తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..ప్రభుత్వ ఉద్యోగులకు వరుస తీపి కబుర్లు అందజేస్తుంది. ప్రతి నెల 05 లోపు జీతాలు అందజేస్తామని చెప్పినట్లే..ఈ నెల జీతాలు వారి ఖాతాల్లో వేసి వారిలో సంతోషం నింపింది. ఇక ఇప్పుడు వీఆర్ఏలకు తీపి కబురు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగులో ఉన్న వీఆర్ఏల (VRA) జీతాలకు క్లియరెన్స్ ఇచ్చింది. వివిధ శాఖల్లో వీలినమైన 15,560 మంది, రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరీ పోస్టుల ద్వారా పని చేస్తోన్న వారందరికీ పెండింగులోని ఏడు నెలల వేతనాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను సీసీఎల్ఏ ఆదేశించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ మేరకు బుధవారం మెమో జారీ చేశారు. జీవో నం.81, 85ల ద్వారా వివిధ శాఖల్లో గ్రేడ్ సర్వీసెస్/రికార్డు అసిస్టెంట్స్/ జూనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నారు. వారందరికీ రెగ్యులర్ పే స్కేల్‌ని అమలు చేయాలని నిర్ణయించారు. కొన్ని నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వీఆర్ఏలకు ఉపశమనం లభించింది.
Read Also : Pawan Kalyan: అయోధ్య రామమందిర ప్రారంభానికి పవన్ కు ఆహ్వానం
