తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయం (Telangana Elections) దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు సైతం ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే బిఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించడం తో..బరిలో నిలుస్తున్న నేతలు అప్పుడే ప్రచారం (Election Campaign) మొదలుపెట్టారు. ఇంటికి ఇంటికి తిరుగుతూ తమకు మద్దతు పలకాలని కోరుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు సైతం అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారు. మాములుగా ఎన్నికలు వస్తున్నాయంటే ఓటర్లకు పెద్ద పండగే. ఎన్నికల నోటిఫికేషన్ మొదలైన దగ్గరి నుండి ఎన్నికల పోలింగ్ పూర్తి అయ్యేవరకు సదరు పార్టీల నేతలు ఓటర్లను బంగారు బాతులా చూసుకుంటారు. ఓటర్లు ఏమడిగితే అది ఇస్తారు..ఏంకావాలంటే అది తెస్తారు..మందుబాబులకు చెప్పాల్సిన పనేలేదు. చీఫ్ లిక్కర్ తాగేవారు సైతం ఎన్నికల సమయంలో తమ పార్టీ అభ్యర్థులను బ్రాండ్ మందు కావాలని కోరుతారు..వారు అడిగిందానికల్లా కాదనకుండా అందజేస్తూ వారిని కంటికి రెప్పలా చూసుకుంటారు. ప్రతి రోజు బిర్యానీ ప్యాకెట్లు , మందు సీసాలు, డబ్బులు పంచుతూ ఉంటారు. ఇది అన్ని పార్టీలు చేస్తూ వస్తుందే.
కానీ ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే బరిలో నిల్చున్న అధికార పార్టీ అభ్యర్ధికి ఓటర్లే ఎన్నికల ఖర్చు నిమిత్తం డబ్బులు ఇస్తుండడం విశేషం. ఇది మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ (Mahabubabad MLA Banoth Shankar Naik) కు జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి పనులతో ఎంత పేరు తెచ్చుకున్నాడో..వివాదాలతో కూడా అంతే చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. 2009లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీలో చేరిన శంకర్.., తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. ఆ తర్వాత 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవితపై 9,315 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొంది..అసెంబ్లీ లో అడుగుపెట్టారు.
Read Also : NTR COIN Released : ‘ఎన్టీఆర్ కాయిన్’ విడుదల.. ప్రోగ్రామ్ కు ఆ ఇద్దరు గైర్హాజరు
2018లో జరిగిన తెలంగాణ ముందస్తు శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ఫై 13,534 ఓట్ల మెజారిటీతో రెండవసారి విజయం సాధించారు. ఇక ఇప్పుడు మూడోసారి బిఆర్ఎస్ నుండి బరిలోకి దిగుతున్నాడు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన శంకర్ నాయక్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రచారంలో భాగంగా (Shankar Naik Election Campaign) ఇంటికి ఇంటికి వెళ్తుండగా..ఓ వృద్ధురాలు తన మూడు నెలల పెన్షన్ ను శంకర్ నాయక్ కు ఇచ్చి ఎన్నికల ఖర్చు కోసం దాచుకో..అని చెప్పడం అందర్నీ షాక్ కు గురిచేసింది. మాకు పెద్ద కొడుకుల సీఎం కేసీఆర్ మూడు వేల పెన్షన్ ఇస్తున్నాడు, మళ్లీ ఆయనే అధికారంలోకి రావాలని.. మా ఓటు బిఆర్ఎస్ కే అని చెప్పి.. తన మూడు నెలల పెన్షన్ ను శంకర్ చేతిలో పెట్టి తన అభిమానాన్ని చాటుకుంది. అలాగే మరో వితంతువు సైతం తన పెన్షన్ ను శంకర్ కు ఇచ్చి మరోసారి మహబూబాబాద్ ఎమ్మెల్యే గా గెలిచి తీరాలని, అందుకు మా సపోర్ట్ మీకే ఉంటుందని చెప్పి..తన అభిమానాన్ని చాటుకుంది. ఇలా ఓటర్లే ఎన్నికల ఖర్చు కు డబ్బులు ఇస్తుండడం ఎంతో అదృష్టమని..అది ఒక్క ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు మాత్రమే చెల్లిందని అంత మాట్లాడుకుంటున్నారు.