6 Months War : హమాస్‌తో ఆరునెలలుగా యుద్ధం.. ఇజ్రాయెల్ గెలుపా ? ఓటమా ?

6 Months War : గతేడాది అక్టోబర్‌ 7వ తేదీన ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య మొదలైన  యుద్ధం ఇంకా కొనసాగుతోంది.

  • Written By:
  • Updated On - April 7, 2024 / 09:22 AM IST

6 Months War : గతేడాది అక్టోబర్‌ 7వ తేదీన ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య మొదలైన  యుద్ధం ఇంకా కొనసాగుతోంది. సైనికపరంగా అత్యంత శక్తివంతమైన దేశం ఇజ్రాయెల్ ఇంకా పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌తో పోరాడుతూనే ఉంది. ఈ ఆరు నెలల యుద్ధంలో  ఇప్పటివరకు 33 వేల మందికిపైగా సామాన్య పాలస్తీనా పౌరులు చనిపోయారు. వీరిలో మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉన్నారు. మిలిటెంట్ సంస్థ హమాస్‌ను అంతం చేసేవరకు యుద్ధాన్ని ఆపేది  లేదని ఇజ్రాయెల్(6 Months War)  అంటోంది.

We’re now on WhatsApp. Click to Join

ఆరు నెలల యుద్ధంలో పాలస్తీనాలోని గాజా ప్రాంతం ప్రధానంగా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాలస్తీనా సరిహద్దులన్నీ ఇజ్రాయెల్ మూసివేసింది. ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్యసమితి చెప్పినా పాలస్తీనా సరిహద్దులు తెరిచేందుకు ఇజ్రాయెల్ ససేమిరా అంటోంది. అవసరమైతే ఎవరితో యుద్ధానికైనా రెడీయే అని ఇజ్రాయెల్ తెగేసి చెబుతోంది. దాదాపు గత 3 నెలలుగా గాజా ప్రాంతంలోని ఆహార ట్రక్కులు ప్రవేశించలేదు. దీంతో చాలామంది ఇప్పటికే ఆకలితో చనిపోయారు. ఇంకొన్ని రోజులు ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే మరింత మంది ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉందని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి చెబుతోంది.

Also Read :AP Hot : ఏపీలో టెంపరేచర్ టెన్షన్.. 45 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

గత  6 నెలల యుద్ధంలో గాజాలోని మిలిటెంట్ల చెర నుంచి ఇజ్రాయెలీ బందీలను విడిపించుకోవడంలో ఇజ్రాయెల్ ఆర్మీ విఫలమైంది. కనీసం ఆ బందీలు గాజాలో ఎక్కడున్నారు ? అనే విషయాన్ని కూడా ఇజ్రాయెల్ దేశ సైన్యం గుర్తించలేకపోయింది. నిఘా, గూఢచార విభాగాల్లో ప్రపంచంలోనే టాప్ క్లాస్ అని చెప్పుకునే ఇజ్రాయెల్‌కు ఇది అతిపెద్ద ఓటమి అని అంతర్జాతీయ మీడియా విశ్లేషిస్తోంది. గాజాలో 500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హమాస్‌ సొరంగాల్లో చాలా వరకు ధ్వంసం చేశామని చెబుతున్న.. వాటిలో దాచిన ఇజ్రాయెలీ బందీలను మాత్రం గుర్తించలేకపోయింది. హమాస్‌కు చెందిన టాప్ కమాండర్ యహ్యా సిన్వార్ గాజాలోనే ఉన్నప్పటికీ ఇప్పటివరకు పట్టుకోలేకపోయింది.   13 వేల మంది ఉగ్రవాదులను హతమార్చామని ఇజ్రాయెల్‌ చెబుతోంది. అయినా నేటికీ 100 మందికిపైగా ఇజ్రాయెలీ బందీలు మిలిటెంట్ల చెరలోనే ఉన్నారు.

ఇలా మొదలైంది.. 

  • గతేడాది అక్టోబర్‌ 7న తెల్లవారుజామున ఆపరేషన్‌ అల్‌-అక్సా స్టార్మ్ పేరుతో హమాస్‌ మిలిటెంట్లు మెరుపుదాడి చేశారు.  దాదాపు 1200 మందిని బలిగొన్నారు. 250 మందికిపైగా బందీలుగా చేసుకుని, గాజాకు తరలించారు.
  • దీంతో ఉలిక్కిపడ్డ ఇజ్రాయెల్‌ ప్రతి దాడులను మొదలుపెట్టింది. యుద్ధాన్ని ప్రకటించింది.
  • ఇప్పటివరకు 109 మంది బందీలు సురక్షితంగా విడుదలయ్యారు. ముగ్గురిని సైన్యం నేరుగా కాపాడింది. 36 మంది వరకు బందీలు చనిపోయి ఉండొచ్చని ఇజ్రాయెల్‌ భావిస్తోంది.
  • ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారని హమాస్‌ చెబుతోంది.
  • తమ వారిని విడిపించాల్సిందిగా ప్రధాని నెతన్యాహుపై బాధితుల కుటుంబీకులు, పౌరుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.