Site icon HashtagU Telugu

ACP Ravinder : ఇలాంటి గొప్ప పోలీస్ చాల అరుదు..హ్యాట్సాఫ్‌ సార్

ACP Ravinder

ACP Ravinder

పోలీసును (Police ) చూస్తే తప్పు చేసినవారికి కాదు తప్పు చేయని వారికీ సైతం కాస్త భయమే. అది వారు వేసుకున్న కాకి చొక్కా పవర్. ఎవరికీ భయపడిన..భయపడకపోయిన పోలీసులకు మాత్రం చాలామంది భయపడుతుంటారు. సంఘంలో ఒకర్ని దండించే అధికారం ఒక్క పోలీసుకే ఇచ్చింది. శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలూ జరక్కుండా కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు. శాంతిభద్రతలను కాపాడటం, పౌరులను, వారి ఆస్తులను రక్షించడం, నేరాలను నిరోధించడం, దర్యాప్తు చేయడం, వారి అధికార పరిధిలో చట్టాలు, నిబంధనలను అమలు చేయడం వంటివి పోలీసుల బాధ్యత. అలాంటి బాధ్యత కలిగిన పోలీసుల్లో చెడ్డవారు ఉన్నారు..కొంతమంది గొప్ప వారు ఉన్నారు. అలాంటి గొప్ప వారు గురించి చాల తక్కువగా తెలుస్తుంది.

తాజాగా హైదరాబాద్ (Hyderabad) లో ఇలాంటి గొప్ప పోలీస్ చేసిన పని వెలుగులోకి వచ్చింది. మాములుగా ఎవరైనా రోడ్డు ఫై నిస్సహాయ స్థితిలో పడిపోతే వారిని కాపాడడం వంటివి చేస్తుంటారు. ఏదో నిల్చుపెట్టి నీరు తగ్గించడం..వారి బంధువులకు ఫోన్ చేయడం..లేదా వారిని ఇంటివరకు తీసుకెళ్లడం చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ పోలీస్ మాత్రం తన కష్టపడినా డబ్బుతో మహిళకు ఆపరేషన్ చేయించి తనను బ్రతికించేలా చేసాడు. ఈ విషయం ఎవరికీ తెలియదు. సరిగ్గా పదేళ్ల తర్వాత పోలీస్ నుండి సాయం పొందిన సదరు మహిళే ..ఆ పోలీసును చూసి తాను చేసిన సాయాన్ని తెలిపింది.

Read Also : Telangana Election Campaign : ఎన్నికల ఖర్చుల కోసం ఎమ్మెల్యేకే డబ్బులు ఇస్తున్న ఓటర్లు..

మహంకాళి ఏసీపీ రవీందర్‌ యాదవ్‌ (ACP Ravinder Yadav) 2014లో టప్పాఛబుత్ర పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో కార్వాన్‌కు చెందిన కవిత రోడ్డుపై అనారోగ్యంతో బాధ పడుతుంటే ఆస్పత్రిలో చేర్పించి.. తన సొంత డబ్బుతో చికిత్స, ఆపరేషన్‌ చేయించారు. ఈ ఘటన జరిగి దాదాపు పదేళ్లు కావస్తుంది. కాగా, ఆదివారం ఆ మహిళ (Kavitha) సికింద్రాబాద్‌ మీదుగా బస్సులో వెళ్తుండగా..రాష్ట్రపతి రోడ్డు లో విధులు నిర్వహిస్తున్న ఏసీపీ రవీందర్‌ యాదవ్‌ను సదరు మహిళా చూసింది. అంతే కదులుతున్న బస్సును ఆపించి..వేగంగా పరుగెత్తుకుంటూ.. నేరుగా బందోబస్తు డ్యూటీలో ఉన్న ఏసీపీ వద్దకు వచ్చింది. సార్‌ నేను.. అంటూ.. గుర్తు చేసింది. సార్‌, “నేను కవితను.. నేను ఈ రోజు బతికి ఉన్నానంటే మీరే కారణం సార్‌”.. అంటూ కన్నీరు పెట్టుకుంది. అన్నా.. మీ కోసం వెండి రాఖీ తీసుకున్నా.. పండుగ రోజు వచ్చి కడుతానని చెప్పి.. ఏసీపీ ఫోన్‌ నంబర్‌ తీసుకొని సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ దృశ్యం చూసిన అక్కడి స్థానికులు హ్యాట్సాఫ్‌ పోలీస్‌.. అంటూ.. ఏసీపీకి కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో ఇలాంటి గొప్ప పోలీసులు అరుదుగా ఉంరటని..కొంత చేసిన సహాయాన్ని కొండంతగా చెప్పే ఈరోజుల్లో ఓ ప్రాణాన్ని కాపాడి..అది ఎవరికీ చెప్పకుండా..తన మనసులోనే దాచుకున్న ఏసీపీ రవీందర్‌ లాంటి వారు అరుదుగా ఉంటారు.