Site icon HashtagU Telugu

Hyderabad IT Raids : హైదరాబాద్‌లో 30 చోట్ల ఐటీ రైడ్స్

Hyderabad It Raids

Hyderabad It Raids

హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ (Hyderabad IT Raids)  కలకలం సృష్టించాయి. ఐటీ అధికారుల వేర్వేరు బృందాలు ఫార్మా, రియల్ ఎస్టేట్ సంస్థల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేస్తున్నాయి. అత్తాపూర్ కేంద్రంగా నడుస్తున్న కోహినూర్ రియల్ ఎస్టేట్ సంస్థ పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణ రావడంతో.. ఐటీ అధికారులు రాజేంద్రనగర్ కింగ్స్ కాలనీలో ఉంటున్న ఆ సంస్థ ఎండీ మాజిద్ ఖాన్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని పలు ఏరియాల్లో ఉంటున్న ఆ సంస్థ డైరెక్టర్ల నివాసాల్లోనూ సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఈ రైడ్స్ లో(Hyderabad IT Raids) కొన్ని కీలక డాక్యుమెంట్లు ఐటీ అధికారులకు దొరికినట్టు సమాచారం.  హైగ్రో కెమికల్స్, విజయశ్రీ ఆర్గానిక్స్ సంస్థలపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయి.

also  read  : IT Raids: వైట్ ఎంత‌? బ్లాక్ ఎంత? ప్రభాస్, అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ పై ఐటీ ఆరా!