విదేశాలకు వెళ్లి వస్తుంటారు. బ్రూనై సుల్తాన్‌ తన కుమార్తెకు పుట్టినరోజున ఒక ఎయిర్‌బస్ A340 విమానాన్ని బహుమతిగా ఇచ్చాడనే నివేదికలు ఉన్నాయి. బ్రూనై సుల్తాన్‌ 3 బిలియన్ల విలువైన ఓడను కొనుగోలు చేసి, దాని పునర్నిర్మాణానికి 10 బిలియన్లు ఖర్చు చేశారు.