119 Years Later Book Returned : “రిటర్న్” గిఫ్ట్ అంటే ఇదే..
119 ఏళ్ళ క్రితం అంటే 1904లో లైబ్రరీ నుంచి ఓ వ్యక్తి తీసుకెళ్లిన బుక్ ను .. అదే లైబ్రరీకి డొనేషన్ గా ఇస్తూ ఆ వ్యక్తి కుటుంబం నుంచి పోస్ట్ వచ్చింది.
అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఉన్న న్యూ బెడ్‌ఫోర్డ్ ఫ్రీ పబ్లిక్ లైబ్రరీ అది. 1904లో జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్ పుస్తకం “యాన్ ఎలిమెంటరీ ట్రీటైజ్ ఆన్ ఎలక్ట్రిసిటీ”ను ఒక వ్యక్తి చదివేందుకు తీసుకెళ్లాడు. విద్యుత్ తయారీ ప్రక్రియను వివరించే పుస్తకం అది. 1882లో పబ్లిష్ అయిన ఆ బుక్ ను అప్పట్లో సైన్స్ స్టూడెంట్స్ బాగా చదివేవారు. అప్పుడు తీసుకెళ్లిన ఆ బుక్ పత్తా లేకుండా పోయింది. ఇటువంటి టైంలో వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీ లైబ్రరీ లోని పుస్తక విరాళాల విభాగానికి ఒక పార్సిల్ వచ్చింది. దాన్ని తెరిచి చూస్తే.. 119 ఏళ్ళ కిందట లైబ్రరీ నుంచి తీసుకెళ్లిన డేట్, వివరాలతో ఒక పాత బుక్(119 Years Later Book Returned) ఉంది. దీంతో ఆ విరాళాల బుక్స్ ను మెయింటైన్ చేసే స్టీవార్డ్ ప్లీన్ ఆశ్చర్యపోయారు. వెంటనే ఆమె ఆ బుక్, పోస్టల్ పార్సిల్ ఫోటోలను తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత బుక్ ను న్యూ బెడ్‌ఫోర్డ్ ఫ్రీ పబ్లిక్ లైబ్రరీకి పార్సిల్ లో పంపించారు.
Also read : 48 Kg Gold Paste : టాయిలెట్ లో 25 కోట్ల గోల్డ్ పేస్ట్.. నలుగురు అరెస్ట్
119 ఏళ్ళ తర్వాత ఈ బుక్ తిరిగొచ్చిన నేపథ్యంలో న్యూ బెడ్‌ఫోర్డ్ ఫ్రీ పబ్లిక్ లైబ్రరీ ఫేస్‌బుక్ లో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ” లైబ్రరీ పుస్తకాన్ని తిరిగి ఇవ్వడం ఎన్నడూ.. ఎక్కడా ఇంత ఆలస్యం కాదేమో ! దాదాపు 120 సంవత్సరాల క్రితం మా లైబ్రరీ నుంచి వెళ్లిన బుక్ ఎట్టకేలకు ఇప్పుడు తిరిగి వచ్చేసింది” అని ఆ పోస్ట్ లో పేర్కొంది. న్యూ బెడ్‌ఫోర్డ్ లైబ్రరీలో తీసుకున్న బుక్ ను తిరిగి ఇవ్వడం ఆలస్యమైతే.. రోజుకు 5 శాతం చొప్పున ఆలస్య రుసుమును కట్టాల్సి ఉంటుంది. ఈ లెక్కన 119 సంవత్సరాలు లేట్ చేసినందుకు దాదాపు రూ.1.73 లక్షలు ఆలస్య రుసుమును చెల్లించాలి !!