Site icon HashtagU Telugu

Jan Lok Poll Survey : అసదుద్దీన్‌కు షాక్.. జన్ లోక్‌పాల్ సర్వేలో సంచలన ఫలితాలు!

Shock for Asaduddin.. Sensational results in Jan Lokpal survey!

Shock for Asaduddin.. Sensational results in Jan Lokpal survey!

Lok sabha Elections Jan Lok Poll Survey: లోక్ సభ ఎన్నికల వేళ పలు సర్వేలు రాజకీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. మాములుగా పైన మాత్రం విజయంపై ధీమాగానే ఉన్నా.. లోపల తాము గెలుస్తామో లేదో అన్న టెన్షన్ వారిని వేధిస్తోంది. అసలు జనం మనసుల్లో ఏముందోనని అభ్యర్థులు ఎప్పటికప్పుడు వారి అనుచరులు, నాయకులతో గ్రౌండ్ రిపోర్టును తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పలు ప్రైవేటు సంస్థలు నిర్వహించిన సర్వేలు అన్ని రాజకీయ పార్టీల్లో ఉత్కంఠను నెలకొనేలా చేస్తున్నాయి. తాజాగా.. తెలంగాణలో జన్ లోక్పాల్ సంస్థ చేపట్టిన సర్వే సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది.

ఇప్పటి వరకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కంచుకోటగా హైదరాబాద్ ఎంపీ స్థానానికి బీటలు వారే టైమొచ్చిందంటూ సర్వేలో తేలింది. తాజగా జన్ లోక్ పోల్ విడుదల చేసిన ఓటు షేర్ సర్వేలో ఎంఐఎం-44.25 శాతంతో ప్రథమ స్థానంలో ఉంది. అనూహ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ-42.03 శాతంతో ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది. ఇక బీఆర్-4.05 శాతం, ఇతరులు-2.97 శాతంతో తరువాత స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ కేవలం 2 శాతం ఓటు షేర్తో ద్వితీయ స్థానంలో ఉంటడం ఓవైసీని కలవరపెడుతోంది. ఏది ఏమైనా పోలింగ్ నాటకి పరిస్థితి తారుమారు అయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు ఈసారి హైదరాబాద్ ఎంపీ స్థానంపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏరికోరి డాక్టర్ మాధవీలతను హైదరాబాద్ లోక్ సభ స్థానంలో తమ అభ్యర్థిగా బరిలో దింపింది. మాధవీలత తనదైన శైలిలో నియోజకవర్గంలో ముందుకు పోతున్నారు. ఎక్కడ ఇఫ్తార్ విందు జరిగినా హాజరవుతూ హైదరాబాద్ పాతబస్తీలో తన ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read Also: Yogi : ‘కాంగ్రెస్‌ ఉగ్రవాదులకు బిర్యానీ తినిపిస్తోంది’: యోగి ఆదిత్యనాథ్‌

కాగా, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఓ సభలో పాల్గొని ప్రసంగిస్తుండగా.. మధ్యలో శివ తాండవ స్తోత్రం పఠించినట్టుగా ఓ వీడియో సోషోల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో వాట్సప్ గ్రూపుల్లో తెగ చక్కర్లు కొడుతోంది. హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు అసదుద్దీన్ ఓవైసీ.. ఇలా శివ స్తోత్రాలు పఠిస్తున్నారంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు.