వరంగల్ జిల్లాకు చెందిన ప్రవళిక నాలుగు రోజుల క్రితం ఆత్మహత్య (Pravalika Suicide) చేసుకున్న సంగతి తెలిసిందే. గ్రూప్-2 (Group 2 Exams) పరీక్షలు వాయిదా వేయటం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని.. విద్యార్థి సంఘం నాయకులు, రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ప్రవళిక ఆత్మహత్య వ్యవహారం అధికార పార్టీ (BRS)కి తలనొప్పిగా మారింది. ఇదే క్రమంలో కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలు సైతం బిఆర్ఎస్ ఫై మరింత ఆగ్రహం తెప్పించేలా చేసింది. రెండు రోజులుగా పలు విద్యార్థి సంఘాలు , ప్రతిపక్ష పార్టీలు కేటీఆర్ ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఇదే తరుణంలో కాంగ్రెస్ నేత రాహుల్ (Rahul) సైతం ప్రవళిక కుటుంబాన్ని కలవబోతున్నారనే వార్తలు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసాయి. ఈ క్రమంలో కేటీఆర్ కీలక హామీ చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రవళిక ఆత్మహత్యపై కొందరు చిల్లర రాజకీయం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈరోజు ప్రవళిక కుటుంబం తనను కలిసిందని… వారిని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చినట్లు తెలిపారు. ప్రవళిక తమ్ముడికి ఉద్యోగం (ktr Announce Govt Job to Pravalika Brother) ఇస్తామని చెప్పాం. రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీతో పాటు బీజేపీవాళ్లు వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ల మాటలను నమ్మవద్దు. 9 ఏళ్లలో 2 లక్షల 20 వేల ఉద్యోగాలకు భర్తీకి శ్రీకారం చుట్టాం. లక్ష 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. మిగతా ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తాం. అవసరమైతే కమిషన్ ను కూడా ప్రక్షాళన చేస్తాం. యువతకు న్యాయం చేస్తాం. మా మీద విశ్వాసం ఉంచండి. మరోసారి అధికారం ఇవ్వండి” అని మంత్రి కేటీఆర్ కోరారు.
మరోపక్క ప్రవళిక ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె ప్రియుడు శివరాంను అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడి వేధింపుల వల్లనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ప్రవళిక ఆత్మహత్యతో పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేసిన వారిపై కేసులు నమోదవుతున్నాయి.13 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఓయూ జేఏసీ చైర్మన్ సురేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్, అనిల్ కుమార్, బీజేవైఎం నాయకులు భాను ప్రకాష్‌తో పాటు మరికొంత మంది కేసులు నమోదు చేశారు.
Read Also : Centre approves 4% Hike in DA : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించిన మోడీ సర్కార్