Site icon HashtagU Telugu

RS Praveen Kumar : గురుకులాల్లో ముందు ఆ పోస్టులను భర్తీ చేయాలి

Rs Praveen Kumar

Rs Praveen Kumar

గురుకుల టీచర్స్ రిక్రూట్‌ మెంట్ బోర్డు (Gurukul Recruitment Board)లో DL, JL ఫలితాల కంటే ముందు PGT తుది ఫలితాలు విడుదల చేయడం వల్ల అభ్యర్థులు నష్టపోతారని తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) అభిప్రాయపడ్డారు. PGTలో జాబ్ వచ్చిన వాళ్లకి ఒక వేళ DL జాబ్ వస్తే.. అప్పుడు PGT ఖాళీలు అలాగే ఉండిపోతాయని ఆయన వెల్లడించారు. దీంతో అభ్యర్థులు నష్టపోతారని ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ పేర్కొన్నారు. ముందుగా అత్యున్నత పోస్టులు భర్తీ చేసి, తరువాత మిగతా పోస్టుల ఫలితాలిస్తే బ్యాక్లాగ్ వేకెన్సీలను నివారించవచ్చు అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. ప్రభుత్వ సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లో జరుగుతున్న విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 60 లక్షల మంది పేద విద్యార్థులు బాల్యంలోనే సమాధులయ్యే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ధ్వజమెత్తారు.

We’re now on WhatsApp. Click to Join.

విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రవీణ్‌ కుమార్‌ మండిపడ్డారు. గురుకులాలు జైలు కన్నా దారుణంగా మారాయని, విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం, వసతులు అందడం లేదని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేసినట్లే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం సైతం విద్యార్థులను మోసం చేస్తోందని విమర్శలు గుప్పించారు ప్రవీణ్ కుమార్‌. గురుకులాల ఉద్యోగులకు జీతాలు రాకపోవడం శోచనీయమన్న ప్రవీణ్‌ కుమార్‌… సీఎం ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు మంత్రులను ఎందుకు నియమించలేదో చెప్పాలన్నారు.

 

Read Also : Joints Pains: మోకాళ్ళ నొప్పులా.. అయితే ఈ ఒక్కటి పాటిస్తే చాలు నడవలేని వారి సైతం లేచి పరిగెత్తాల్సిందే?