Site icon HashtagU Telugu

TANA Conference : ప్రైవేటు సంస్థ‌ల‌కు తెలుగు రాజ‌కీయం!! `తానా`వేదిక‌పై జ‌స్టిస్ ర‌మ‌ణ నిర్వేదం!!

Tana Conference

Tana Conference

అమెరికాలో తానా మ‌హాస‌భలంటే (TANA Conference)తెలుగువాళ్లు పుల‌కించిపోతారు. తెలుగు గ‌డ్డ మీద నుంచి అమెరికా వెళ్లి స్థిర‌ప‌డిన వాళ్లు చేసుకునే పండుగ అది. ప్ర‌ముఖుల‌ను వేడుక‌ల‌కు తానా ఆహ్వానిస్తోంది. ఈసారి ముఖ్య అతిథిగా వెళ్లిన సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ గా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ర‌మ‌ణ ఆస‌క్తిక‌ర కామెంట్స్ ఆ వేదిక మీద నుంచి చేయ‌డం గ‌మ‌నార్హం.

సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ గా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ర‌మ‌ణ ఆస‌క్తిక‌ర కామెంట్స్(TANA Conference)

స‌ర్వే సంస్థ‌ల‌కు రాజ‌కీయాల‌ను అప్ప‌గించ‌డాన్ని తానా  (TANA Conference)వేదిక‌గా జ‌స్టిస్ ర‌మ‌ణ త‌ప్పుబ‌ట్టారు. రాజ‌కీయాల‌తో ఏ మాత్రం సంబంధంలేని ప్రైవేటు కంపెనీల‌కు తెలుగు స‌మాజాన్ని అప్ప‌గించార‌ని ఆవేద‌న చెందారు. ఫ‌లితంగా రాజ‌కీయాలు ప‌త‌నావ‌స్థ‌కు చేర‌డాన్ని గుర్తు చేశారు. ప్రైవేటు , వ్య‌క్తిగ‌త జీవితాల‌ను బ‌జారుకీడ్చ‌డం రాజ‌కీయాల్లో మామూలుగా మారింది. రాజ‌కీయాల‌తో సంబంధంలేని గృహిణుల‌ను కూడా వ‌ద‌ల‌కుండా సోష‌ల్ మీడియా వేదిక‌గా అస‌భ్యంగా చిత్రీక‌రించ‌డం ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో కీల‌క భూమిక అయింది. అదే విష‌యాన్ని జ‌స్టిస్ ర‌మ‌ణ అమెరికా గ‌డ్డ మీద ప్ర‌స్తావించ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.

ద‌శాబ్ద కాలంగా స‌ర్వే సంస్థ‌ల‌కు రాజ‌కీయ పార్టీల‌ను అప్ప‌గించ‌డం

ద‌శాబ్ద కాలంగా స‌ర్వే సంస్థ‌ల‌కు రాజ‌కీయ పార్టీల‌ను అప్ప‌గించ‌డం ఆన‌వాయితీగా మారింది. తెలుగు రాష్ట్రాల‌కు 2019 ఎన్నిక‌ల్లో ఐ ప్యాక్ ప్ర‌వేశించింది. ఆ సంస్థ స‌మాజంలోని బ‌ల‌హీన‌త‌ల‌ను తొలుత గుర్తించింది. భావోద్వేగాల‌తో కూడిన అంశాల‌ను ఎంపిక చేసుకుంది. వాటిని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎలివేట్ చేయ‌డం ప్రారంభించింది. ప్ర‌త్యేకించి మ‌హిళ‌లు, అక్ర‌మ‌సంబంధాలు, కులాలు, మ‌తాలు, బెడ్ రూమ్ క‌బుర్లు ..ఇలా ఒక‌టేమిటి ప‌లు అంశాల‌ను బ‌య‌ట‌కు తీసింది. సామాజిక అంశాలపై చ‌ర్చ జ‌ర‌గ‌కుండా భాదోద్వేగాల‌తో కూడిన గాసిప్స్ పైచేయిగా నిలిచేలా చేసింది. సీన్ క‌ట్ చేస్తే , 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని గెలిపించిన సంస్థ‌గా ఐ ప్యాక్ నిలిచింది.

ఐ ప్యాక్ సంస్థ‌లో ప‌నిచేసిన లీడ‌ర్లు శాఖోప‌శాఖ‌లుగా సంస్థ‌ల‌ను

ఐ ప్యాక్ సంస్థ‌లో ప‌నిచేసిన లీడ‌ర్లు శాఖోప‌శాఖ‌లుగా సంస్థ‌ల‌ను పెట్టుకున్నారు. ఆ సంస్థ‌ల‌కు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాన్ని అన్ని పార్టీలు అప్ప‌గించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీకి ఇరు రాష్ట్రాల్లో ఐ ప్యాక్ కు చెందిన సునీల్ క‌నుగోలు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి ఐ ప్యాక్ నుంచి విడిపోయిన రాబిన్ సింగ్ వ్యూహ‌క‌ర్త‌గా ప‌నిచేస్తున్నారు. ఐ ప్యాక్ ను ఏపీలోకి దించిన వైసీపీ ఇప్ప‌టికీ ప్ర‌శాంత్ కిషోర్ ను వ్యూహ‌క‌ర్త‌గా కొన‌సాగిస్తోంది. ఆయ‌న టీమ్ వైసీపీ రాజ‌కీయాల‌ను శాసిస్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీకి చెందిన ప‌లు సంస్థ‌ల‌తో పాటు ఐ ప్యాక్ స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుంటోంది.

Also Read : Tana Maha Sabalu: అంగరంగ వైభవంగా తానా సభలు, బాలయ్యతో పాటు ప్రముఖుల సందడి

స‌ర్వే సంస్థ‌ల‌న్నీ ఫ‌క్తు వ్యాపార సంస్థ‌లు. ఒక వ‌స్తువును అమ్ముకోవ‌డానికి ఎన్ని అబ‌ద్ధాలు చెబుతారు? అనేది అంద‌రికీ తెలిసిందే. లేనిదాన్ని ఉన్న‌ట్టు భ్ర‌మింప‌చేయ‌డం ఎలా అనేదానిపై నిరంత‌రం ఆ సంస్థ‌లు ప‌నిచేస్తూ స‌ర్వేల‌ను చేస్తుంటాయి. అలాగే, ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల బ‌ల‌హీన‌త‌లను ఎలా ఓటు బ్యాంకు గా మార్చుకోవాలి? అనేదానిపై నిరంత‌రం స‌ర్వే చేయ‌డం ఆ సంస్థ‌ల విధి. ఇలా, ఫ‌క్తు వ్యాపారంగా రాజ‌కీయాల‌ను మార్చేసిన రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ మొద‌టి స్థానాల్లో ఉంటాయి. అందుకే, రాజ‌కీయ విలువ‌లు ప‌డిపోయాయ‌ని జ‌స్టిస్ ర‌మ‌ణ తానా  వేదిక‌పై (TANA Conference) ఆవేద‌న చెందారు.

ప్రజాస్వామ్యం పరాజయం పాలవుతోందని జస్టిస్‌ ఎన్వీ రమణ ఆందోళన

రాజకీయాల్లో వికృత ఘటనలు చూడ్డానికి కార‌ణం ప్రైవేటు సంస్థలకు స‌ర్వేల‌ను అప్ప‌గించ‌డం. ఆ సంస్థ‌ల‌కు ప్రజలతో సంబంధం లేనివి. అవి పార్టీల‌ను ఎలా నడుపుతాయ‌ని జస్టిస్ ఎన్వీ రమణ ప్ర‌శ్న‌. సోషల్‌ మీడియాలో స్త్రీలను అసభ్యంగా చిత్రీకరించ‌డం ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన అస్త్రాలుగా చేసుకోవ‌డం రాజ‌కీయాల ప‌త‌నావ‌స్థ‌కు నిద‌ర్శ‌నం. ‘‘దుష్ప్రచారమే ఎన్నికల వ్యూహంగా మారింది. మేనిఫెస్టో గురించి మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది. సామాజిక మాధ్యమాల ద్వారా పక్కదోవ పట్టిస్తున్నారు. ప్రలోభ అంశాలకు ప్రాధాన్యత పెంచి ఓట్లు దండుకుంటున్నారు’’ అని జస్టిస్‌ రమణ అభిప్రాయ‌ప‌డ్డారు.

ప్రజాస్వామ్యం పరాజయం పాలవుతోందని జస్టిస్‌ ఎన్వీ రమణ ఆందోళన చెందారు. యువత, మేధావులు రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి నీతిమంతులు రాకపోతే.. నీతిలేని వారే రాజ్యమేలుతారన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేవరకు తెలుగువారు విశ్రమించకూడదని పిలుపునివ్వ‌డంతో తానా వేదిక  (TANA Conference) రాజ‌కీయంగా మారింది.

తానాలో తెలుగు ఎన్నారైల త‌న్నులాట‌(TANA Conference)

పాపం వీకెండ్ లో వండుకుని ఫ్రిడ్జ్ లో పెట్టి వాటినే వేడి చేసుకుని వారాంతం వరకు తింటూ ఉద్యోగాలు చేసుకునే అమెరికా లోని చాలా ప్రవాస కుటుంబాలు ఇలాంటి కన్వెన్షన్ కు  (TANA Conference)వచ్చేది వేడి వేడి ఘుమ ఘుమ లాడే భోజనాల కోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు! తానా కావచ్చు అటా లేదా నాటా నాట్స్ ఏదయినా కావచ్చు! ఆ మూడు రోజుల సభల్లో జనం ఎక్కువగా కనిపించేది డైనింగ్ హాల్ దగ్గరే! లేదంటే సినీ నటుల చుట్టూ! సభలకు సుమారు పది వేల మంది హాజరైతే వేదిక దగ్గర కుర్చీలలో ఆశీనులయ్యే వారు వెయ్యి మంది కూడా ఉండరు! ఎక్కడుంటారంటే… భోజనాల దగ్గర! లేదంటే స్టాల్స్ దగ్గర ఎక్కువగా కనిపిస్తారు!

కానీ, ప్రతి కన్వెన్షన్ లోనూ భోజనాల నిర్వహణ బెంబేలెత్తిస్తూ ఉంటుంది! ఏం చేయలేక చేతులెత్తేస్తారు నిర్వాహకులు! ఇప్పుడు ఫిలడెల్ఫియా లో జరుగుతున్న తానా సభల్లోనూ ఇదే పరిస్థితి! బాంక్వేట్ డిన్నర్ లో చాలామందికి ప్లేట్స్ దొరకలేదని ఆవేదన! రెండవ రోజు అదే పరిస్థితి! వేలాది మంది ఉంటే కేవలం నాలుగు ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేయడం ఏమిటి? గంటలు గంటలు క్యూ లో నిలబడే ఖర్మ ఏమిటంటూ కన్వెన్షన్ కు (TANA Conference) డబ్బులు కట్టి వచ్చిన వాళ్ళు చాలామంది బాహాటంగా విమర్శించారు! బ్యాడ్జీలు పెట్టుకుని తిరిగే వలంటీర్లపై విరుచుకు పడ్డారు! తొక్కిసలాట తట్టుకోలేక చాలా మంది వారి వారి హోటల్స్ కు వెళ్లి తిన్నట్లు సమాచారం!

Also Read : CJI NV Ramana : `సుప్రీం`చరిత్రలో నిలిచేలా ప‌ద‌వీ విర‌మ‌ణ రోజు..

సభలకు వచ్చే భోజనం బ్యాచ్ కోసమైనా ప్రత్యేక శ్రద్ధ చూపించాలి నిర్వాహకులు! ప్రతి కన్వెన్షన్ లో ఎదురయ్యే సమస్య అయినా ప్రతి ఏటా భోజనాల నిర్వహణ రసాబాసే! తొక్కిసలాటే! మున్ముందు సభల్లో అయినా మిగిలిన విషయాల కన్నా ముఖ్యంగా భోజనశాలను పట్టించుకోవాలని ముక్త కంఠం తో డిమాండ్ చేస్తున్నారు! అంతేకాదు, తానాకు వ‌చ్చిన తెలుగు ఎన్నారైలు త‌న్నుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దానికి కార‌ణం జూనియ‌ర్ ఎన్టీఆర్ నినాదాలు. ఒక గ్రూప్ జూనియ‌ర్ నినాదాలు చేయ‌డంతో మ‌రో గ్రూప్ వ్య‌తిరేకించింది. ఫ‌లితంగా ఇరు గ్రూపులు త‌న్నుకున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇలా, ఫ‌క్తు రాజ‌కీయ స‌భ‌గా తానా వేదిక  (TANA Conference)మార‌డం గ‌మ‌నార్హం.