Site icon HashtagU Telugu

Flying Kiss : మొన్న రాహుల్..నిన్న కేటీఆర్..ఏంటి ఈ ఫ్లయింగ్ కిస్ లు..?

Ktr Giving Flying Kiss To S

Ktr Giving Flying Kiss To S

ఫ్లైయింగ్ కిస్ (Flying Kiss)..అనేది మామూలేది కానీ..ఇప్పుడు రాజకీయంగా చర్చగా మారింది. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)..లోక్ సభ లో మణిపూర్ వ్యవహారంలో కేంద్రం తీరుపై చెరిగారు. మణిపూర్ లో భారత్ ను చంపేశారంటూ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ ప్రసంగం ముగియగానే అధికార పక్షం వైపు చూస్తూ ఓ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి రాహుల్ వెళ్లిపోయారు. ఆలా వెళ్లిన దగ్గరినుండి రాహుల్ ఫ్లైయింగ్ కిస్ ఫై పెద్ద రగడ నడుస్తుంది.

రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడాన్ని కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ తప్పుబట్టారు. బీజేపీ మహిళా ఎంపీల వైపు చూస్తూ రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని, గాంధీ కుటుంబం మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఆతర్వాత లోక్ సభ స్పీకర్ ను కలిసి రాహుల్ ఫై పిర్యాదు చేసారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా మాట్లాడుకుంటుండగానే మరో నేత ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఆయనే తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ (KTR).

తాజాగా మంత్రి కేటీఆర్ నిజామాబాద్‌లో పర్యటించిన (KTR Nizamabad Tour) పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆలా పర్యటన లో భాగంగా ఓ స్కూల్ పక్కనుండి వెళ్తుండగా..విద్యార్థులు పెద్ద ఎత్తున కేటీఆర్ సర్ ..అంటూ అరవడంతో వారి అరుపులు విన్న కేటీఆర్ వాళ్ల వద్దకు వెళ్లారు. కేటీఆర్ చూడగానే విద్యార్థులు ఎంతో సంతోషపడ్డారు. కొంతమందిని ఏ క్లాస్ అని అడిగారు కేటీఆర్. దానికి వాళ్లు ఆరో తరగతి అని చెప్పారు. అయితే చదువు కోకుండా ఇలా ఎందుకు ఖాళీగా ఉన్నారని ప్రశ్నించారు కేటీఆర్. స్కూల్‌లో టీచర్స్ లేరా అని ఆరా తీశారు. తాము మీకు ఫ్యాన్స్ అని… అందుకే ఇలా విష్ చేయడానికి బయటకు వచ్చామని కేటీఆర్‌కు వివరించారు. అయితే మీకు నేను కూడా పెద్ద ఫ్యానే అంటూ వారికి ఫ్లయింగ్ కిస్ (KTR Flying Kiss) ఇచ్చారు. ఇది కాస్త సోషల్ మీడియా వైరల్ అవుతుండడం..కేటీఆర్ సర్ కూడా రాహుల్ బాటలోనే నడిచాడని కొంతమంది కామెంట్స్ చేస్తే..ఈ ఫ్లయింగ్ కిస్ల రచ్చ ఏంటి అని మరికొంతమంది కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

Read Also : Bhola Shankar Talk : భోళా శంకర్ టాక్..డెడ్లీ బ్లాక్ బస్టర్