Site icon HashtagU Telugu

Sarpanch Attack : వైన్ షాప్ లో అడిగిన బ్రాండ్ ఇవ్వలేదని సర్పంచ్ దాడి

Sarpanch Attack

Sarpanch Attack

అధికారం చేతిలో ఉంటె చాలు వారు చెప్పిందే చెయ్యాలి..చేసిందే చూడాలి. ఎదురుతిగారో అంతే సంగతి. ఎక్కడ..ఎలా..ఏ విధంగా బెదిరిస్తారో తెలియదు. అందుకే చాలామంది రాజకీయ నేతలకు భయపడుతుంటారు.. సమయం వచ్చినప్పుడు చూసుకుందాం..ఇప్పుడైతే వారు చెప్పింది చేద్దాం అనేలా వ్యవహరిస్తుంటారు. సామాన్య ప్రజలే కాదు ప్రభుత్వ అధికారులు సైతం రాజకీయ నేతలకు భయపడుతూ..వారి చెప్పింది చేస్తుంటారు. అయితే అందరు ఆలా ఉండరు..కొంతమంది మంచివారు కూడా ఉంటారు.

తాజాగా కామారెడ్డి జిల్లా (Kamareddy District)లో ఓ సర్పంచ్ (Sarpanch )..అధికారం చేతిలో ఉంది..ప్రభుత్వం మాది..పోలీసులు మావారే..మొత్తం మా మనుషులే అంటూ ఓ వైన్ షాప్ (Wine Shop) ఫై దాడి చేసాడు. ఎందుకు దాడి చేసాడో తెలుసా..? తాను అడిగిన బ్రాండ్ ను వైన్ షాప్ సిబ్బంది ఇవ్వలేదట. అంతే నేను అడిగిన బ్రాండ్ లేదంటావా అంటూ కోపంతో ఊగిపోయాడు. తన అనుచరులతో వైన్స్ వద్ద వీరంగం సృష్టించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం ఉప్పరపల్లి లో చోటుచేసుకుంది. ఉప్పరపల్లి సర్పంచ్ కాసర్ల ప్రసాద్ (Sarpanch Prasad)..తన అనుచరులతో కలిసి కనకదుర్గ వైన్స్ షట్టర్ కిందికి లాగి..నానా రభస చేసాడు. దీనికి సంబదించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. అధికారం చేతిలో ఉంటె ఇలా చేస్తారా అంటూ నెటిజన్లు కామెంట్స్ వేస్తున్నారు.

Read Also : Putin : రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ తప్పు చేస్తాడా..? చేస్తే అంతే సంగతి