Vegetable Combination : రెండు రకాల కూరగాయలను కలిపి వండడం ఎంతోమందికి అలవాటు. దీనివల్ల పోషకాలు ఎక్కువగా అందుతాయి. రుచి కూడా బాగుంటుంది. అయితే కొన్ని రకాల కూరగాయల కాంబినేషన్లు రుచిపరంగా బాగానే ఉన్నా.. ఆరోగ్యపరంగా కీడును చేస్తాయి. కాబట్టి ఫుడ్ కాంబినేషన్ల విషయంలో కొంత అలర్ట్గా ఉండాలి. కొన్ని కూరగాయలు, ఆకుకూరలు, దుంపలను కలిపి వండకూడదు. అలాంటి కాంబినేషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
- పాల ఉత్పత్తులను, పండ్లను కలిపి తీసుకోరాదు.
- పెరుగును పండ్లను కలిపి తినకూడదు.
- పాలు లేదా పెరుగు తిన్న రెండు గంటల తర్వాత పండ్లను తినాలి.
- పండ్లు తిన్న కొంత టైం తర్వాతే పాలు, పెరుగు తాగాలి.
- టమాటాలు, చిలగడదుంపలను కలిపి వండకూడదు. వీటిని కలిపి తింటే అజీర్తి సమస్యలు వస్తాయి. ఆహారం తిన్నాక అలసటగా అనిపిస్తుంది.
- భోజనం చేశాక అలసటగా అనిపిస్తే.. మీరు రాంగ్ ఫుడ్ కాంబినేషన్ తిన్నారని అర్థం.
- భోజనం చేసిన వెంటనే పండ్లను తినకూడదు. ఒకవేళ తింటే అవి జీర్ణం కావడానికి ఎక్కువ టైం పడుతుంది.
- భోజనం తిన్నాక రెండు గంటల గ్యాప్ ఇచ్చాకే పండ్లను తినాలి.
- మాంసం ఉత్పత్తులు, బంగాళాదుంపలు కలిపి తినకూడదు. ఒకవేళ తింటే ఈ రెండు పదార్థాల అరుగుదల కోసం ఎక్కువగా జీర్ణ రసాలు ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా కడుపులో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది.
Also Read: Revanth Reddy: డిసెంబర్ 3న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రిపీట్ అవుతాయి: రేవంత్ తో కాంగ్రెస్ నేతల ధీమా
వారంలో ఎన్నిసార్లు మటన్ తినాలి ?
మాంసంలో ప్రొటీన్ ‘బయో అవైలబిలిటీ’ అధికం. ఒక ఆహారంలో ఎంత ప్రొటీన్ ఉన్నా.. దాన్ని శరీరం ఎంత శోషించుకుంటుంది అనేదే ముఖ్యం. ఇలా శోషించుకునే గుణాన్నే బయో అవైలబిలిటీ అంటారు. శరీరానికి కావలసిన ప్రొటీన్ మాంసంలో అధికంగా ఉంటుంది. ఉడకబెట్టి కూరలాగానో, సూప్లానో మాంసాన్ని తీసుకుంటే ఫర్వాలేదు. వేపుళ్లు అస్సలు మంచివి కావు. దీనివల్ల ఒంట్లో సంతృప్త కొవ్వులు అధికం అవుతాయి. బరువు పెరుగుతారు, కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. మటన్లో కొలెస్ట్రాల్ అత్యధికం. అందుకే దాని జోలికి ఎక్కువగా పోకపోవడం మంచిది. మాంసాహారం వల్ల కిడ్నీల్లో యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది. ఈ వ్యర్థ పదార్థం పేరుకుపోతే గౌట్ వ్యాధిలాంటివి వస్తాయి. సాధారణ వ్యక్తులు వారంలో మూడుసార్లు మాంసాహారం తీసుకుంటే చాలు. బీపీ, షుగర్ ఉన్నవాళ్లు రెండుసార్లు(Vegetable Combination) తినొచ్చు.