Valentines Day : ‘వాలెంటైన్స్ డే’ రోజు ఆ నాలుగు రాశులవారికి లక్కీ ఛాన్స్

Valentines Day : ఫిబ్రవరి 14న మనం ప్రేమికుల రోజును (వాలెంటైన్స్ డే) జరుపుకోబోతున్నాం.

  • Written By:
  • Updated On - February 9, 2024 / 11:23 AM IST

Valentines Day : ఫిబ్రవరి 14న మనం ప్రేమికుల రోజును (వాలెంటైన్స్ డే) జరుపుకోబోతున్నాం. ఆ  రోజు కోసం ఎంతోమంది లవర్స్ ఆతురతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే లవర్స్ అందరూ ఫిబ్రవరి 7 నుంచి ‘వాలెంటైన్స్ వీక్’ మూడ్‌లోకి జారుకున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన లవ్ మూడ్ పీక్స్‌కు చేరుకోనుంది. ఈ ఏడు రోజుల వ్యవధిలో ప్రేమికులు వారి ప్రేమను వివిధ మార్గాల్లో వ్యక్తపర్చనున్నారు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. ఫిబ్రవరి 14న(Valentines Day) వివిధ రాశుల వారికి సంబంధించిన ప్రేమ ఫలితాలు ఇలా ఉండొచ్చు.

We’re now on WhatsApp. Click to Join

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి వాలెంటైన్స్ డే స్పెషల్‌గా మారనుంది. ఈ రాశివారు కొత్తగా ప్రేమలో ఉన్నట్లుగా ఫీల్ అవుతారు. వారి సంబంధాలలో ప్రేమ, ఆప్యాయతల మోతాదు పెరుగుతుంది. తమ ప్రేమను వ్యక్తపరచడం ద్వారా వారు ప్రేమికులను కలుసుకుంటారు. ఫిబ్రవరి 14న ప్రేమయాణం చేస్తారు.

మకరరాశి

మకరరాశి వారికి  వాలెంటైన్స్ డే శుభవేళగా పరిణమిస్తుంది. ప్రియమైన వారికి ప్రేమను తెలియజేసే కరెక్ట్ టైం ఆ రోజున దరిచేరుతుంది. ప్రేమికుల మధ్య సంబంధాల బలోపేతానికి వాలెంటైన్స్ డే వారధిగా నిలుస్తుంది. కొత్త అవకాశాలను క్రియేట్ చేస్తుంది.

Also Read : Supreme Leader Banned : ఆ దేశాధినేతపై ఫేస్‌బుక్, ఇన్‌స్టా‌లో బ్యాన్.. ఎందుకు ?

వృషభ రాశి

ప్రేమికుల రోజున వృషభ రాశి వారికి కొత్త తలుపులు తెరుచుకుంటాయి.  జీవితంలోకి కొత్త భాగస్వామి వచ్చే ఛాన్స్ ఉంది. ఆ రోజున శృంగార జీవితానికి బీజం పడే అవకాశం ఉండొచ్చు. ఇప్పటికే ప్రేమ సంబంధంలో ఉన్న వాళ్లు మరింతగా కనెక్ట్ అవుతారు. ఇద్దరి మనసులు కలుస్తాయి.

కర్కాటక రాశి

వాలెంటైన్స్ డే రోజున కర్కాటక రాశి వారు ప్రేమబంధాలను బలోపేతం చేసుకుంటారు. వాటిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. ప్రేమ ప్రయాణంలో ముందుకు వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకుంటారు. ప్రేమ లోకంలో జంటలు తేలియాడుతాయి. కొంతమంది ఆ రోజు కొత్తగా ప్రేమలో పడతారు.

Also Read : Bharat Rice : తెలంగాణలో ‘భారత్ రైస్’ సేల్స్ ఎప్పటి నుంచి ?

ప్రేమికుల దినోత్సవం రోజే వసంతపంచమి

మాఘమాసంలో ఐదోరోజు వచ్చే పంచమిని వసంత పంచమిగా జరుపుకుంటారు. దీన్నే శ్రీ పంచమి, సరస్వతి పంచమి అని కూడా అంటారు. దక్షిణాదినే కాదు ఉత్తరాదిన కూడా శ్రీ పంచమిని విశేషంగా జరుపుకుంటారు. ఈ ఏడాది (2024) వసంత పంచమి ఫిబ్రవరి 14 బుధవారం వచ్చింది. వసంత పంచమి రోజే బాసరలో వ్యాసమహర్షి ఇసుకతో అమ్మవారిని ప్రతిష్టించాడని చెబుతారు. ఈ శ్రీ పంచమి రోజు విద్యాభ్యాసం చేస్తే ..ఆ పిల్లలు ఉన్నత విద్యావంతులు అవుతారని విశ్వాసం.  అందుకే చాలామంది తల్లిదండ్రులు వసంతపంచమి రోజు బాసరలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధిని పొందుతారు. ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో వచ్చే గుప్త నవరాత్రుల్లో పంచమి తిథిరోజు సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేయడం వెనుకున్న ఉద్దేశం ఇదే.