Site icon HashtagU Telugu

Lulu Mall : హైదరాబాద్ లో అతి పెద్ద లులు మాల్.. సర్వం సిద్ధం..!

Lulu Mall Opening In Hydera

Lulu Mall Opening In Hydera

Lulu Mall అతి పెద్ద గ్రూప్ అయిన లులు మాల్ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా రెడీ అవుతుంది. హైదరాబాద్ కూకట్ పల్లిలో లులు గ్రూప్ ఏర్పాటు చేస్తున్న మాల్ ను ఈ నెల 27న ప్రారంభం కానుంది. ఇది కేవలం హైదరాబాద్ లోనే కాదు దేశంలోనే అతి పెద్ద మాల్ కాబోతుంది. కూకల్ పల్లి మంజీరా మాల్ ను రీమోడలింగ్ చేసి లులు మాల్ ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇండియాలో లులు గ్రూప్ కి చెందిన ఐదు అతి పెద్ద మాల్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో 6 మాల్ ఏర్పాటు చేస్తున్నారు.

లులు మాల్స్ (Lulu Mall ) అన్నిటికన్నా కూకట్ పల్లిలో ఏర్పాటు చేస్తున్నది అతి పెద్దదని తెలుస్తుంది. యూఏఈ కేంద్రంగా ప్రముఖ ఇంటర్నేషనల్ సంస్థలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. వాటిలోనే లులు మాల్ ఒకటి. ఈ లులు మాల్ వల్ల 2500 మందికి ఉపాది అవకాశాలు లభిస్తాయి.

2 వేల కోట్లతో హైదరబాద్ లో 22 లక్షల చదరవు అడుగుల్లో డెస్టినేషన్ షాపింగ్ మాల్ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇదే కాకుండా తెలంగాణాలోని ఇతర నగరాల్లో కూడా 1000 కోట్లతో మినీ మాల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. ఐదేళ్లలో మొత్తం 3500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు లులు సంస్థ ఒప్పందాలు చేసుకుంది.

లులు సంస్థకు 22 దేశాలో 250 హైపర్ మార్కెట్లు ఉన్నాయి. తెలంగాణ బియాన్ని, మాంసాన్ని ఎగుమతి చేస్తాయని తెలుస్తుంది. దేశ వ్యాప్తంగా లులు సంస్థ 20000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టింది.

రాబోయే మూడేళ్లలో మరో 10 వేల కోట్ల పెట్టుబడులు కూడా పెట్టేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ లులు మాల్ లో 75 కి పైగా అంతర్జాతీయ బ్రాండెడ్ షోరూం లు 5 భారీ మల్టీప్లెక్స్ స్క్రీన్ లు వాటితో పాటుగా పెద్ద ఫుడ్ కోర్ట్ గేమింగ్ జోన్స్ కూడా ఉన్నాయి.

Also Read : Prabhas Salaar : రెబల్ ఫ్యాన్స్ కు షాక్.. సలార్ 6 నెలలు వెనక్కి..!