Moosarambagh: గూడు చెదిరే.. గుండె జారే!

‘‘చుట్టూ చాలా మంది మగవాళ్లు ఉన్నందున.. నేను నా బట్టలు ఎలా మార్చుకోగలను?  అసల ఈ విషయం గురించి మాట్లాడటానికి కూడా నేను సిగ్గుపడుతున్నా’’

  • Written By:
  • Publish Date - March 14, 2022 / 04:48 PM IST

‘‘చుట్టూ చాలా మంది మగవాళ్లు ఉన్నందున.. నేను నా బట్టలు ఎలా మార్చుకోగలను?  అసల ఈ విషయం గురించి మాట్లాడటానికి కూడా నేను సిగ్గుపడుతున్నా’’ మూసారాంబాగ్‌లోని మూసీ నది ఒడ్డున ఉన్న స్లమ్ ఏరియా అయిన నివసిస్తున్న ఎన్ నాగమణి ఆందోళన ఇది. 35 ఏళ్ల మహిళ నిరుపేదరాలు. ప్రస్తుతం స్లమ్ ఏరియా పక్కన ఉన్న రద్దీగా ఉండే కమ్యూనిటీ హాల్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ప్రభుత్వం వారికి ఇంకా ఇల్లు ఇవ్వకపోవడంతో ఇంట్లోని వస్తువులతో ప్రస్తుత వసతి గృహంలో తలదాచుకుంటున్నారు. అక్కడ కేవలం బాత్రూమ్ మాత్రమే ఉంది. టాయిలెట్ కూడా లేదు. ‘‘గత ఏడు రోజులుగా  మాకు ఎలాంటి ప్రైవసీ లేకుండా జంతువులా జీవిస్తున్నాం. నేను స్నానం చేసిన ప్రతిసారీ మగవాళ్లను,  పిల్లలను బయటకు వెళ్లమని చెబుతాను. నాకు ఆడపిల్లలు ఉన్నారు.  వారి భద్రత గురించి నేను భయపడుతున్నా అని నాగమణి అన్నారు. ఆశ్రయంలో మహిళలు,  చిన్నారులు సహా దాదాపు 100 మంది ఉన్నారు.

గత వారం, శుక్రవారం, లక్ష్మయ్య,  చంద్రయ్య, హనుమంత గుడిసెలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వీళ్లతోపాటు అనేకమంది గూడు లేక అవస్థలు పడుతున్నారు. ముసారాంబాగ్‌లోని అన్ని మురికివాడలను అధికారులు నేలమట్టం చేశారు. ఇందులో అత్యధిక కుటుంబాలు దళిత, వె నుకబడిన,  ముస్లిం వర్గాలకు చెందినవి. ఈ మురికివాడల్లో గతంలో దాదాపు 200 కుటుంబాలు ఉండేవి. హయత్‌నగర్‌లోని ముంగనూర్‌లో జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ కింద 205 కుటుంబాలకు (మూసారాంబాగ్‌లోని ఇతర కాలనీల నివాసితులకు 45 ఇళ్లతో సహా) ప్రభుత్వం ఇళ్లు అందించగా, 45 కుటుంబాలకు ఇంకా పునరావాసం లేదు. ఊరు వదిలి వెళ్లిన మరో 45 కుటుంబాలను గుర్తించలేకపోయారు. రోజురోజుకు వారి ఆశలు సన్నగిల్లుతూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా షెల్టర్ దగ్గర పోలీసులు మోహరించారు.

మురికివాడల నివాసితులకు గృహనిర్మాణం కల్పించాలనే పోరాటంలో భాగమైన మానవ హక్కుల వేదిక కార్యకర్త సయ్యద్ బిలాల్ స్పందించారు “అధికారులు సామాజిక-ఆర్థిక సర్వేలో నివాసితులను గుర్తించారు.  అయితే ఇంకా 205 నివాసితులకు మాత్రమే పట్టాలు అందించారు. మిగతా 45 కుటుంబాలకు అన్యాయం జరిగింది. మిగిలిన వారికి కూడా ఇల్లు ఇవ్వాలి. వారు దానికి అర్హులు’’ అని అన్నారు. వీరిలో కొందరికి గతంలో మునగనూర్‌లో గృహ వసతి కల్పించారు. అయితే, చాలా మంది ఇరుగుపొరుగున హౌస్‌లో సహాయకులుగా పనిచేస్తున్నందున  వారు మురికివాడకు మకాం మార్చారు. స్లమ్ ను ఖాళీ చేయించడం వల్ల ఎంతోమంది  ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై మండల రెవెన్యూ అధికారి ప్రసాద్ మాట్లాడుతూ.. చాలా కుటుంబాలు నిజమైనవి కావు. అలాంటివాళ్లకు ఇంటిని ఎలా అందించగలమని ప్రశ్నించారు.