Site icon HashtagU Telugu

MP Dharmapuri : మోడీకి ఓటు వెయ్యకుంటే నరకానికి పోతారు – ఎంపీ అరవింద్ ధర్మపురి

Mp Dharmapuri Arvind

Mp Dharmapuri Arvind

మోడీ (PM Modi) ఇచ్చే పథకాలు (Schemes) తీసుకుంటూ మోడీకి ఓటు వెయ్యకుంటే నరకానికి పోతారు అంటూ నిజామాబాద్ బిజెపి ఎంపీ అరవింద్ ధర్మపురి (MP Dharmapuri Arvind) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ లో బిజెపి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తుంది. ఈ క్రమంలో మంగళవారం కోరుట్లలో నిర్వహించిన ఈ యాత్రలో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.. బస్టాండ్ సర్కిల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు.

రాబోయే ఎన్నికల్లో బిజెపి విజయ డంకా మోగిస్తుందని, అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని, లోక్ సభ ఎన్నికలలో బిజెపి 70 సీట్లు సాధిస్తుందని జోస్యం చెప్పారు. బిజెపి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రగతి సాధ్యమైందని, గత 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేయలేని అభివృద్ధిని, చేయలేని ప్రగతిని, తీసుకురాలేని ప్రపంచ గుర్తింపును 10 సంవత్సరాల లోనే ప్రధాని మోడీ చేసి చూపించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియా కూటమి నుంచి పార్టీలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రైతులను కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల మోసం చేసిందని , దేశానికి పట్టిన పీడ కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడిన ఆయన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని, దీనిపై రేవంత్ రెడ్డికి స్పష్టత కొరవడింది అని మండిపడ్డారు. మోడీ ఇచ్చే పథకాలు తీసుకుంటూ కాంగ్రెస్ , బిఆర్ఎస్ కు ఓటు వేస్తే మీరు నరకానికి పోతారని, దేశ ద్రోహులు మీరే అవుతారని అరవింద్ అన్నారు.

Read Also : AP News: భక్తుల కొంగుబంగారం కోటప్పకొండ.. ఆలయ ప్రత్యేకతలు ఇవే