Site icon HashtagU Telugu

AP – TS Poll : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ముగిసిన పోలింగ్‌

Polling Ends In Maoist Affe

Polling Ends In Maoist Affe

తెలుగు రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం గైడెన్స్ ప్రకారం అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ పూర్తి అయ్యింది. ఏపీలో అరకు, పాడేరు, రంపచోడవరం..ఈ మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక తెలంగాణ విషయానికొస్తే.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ , పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు గంటలకు పోలింగ్ పూర్తయింది. అలాగే.. వరంగల్ పార్లమెంటు పరిధిలోని భూపాలపల్లి… మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలు.. అటు ఖమ్మం పార్లమెంటు పరిధిలోని కొత్తగూడెం, అశ్వరావుపేట అసెంబ్లీ అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ ముగిసింది. అత్యంత పటిష్ట భద్రత మధ్య పోలింగ్ సామగ్రిని తరలించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also : AP Poll : గన్నవరంలో హై టెన్షన్..వంశీ, యార్లగడ్డ వర్గీయుల మధ్య ఘర్షణ