Telangana Assembly 2024: తెలంగాణ అసెంబ్లీలో కులగణన తీర్మానం

  • Written By:
  • Updated On - February 16, 2024 / 03:41 PM IST

అసెంబ్లీ తెలంగాణ ప్రభుత్వం (Congress Govt) కులగణన తీర్మానం (Caste Census Resolution) ప్రవేశపెట్టింది.మంత్రి పొన్నం (Ponnam ) తీర్మానం ప్రవేశపెట్టగా.. ఇచ్చిన హామీ మేరకు తీర్మానం ప్రవేశం పెట్టామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఈ తీర్మానానికి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, ఎమ్ఐఎమ్‌ నేతలు మద్దతు ఇచ్చారు. మద్దతు తెలిపింది. కాగా ప్రభుత్వం కులగణన, జనగణన, సర్వే చేస్తామంటోందని, అన్ని రకాల పదాలు వాడితే గందరగోళం ఏర్పడుతుందని BRS ఎమ్మెల్యే కడియం అన్నారు. ఇందులో ప్రతిపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి పొన్నం తెలిపారు. డోర్ టు డోర్ సర్వే చేసి వివరాలు సేకరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

చట్టసభల్లో అన్ని కులాలకు న్యాయం చేసేందుకే కులగణన చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. BRS చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను సభలో పెట్టారా? అని ప్రశ్నించిన రేవంత్.. ఆ సర్వేను ఎన్నికల కోసమే వాడుకుందని ఆరోపించారు. తమకు రాజకీయ దురుద్దేశాలు లేవని, కులగణనపై అనుమానాలు వద్దని సూచించారు. ప్రజల్లో అనుమానాలు లేవనెత్తేలా విపక్షాల వ్యాఖ్యలున్నాయని సీఎం మండిపడ్డారు.

కులగణన అంటే ఏంటి (Caste Census Resolution)..?

దేశంలో జనగణనకు శతాబ్దన్నరకు పైగానే చరిత్ర ఉంది. పన్నుల వసూళ్ల కొరకు బ్రిటిష్‌ వాళ్లు జనాభా లెక్కల సేకరణను 1866లో మొదలు పెట్టారు. వాళ్ల ప్రయోజనాల కోసమే అయినా కులాల వారి జనగణన పద్ధతిని 1931 వరకు కొనసాగించారు. జనాభా లెక్కల్లో కులాల లెక్కింపు చివరి సారిగా అప్పుడే జరిగింది. దేశంలో వివిధ రకాల సామాజిక శ్రేణుల సంక్షేమం కోసం అమలవుతున్న పథకాలు, రాజ్యాంగ నిర్మాణాంతరం అమలవుతున్న రిజర్వేషన్లు గత 90ఏళ్ల నాటి కులాల డేటా ప్రాతిపదికనే అమలవుతున్నవి.

We’re now on WhatsApp. Click to Join.

దీనికి షెడ్యూల్‌ కులాలు,తెగల గణన మినహాయింపు, వారికి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు పర్చాలన్న రాజ్యాంగ నియమావళిని అనుసరించి వారి జనగణన జరుగుతున్నది. అయితే బీసీ కులాల జనగణన చేయకూడదన్న నిబంధనలు రాజ్యాంగంలో ఏమీ లేవు. దేశంలో 1931 నాటి లెక్కల ఆధారంగానే బీసీ కులాలు 62శాతం పైగా ఉన్నట్టు మండల్‌ కమిషన్‌ తేల్చింది. అసలు జనాభా లెక్కలు అంటే యాంత్రికంగా మనుషులను నిలబెట్టి తలలు లెక్కించడం కాదు. మొత్తం ఒక దేశ మానవ వనరుల నిర్ధారణ.దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక చిత్రణ.మానవ వనరులకు,వసతులకు మధ్య సమతూకం సాధించడానికి ఉపయుక్తమైన ప్రాతిపదికను జనగణన కార్యం ఏర్పరుస్తుంది.

సుదీర్ఘ చర్చలు, రాజకీయ పోరాటాల తర్వాత 2011లో అప్పటి కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ‘సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్‌ఈసీసీ)’ చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణ-పట్టణ పేదరిక నిర్మూలన శాఖలు సర్వే చేపట్టి 2016లో తమ డేటాలను ప్రచురించాయి. కానీ వాటిలో కులాలవారీ లెక్కల ప్రస్తావన లేదు. కులాల డేటా వివరాలను కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత శాఖకు అప్పగించారు. దీనిపై అధ్యయనానికి ఆ శాఖ ఓ నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదికను ఇప్పటిదాకాబహిర్గతం చేయలేదు. గ్రామీణాభివృద్ధి శాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ 2016 ఆగస్టు 31న లోక్‌సభ స్పీకర్‌కు తన నివేదికను అందజేసింది. ‘డేటాను పరిశీలిం చాం. వ్యక్తుల కులాలు, మతాలకు సంబంధించిన వివరాలు 98.87 శాతం లోపరహితంగా ఉన్నాయి. దేశంలో జనాభా సంఖ్య 118,64,03,770 అని ఎస్‌ఈసీసీ పేర్కొనగా.. 1.35 కోట్ల మంది విషయంలో మాత్రమే సర్వేలో తప్పులు కనిపించాయి. తదనుగుణంగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించాం’ అని కమిటీ పేర్కొంది. ఆ తర్వాత రాజకీయ పార్టీలేవీ కులగణన ప్రస్తావన తేలేదు. 2021లో జనాభా లెక్కల సమయంలో ఓబీసీల గణన కూడా చేపట్టాలని జాతీయ బీసీ కమిషన్‌ కేంద్రాన్ని కోరింది. దాంతో మళ్లీ దీనిపై చర్చ మొదలైంది. జేడీయూ, ఆర్‌జేడీ, బీఆర్‌ఎస్‌, ఎన్‌సీపీ వంటి విపక్షాలు దీనిని సమర్థించాయి. మోడీ సర్కారు మాత్రం వ్యతిరేకించింది. ఆ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. తర్వాత కరోనా కారణంగా జనాభా లెక్కల సేకరణ వాయిదాపడింది.

Read Also :