Site icon HashtagU Telugu

Sea Turtle Meat : సముద్ర తాబేలు మాంసానికి 9 మంది బలి.. 78 మందికి అస్వస్థత

Sea Turtle Meat

Sea Turtle Meat

Sea Turtle Meat : వాళ్లంతా ఎప్పటిలాగే ఖుషీఖుషీగా సముద్ర తాబేలు మాంసం తిన్నారు. రుచిగా ఉంటుందని చెప్పుకుంటూ మరీ ఆ మాంసం ఆరగించారు. చివరకు సముద్ర తాబేలు మాంసంలోని  చెలోనిటాక్సిమ్​ అనే హానికారకం వల్ల ఫుడ్​ పాయిజనింగ్ జరిగింది. దీంతో 9 మంది చనిపోయారు. మరణించిన వారిలో 8 మంది పిల్లలే. మరో 78మంది అస్వస్థతకు గురయ్యారు.  ఈ ఘటన తూర్పు ఆఫ్రికా దేశం టాంజానియాలోని స్వతంత్ర ప్రాంతమైన జాంజిబార్​లో ఉన్న పెంబా ద్వీపంలో చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join

సముద్ర తాబేలును తినడం వల్లే 9 మంది చనిపోయారని వైద్య పరీక్షల్లో తేలింది. ఈనేపథ్యంలో పెంబా ప్రాంతంలోని ప్రజలు తాబేలు మాంసాన్ని(Sea Turtle Meat) తినకూడదని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.  2021 నవంబరులోనూ ఇలాగే తాబేలు మాంసాన్ని తిని మూడేళ్ల చిన్నారి  సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు. రుచి కోసం ఆరాటపడి.. తాబేలు మాంసం ఉచ్చులో చిక్కి ఎంతోమంది స్థానికులు ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు.

Also Read :Elections Notification : మార్చి 15లోగా లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ ?

గోవాలోనూ తాబేళ్ల మాంసం సేల్స్

తాబేళ్లలో చాలా రకాలు ఉన్నాయి. అరుదైన వన్యప్రాణి రకమైన నక్షత్ర తాబేళ్లు అంతరించిపోయే జీవరాశుల జాబితాలో ఉన్నాయి. ఈ తాబేళ్లను మాంసం కోసమే మన దేశం నుంచి ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. గోవాలాంటి రాష్ట్రాల్లో తాబేలు మాంసానికి అధిక డిమాండ్ ఉంది. ప్రత్యేకించి ఏపీలోని కొల్లేరు ప్రాంతం నుంచి ఈ తాబేళ్లను పట్టుకుని గోవాకు తరలిస్తున్నట్లు సమాచారం. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఉండే వారి దగ్గరి నుంచి ఒక్కో తాబేలును రూ.15కు కొనుగోలు చేసి.. ఇతర రాష్ట్రాలకు రూ.50 నుంచి రూ.100కు స్మగ్లర్లు విక్రయిస్తున్నారు. అంటే ఒక్కో తాబేలుపై మూడు నుంచి ఆరు రెట్ల లాభం వస్తుంది. తాబేలు మాంసానికి ఇతర రాష్ట్రాల్లో చాలా గిరాకీ ఉండటంతో ఎంత ప్రమాదమయినా రాష్ట్రాలు దాటించేందుకు స్మగ్లర్లు రిస్క్ చేస్తుంటారు. 2022 సంవత్సరం ఫిబ్రవరిలో 25 బస్తాల్లో నాలుగు టన్నుల బరువున్న 724 తాబేళ్లను తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడవి తాబేళ్లతో పాటు నక్షత్ర తాబేళ్లనూ స్మగ్లింగ్ చేస్తూ అనేక ముఠాలు గతంలోనూ పట్టుబడ్డాయి. వన్యప్రాణి చట్టం ప్రకారం అరుదైన నక్షత్ర తాబేలు ఎవరి దగ్గర ఉన్నా శిక్షార్హులేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొన్ని అరుదైన వన్యప్రాణి జాతులు ఉత్తర భారతదేశం మీదుగా చైనా దేశానికి తరలుతున్నాయి.

Also Read : Test Cricket Incentive: బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. టెస్ట్ క్రికెట్ కోసం ఆట‌గాళ్ల‌కు ఇన్సెంటివ్ స్కీమ్..!