Site icon HashtagU Telugu

Vidyadhan : టెన్త్‌లో 90 శాతం మార్కులు వచ్చాయా ? ఈ స్కాలర్‌షిప్ మీకే

Vidyadhan

Vidyadhan

Vidyadhan : ‘విద్యాధన్’ స్కాలర్‌షిప్ స్కీం ఏటా ఎంతోమంది పేద విద్యార్థులకు సహాయ సహకారాలను అందిస్తోంది. ప్రత్యేకించి పదో తరగతిలో 90% మార్కుల (9 జీపీఏ)తో  పాసైన వారికి ఈ స్కీం కింద ఉపకారవేతనాలను అందిస్తున్నారు. ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేసే దివ్యాంగ విద్యార్థులకు 75 శాతం మార్కులు(7.5 జీపీఏ) వచ్చి ఉంటే చాలు. అయితే విద్యార్థుల కుటుంబ ఆదాయం రూ.2 లక్షలలోపు ఉండాలి. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో దీనికోసం www.vidyadhan.org  వెబ్‌సైట్ ద్వారా ఆన్​లైన్‌లో దరఖాస్తులను సమర్పించవచ్చు. విద్యార్థులు తమ పదోతరగతి ​మెమో జిరాక్స్,  ఆదాయ ధ్రువీకరణ పత్రం, పాస్​ఫొటో, ఇంటర్​ కాలేజీ వివరాలను అందించాలి.  ఎంపికయ్యే అభ్యర్థులకు ఏడాదికి రూ.10,000 చొప్పున స్కాలర్ షిప్ ఇస్తారు. ప్రతిభ కనబరుస్తూ ఉన్నత చదువులకు వెళ్లే అభ్యర్థులకు ఏడాదికి రూ.10,000 నుంచి రూ.75,000 వరకు స్కాలర్ షిప్ మంజూరు చేస్తారు.

We’re now on WhatsApp. Click to Join

ఇంటర్‌తో పాటు ఉన్నత చదువులలో అడ్మిషన్లు తీసుకునే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ను ‘సరోజిని దామోదరన్‌ ఫౌండేషన్’(Vidyadhan) సంస్థ అందిస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, గుజరాత్‌, గోవా, మహారాష్ట్ర, లడఖ్​, పుదుచ్చేరి, ఢిల్లీ, బిహార్​, పంజాబ్​, హిమాచల్​ ప్రదేశ్​, ఉత్తర​ప్రదేశ్​ తదితర ప్రాంతాల్లోని విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్నారు. ఏటా దాదాపు 8వేల మంది విద్యార్థులకు ఈ ఉపకారవేతనాలు అందుతున్నాయి.

Also Read : Actress Hema : రేవ్ పార్టీ వ్యవహారం.. నటి హేమ బ్లడ్ శాంపిల్‌లో డ్రగ్స్.. 86 మందికి పాజిటివ్

ఈ స్కాలర్‌షిప్ కోసం అప్లై చేసిన వారిని అకడమిక్ ప్రతిభ ఆధారంగా షార్ట్​ లిస్ట్​ చేస్తారు. అనంతరం వారికి ఆన్​లైన్​ టెస్ట్​, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు.  తెలంగాణలో ఈ స్కాలర్​షిప్​లకు అప్లై చేసేందుకు చివరి తేదీ జూన్​ 15. జులై 7 న ఆన్​లైన్​ టెస్ట్​ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్​ అయిన వారికి ఆగస్టు మొదటి వారంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇక ఏపీలో ఈ స్కాలర్​షిప్​లకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జూన్​ 7. జూన్​ 23న ఆన్​లైన్​ టెస్ట్​ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్​ అయిన వారికి జులైలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

Also Read :Komati Reddy Venkat Reddy : బీఆర్ఎస్ లిక్కర్ సేల్స్ పెంచింది.. డెవలప్‌మెంట్ చేయలేదు : కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి