Love Story : దృష్టి లోపమున్నా కల నెరవేర్చుకున్న సిమ్రాన్.. కోచ్‌గా మారిన భర్త

సిమ్రాన్ శర్మ.. ఇప్పుడు మన దేశంలో ఈమె ఒక సంచలనం.

  • Written By:
  • Updated On - May 28, 2024 / 01:49 PM IST

Love Story : సిమ్రాన్ శర్మ.. ఇప్పుడు మన దేశంలో ఈమె ఒక సంచలనం. పుట్టుకతోనే దృష్టి లోపం కలిగిన సిమ్రాన్ ఇటీవల  జ‌పాన్ వేదిక‌గా జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ పోటీల్లో సత్తాచాటారు.  మహిళల 200 మీటర్ల విభాగంలో జరిగిన పోటీల్లో రాణించి గోల్డ్ మెడల్ సాధించారు.  ఆమె విజయం వెనుక ఒక లవ్ స్టోరీ ఉంది. అదేంటో తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

ప్రపంచ పారా అథ్లెటిక్స్ పోటీల్లో సిమ్రాన్ శర్మ కేవ‌లం 24.95 సెకన్లలోనే 200 మీటర్ల ప‌రుగును పూర్తి చేశారు. దీంతో ఈ పోటీల్లో మన దేశానికి ఆరో గోల్డ్ మెడల్ లభించింది. త్వరలో పారిస్ ఒలింపిక్స్‌ జరగనున్నాయి. ఆ ఘట్టానికి ముందే తనకు ఈ రూపంలో గోల్డ్ మెడల్ లభించినందుకు సిమ్రాన్ హర్షం వెలిబుచ్చారు. ఈ గెలుపుతో తన ఆత్మవిశ్వాసం పెరిగిందని.. ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటుతానని ఆమె తెలిపారు.

Also Read : Dera Chief : డేరా బాబా గుర్మీత్ రామ్‌ రహీమ్‌ నిర్దోషి.. హైకోర్టు సంచలన తీర్పు

సిమ్రాన్ కెరీర్ గ్రాఫ్‌లోని కీలక పాయింట్స్

  • సిమ్రాన్ పూర్తిగా 9 నెలలు నిండ‌కుండానే.. ఆరున్నర నెలలకే జన్మించింది. పుట్టినప్పటి నుంచే ఆమెకు దృష్టి లోపం ఉంది.
  • ఆమెకు చిన్నప్పటి నుంచే అథ్లెటిక్స్ అంటే చాలా ఇష్టం.
  • స్కూలులో జరిగే పోటీల్లోనూ సిమ్రాన్ పాల్గొనేవారు.
  • స్కూలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ.. క్రమంగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల దాకా ఆమె చేరుకున్నారు.
  • 2015 సంవత్సరంలో ఢిల్లీలోని ఎమ్ఎమ్ కాలేజీ గ్రౌండ్‌లో సిమ్రాన్‌తో గజేంద్ర సింగ్‌కు పరిచయం ఏర్పడింది.
  • గ‌జేంద్ర సింగ్ ఆర్మీలో పని చేస్తున్నారు.
  • గజేంద్ర సింగ్ కూడా అథ్లెట్ కావాలని కలలు కనేవారు. కానీ ఆయన కల నెరవేరలేదు. ఆర్ధిక స్థోమ‌త లేక అథ్లెటిక్స్‌లో ట్రైనింగ్ తీసుకోలేకపోయారు.
  • సిమ్రాన్, గజేంద్ర సింగ్ మధ్య చిగురించిన ప్రేమ పెళ్లిగా(Love Story) మారింది.
  • తొలుత గజేంద్ర కుటుంబం వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ గజేంద్ర  తన ఫ్యామిలీని కాదని.. సిమ్రాన్​నే పెళ్లి చేసుకున్నారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ త‌మ కుటుంబాలకు దూరంగాన ఉంటున్నారు.
  • పెళ్లయ్యాక సిమ్రాన్‌కు అథ్లెటిక్స్ కోచ్‌గా గజేంద్ర మారిపోయారు.
  • మంచి అథ్లెట్ కావాలనే తన కలను భార్య సిమ్రాన్ ద్వారా నెరవేర్చుకోవాలని గజేంద్ర సింగ్ నిర్ణయించుకున్నారు.
  • తన భార్యకు మెరుగైన కోచింగ్ ఇప్పించేందుకు గజేంద్ర లోన్లు తీసుకున్నారు. త‌న పేరిట ఉన్న స్ధలాన్ని అమ్మేశారు.
  • ఈ కష్టమంతా ఫలించి.. ఇటీవల జపాన్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ పోటీల్లో ఛాంపియన్‌గా సిమ్రాన్ శర్మ నిలిచారు.