Kenya: గత కొన్ని రోజులుగా కెన్యాలో అతి భారీ వర్షాల (Heavy rains)కారణంగా జనం అతలాకుతలం అవుతున్నారు. దేశంలోని పలు ప్రధాన డ్యామ్లు, నదులు నిండి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ డ్యామ్ తెగిపోయింది. దీంతో ఆ నీరంతా దిగువ గ్రామాల్లోకి వెళ్లి నీటి ప్రవాహానికి దాదాపు 42 మంది మరణించినట్లు నకురు కౌంటీ గవర్నర్ సుసాన్ కిహకా తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, పెద్ద సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోవడంతో.. చాలా మంది ఆచూకీ తెలియకుండా పోయింది. దీంతో ఇళ్ల శిథిలాల్లో, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో పేరుకుపోయిన బురదలో మృతదేహాల కోసం గాలిస్తున్నట్టు స్థానిక అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. వేగంగా సహాయక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.
Read Also: Food: వంకాయతో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా..
మరోవైపు మార్చి, ఏప్రిల్ రెండు నెలల్లోనే 120 మందికిపైగా మరణించినట్టు ఆ దేశ అధికారులు తెలిపారు. 24 వేలకుపైగా ఇళ్లు నీట మునిగాయని.. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు. భారీ వర్షాలు, వరదలతో కెన్యా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. కాగా, కెన్యా పక్కనే ఉన్న టాంజానియా, బురుండి, ఉగాండా దేశాల్లో కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే ఆ దేశాల్లో వందలాది మంది మరణించినట్టు ఇటీవల ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.