New CJs: హైకోర్టులకు కొత్త సీజేలు.. ఏపీకి జస్టిస్‌ ధీరజ్ సింగ్ ఠాకూర్‌, తెలంగాణకు జస్టిస్ అలోక్ అరదే

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

  • Written By:
  • Updated On - July 6, 2023 / 11:49 AM IST

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీకి జస్టిస్‌ ధీరజ్ సింగ్ ఠాకూర్‌, తెలంగాణకు జస్టిస్ అలోక్ అరదేను కొలీజియం సిఫార్సు చేసింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 2013లో అక్కడి హైకోర్టుకు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన 2022 జూన్‌ నుంచి బాంబే హైకోర్టు జడ్జిగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ను మణిపుర్‌ హైకోర్టు సీజేగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

అది కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో దాన్ని కొలీజియం రద్దు చేసింది. తాజాగా ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ను సిఫార్సు చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్ అలోక్ అరదే.. 2009లో అక్కడి హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2018 నవంబర్ నుంచి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.

తెలంగాణకు ప్రస్తుతం సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వ్యవహరిస్తున్నారు.మరోవైపు తెలంగాణ, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులైన జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ ఎస్‌ వెంకటనారాయణ భట్టిలకు పదోన్నతి దక్కింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమోషన్ కల్పిస్తూ కొలీజియం సిఫారసు చేసింది. ఆయా న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి సుప్రీం కొలీజియం చేసిన సిఫారసులను రాష్ట్రపతి ఆమోదించాక పదోన్నతులు అమల్లోకి రానున్నాయి.

Also Read: New CJs: హైకోర్టులకు కొత్త సీజేలు.. ఏపీకి జస్టిస్‌ ధీరజ్ సింగ్ ఠాకూర్‌, తెలంగాణకు జస్టిస్ అలోక్ అరదే