Site icon HashtagU Telugu

Wine Shops : రేపు హైదరాబాద్‌లో వైన్‌ షాపులు బంద్‌.. 144 సెక్షన్‌ అమలు

Wine shops will be closed in Hyderabad tomorrow... Implementation of section 144

Wine shops bandh for two days in Hyderabad

Lok Sabha Elections Counting: హైదరాబాద్‌లో రేపు వైన్‌ షాపులు(Wine Shops) బంద్‌ కానున్నాయి. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జంట నగరాలలో మద్యం దుకాణాలు మూసివేయాలని హైదరాబాద్‌ నగర సి.పి కొత్త కోట శ్రీనివాస రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు రేపు 4.6.2024 ఉదయము 6 గంటలనుండి 5.6.2024 ఉదయం 6 గంటల వరకు వైన్స్‌ మూసివేయాలని పేర్కొన్నారు హైదరాబాద్‌ నగర సి.పి కొత్త కోట శ్రీనివాస రెడ్డి.

We’re now on WhatsApp. Click to Join.

జంట నగరాలలో ఉన్న 16 కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్(144 Section) అమలు, 200 మీటర్ల వరకు నిషేధాజ్ఞలు ఉంటాయన్నారు. పబ్లిక్ ప్రదేశాలలో ఏటాంటి బాణాసంచాలను కాల్చడము కాని, విసిరేయడము నిషేధం అని ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్‌ నగర సి.పి కొత్త కోట శ్రీనివాస రెడ్డి. ముఖ్యంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని చెప్పారు.

Read Also: BRS Vs Congress : కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు బీఆర్ఎస్ థ్యాంక్స్.. ఎందుకో తెలుసా ?

కాగా, గత నెల రోజుల్లో చాలాసార్లు మద్యం దుకాణాలు బంద్ చేశారు. మే 13న పోలింగ్ సందర్భంగా మద్యం దుకాణాలు క్లోజ్ చేశారు. ఇక వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 12 జిల్లాల్లో మూడ్రోజుల పాటు వైన్ షాపులు బంద్ చేశారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల కౌటింగ్ నేపథ్యంలో మరోసారి మద్యం దుకాణాలు క్లోజ్ కానున్నాయి.