Site icon HashtagU Telugu

Actress Hema : రేవ్ పార్టీ వ్యవహారం.. నటి హేమ బ్లడ్ శాంపిల్‌లో డ్రగ్స్.. 86 మందికి పాజిటివ్

Hema Rave Party

Hema Rave Party

Actress Hema : బెంగళూరు రేవ్ పార్టీలో  మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం  వరకు రేవ్ పార్టీలో పాల్గొన్న దాదాపు 150 మంది బ్లడ్ శాంపిళ్లను ల్యాబ్‌కు పంపగా, వాటికి సంబంధించిన రిపోర్టులు ఇప్పుడు వచ్చాయి. ఆ పార్టీలో పాల్గొన్న మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. నటి హేమకు కూడా పాజిటివ్ వచ్చింది. బెంగళూరు శివార్లలో జరిగిన ఈ రేవ్ పార్టీపై స్థానిక పోలీసులు రైడ్ చేసినప్పుడు.. హేమ తన పేరును కృష్ణవేణిగా చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే ఈ కేసులో హేమ పట్టుబడటంపై మొదట్లో గందరగోళం ఏర్పడింది. దీనిలో హేమను బాధితురాలిగా పరిగణించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆమెను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. తాను డ్రగ్స్ తీసుకోలేదని, త్వరలోనే అన్ని విషయాలను బయటపెడతానని నటి హేమ(Actress Hema) అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join

తొలుత ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న విషయాన్ని కూడా నటి హేమ అంగీకరించలేదు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని.. బెంగళూరుకు వెళ్లలేదని చెబుతూ ఓ వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. దీన్ని ఖండించిన కర్ణాటక పోలీసులు.. రేవ్ పార్టీలో హేమ పాల్గొన్న ఫొటోను రిలీజ్ చేశారు. పోలీసులు రిలీజ్ చేసిన ఫొటోలో, హేమ చేసిన వీడియోలో ఒకటే డ్రెస్‌లో ఉండటం గమనార్హం. ఇక ఆ తర్వాతి రోజే ఇంట్లో బిర్యానీ వండుతున్న వీడియోను హేమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. రేవ్ పార్టీలో దొరికిపోయిన తర్వాత కవరింగ్ కోసం బిర్యానీ వీడియోను హేమ పోస్ట్ చేశారని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. రేవ్ పార్టీ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. కాగా, ఈ రేవ్ పార్టీ లో కీలక సూత్రధారి విజయవాడ వాసి లంకపల్లి వాసుగా పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో ఏపీ, బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నారు. 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలను గుర్తించారు. అలాగే మెర్సిడెస్ బెంజ్, ఆడీ, జాగ్వార్ సహా 15 ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు.

Also Read :Komati Reddy Venkat Reddy : బీఆర్ఎస్ లిక్కర్ సేల్స్ పెంచింది.. డెవలప్‌మెంట్ చేయలేదు : కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి