Mortuary Magic : మార్చురీలో డెడ్ బాడీ.. మళ్లీ బతికి, చనిపోయిన ముసలమ్మ

Mortuary Magic : బ్రెజిల్‌కు చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు నార్మా  సిల్వేరియా డాసిల్వా కాలేయ సమస్యతో బాధపడుతూ అపస్మారక స్థితికి చేరుకుంది. 

  • Written By:
  • Updated On - December 2, 2023 / 03:04 PM IST

Mortuary Magic : బ్రెజిల్‌కు చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు నార్మా సిల్వేరియా డాసిల్వా కాలేయ సమస్యతో బాధపడుతూ అపస్మారక స్థితికి చేరుకుంది.  దీంతో  శాన్ జోస్ నగరంలోని ఆస్పత్రికి ఆమెను తరలించగా కొన్ని గంటల పాటు చికిత్స అందించారు. అనంతరం వృద్ధురాలు చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఆ వెంటనే డెత్ సర్టిఫికెట్‌ను కూడా ఆస్పత్రి నిర్వాహకులు జారీ చేశారు. వృద్ధురాలు నార్మా సిల్వేరియా డాసిల్వా ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌’తో చనిపోయారని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మార్చురీలో ఉన్న కార్మికుడు.. డెడ్ బాడీని తాకి చూడగా అది ఇంకా వెచ్చగా అనిపించింది. శరీరం చుట్టూ కట్టిన బ్యాగ్‌ను తెరిచి చూడగా.. ఆ ముసలావిడ బలహీనంగా ఊపిరి పీల్చుకుంటూ కనిపించింది. అయితే స్పృహలో లేనందున ఆమె సహాయాన్ని అడగలేకపోయింది.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో వెంటనే మరోసారి వృద్ధురాలిని  ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మళ్లీ రెండు, మూడు గంటల పాటు ఆమెకు చికిత్స అందించారు. చివరకు ఆమె చనిపోయిందని ప్రకటించి, ఇంకోసారి డెత్ సర్టిఫికెట్‌ను కూడా జారీ చేశారు. చనిపోకున్నా చనిపోయిందని నిర్ధారించి.. గాలి చొరబడని బ్యాగ్‌లో కట్టేసి.. మార్చురీకి పంపిన క్రమంలోనే వృద్ధురాలు నార్మా  సిల్వేరియా డాసిల్వా ఆరోగ్యం క్షీణించిందని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. మార్చురీ బ్యాగ్‌లో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయే స్థితికి ముసలావిడ చేరుకుందని చెప్పారు. ముందుగా ఆస్పత్రిలో చేర్పించగానే వెంటనే సరైన చికిత్స అందించి ఉంటే నార్మా  సిల్వేరియా డాసిల్వా బతికి ఉండేదని ఆమె కుటుంబీకులు తెలిపారు. ప్రాణనష్టం చేసినందుకుగానూ ఆ ఆస్పత్రిపై కోర్టులో కేసు వేస్తామని వృద్ధురాలి బంధువులు(Mortuary Magic) తెలిపారు.