Site icon HashtagU Telugu

Vishnu Vardhan Reddy : బీఆర్ఎస్ లోకి విష్ణువర్ధన్ రెడ్డి..?

vishnu vardhan reddy joins BRS

vishnu vardhan reddy joins BRS

కాంగ్రెస్ పార్టీ (Congress Party) కి మరో షాక్ తగలబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అభ్యర్థుల ప్రకటన (Congress Candidate List Announced) తర్వాత అసమ్మతి సెగలు ఎక్కవ అవుతున్నాయి. ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన తమకు కాదని కొత్తగా వచ్చిన వారికీ , గతంలో కాంగ్రెస్ ను వీడి మళ్లీ వచ్చిన వారికీ టికెట్స్ కేటాయించారని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ అధిష్టానం ఫై ఆందోళన చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది పార్టీ కి రాజీనామా (Resign) చేసి బిఆర్ఎస్ లో చేరుతుండగా..మరికొంతమంది రెబెల్ గా బరిలోకి దిగబోతామని ప్రకటిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

శుక్రవారం కాంగ్రెస్ పార్టీ 45 మంది అభ్యర్థులతో రెండో జాబితా (Congress Candidates 2nd List)ను విడుదల చేసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దివంగత పిజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి (Vishnu Vardhan Reddy).. జూబ్లీహిల్స్ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నప్పటికీ ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అజారుద్దీన్ పేరును ప్రకటించింది. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. ఆయన అనుచరులతో భేటీ అనంతరం తన నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు.

ఈ క్రమంలో విష్ణు అనుచరులు గాంధీ భవన్ వద్ద నేడు ఆందోళన నిర్వహించారు. గాంధీ భవన్ లోనికి వెళ్లకుండా ప్రధాన ద్వారానికి తాళం వేసి ఉంది. దీంతో ఇటుకలతో తాళం పగులగొట్టేందుకు వారు ప్రయత్నించారు. రేవంత్ బొమ్మను పగులగొట్టారు. కాంగ్రెస్ కండువాలు దగ్ధం చేశారు. విష్ణువర్ధన్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఇక ఈరోజు ఆదివారం బిఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ ను కలిశారు. దీనిని బట్టి చూస్తే విష్ణు బిఆర్ఎస్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read Also : Tammineni Veerabhadram : కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీచేసిన తమ్మినేని