తెలంగాణ‌పై పులి పంజా..రియ‌ల్ ఎస్టేట్ తో జ‌నంపై వేట‌

తెలంగాణ గ్రామాలు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌లో త‌ర‌చూ చిరుత‌, పులి, ఎలుగ‌బంటులు క‌నిపిస్తున్నాయి. గ‌త నవంబ‌ర్, డిసెంబ‌ర్లో హైద‌రాబాద్ రాజేంద్ర‌న‌గ‌ర్ ప్రాంతంలో రెండు చిరుత‌ల‌ను అట‌వీ అధికారులు ప‌ట్టుకున్నారు.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:33 PM IST

తెలంగాణ గ్రామాలు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌లో త‌ర‌చూ చిరుత‌, పులి, ఎలుగ‌బంటులు క‌నిపిస్తున్నాయి. గ‌త నవంబ‌ర్, డిసెంబ‌ర్లో హైద‌రాబాద్ రాజేంద్ర‌న‌గ‌ర్ ప్రాంతంలో రెండు చిరుత‌ల‌ను అట‌వీ అధికారులు ప‌ట్టుకున్నారు. ప‌టాన్ చెరువు ప్రాంతంలోని ఇక్రిశాట్ వ‌ద్ద ఇంకో చిరుత సంచారాన్ని క‌నుగొన్నారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో స‌ర్వ‌సాధార‌ణం ఉండేవి. ఆ జిల్లాలో ఇటీవ‌ల ఇద్ద‌రు మ‌గ‌వాళ్ల‌ను పులి చంపేసింది. ఇక ఆవులు, గొర్రెలు, మేక‌ల మీద దాడులు అనేకం.
క్రూర‌మృగాలు జ‌న‌సంచారం ఉండే ప్రాంతాల‌కు రావ‌డానికి కార‌ణాల‌పై అట‌వీశాఖ అధికారులు అధ్య‌య‌నం చేశారు. ఒక్కో సంఘ‌ట‌న ఒక్కో విధంగా వాళ్ల అధ్య‌య‌నంలో తేలింది. మెద‌క్ జిల్లా చిన్న‌శంక‌రంపేట మండ‌లం కామారం గ్రామంలో పోయిన ఆదివారం అట‌వీశాఖ అధికారులు చిరుతను ప‌ట్టుకున్నారు. ఇలాంటివి అక్క‌డ గ‌త ఐదే
ళ్ల‌లో ప‌ది సంఘ‌ట‌న‌లు ఇలాంటివే జ‌రిగాయి. ఇటీవ‌ల కొన్నేళ్ల నుంచి ఎలుగ‌బంటులు, అడ‌వి పందులు, చిరుత‌లు తెలంగాణ రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల‌లో క‌నిపిస్తున్నాయి. వాటిని ఎప్ప‌టిప్పుడు ప‌ట్టుకుని స‌మీపంలోని అడ‌వుల్లో వ‌దిలేస్తున్నారు.
మ‌హారాష్ట్ర అడ‌వుల నుంచి తెలంగాణాలోకి పులి ప్ర‌వేశించింద‌ని అట‌వీశాఖ అధికారులు కొనుగొన్నారు. నవంబ‌ర్, డిసెంబ‌ర్ నెల‌లో ఇద్ద‌రిని పులి చంపేసింది. గ‌తంలో ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఆదిలాబాద్ జిల్లాలో అనేకం ఉండేవి. మ‌ళ్లీ ఇప్పుడు పునావృతం అవుతున్నాయి. దీనికి గ‌ల కార‌ణాల‌ను అట‌వీశాఖ అధికారులు అధ్య‌య‌నం చేశారు. వాళ్ల నివేదిక ప్ర‌కారం అట‌వీ ప్రాంతాల‌ను ధ్వంసం చేయ‌డం ప్ర‌ధాన కార‌ణంగా పొందుప‌రిచారు.
వాస్త‌వంగా హైదరాబాద్ చుట్టు ప‌క్క‌ల కొండ‌లు, గుబురుగా ద‌ట్ట‌మైన చెట్లు ఉండేవి. వాటిని గ‌త కొన్నేళ్లుగా చ‌దును చేసి రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్లు వేస్తున్నారు. క్ర‌మంగా అడ‌వి జంతువులు ఉండే స్థావ‌రాలు క‌నుమ‌రుగు అయ్యాయి. వ‌న్య ప్రాణులు, క్రూర మృగాలు సంచారం చేయడానికి అడ‌వులు లేకుండా పోయాయి. ఫ‌లితంగా ఆహారం కోసం గ్రామాలు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలలో పులి, చిరుత‌ల సంచారం ఎక్కువ అయింది. అందుబాటులో ఉన్న కొద్దిపాటి అడవుల్లో క్రూర‌మృగాల‌కు స‌హ‌జ ఆహారంగా ఉండే దుప్పులు, జింక‌లు లేకుండా పోయాయి. జ‌న సంచారం ఎక్కువ‌గా ఉండే ప్రాంతాలు పెరిగిపోవ‌డంతో వ‌న్య మృగాల సంఖ్య త‌గ్గిపోయింది. ఫ‌లితంగా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేక‌లను వేటాడ‌డానికి గ్రామాలు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌లోకి ఎంట్రీ ఇస్తున్నాయ‌ని అట‌వీశాఖ తాజాగా త‌యారు చేసిన నివేదిక‌లు పొందుప‌రిచారు. రాబోయే రోజుల్లో రియ‌ల్ ఎస్టేట్ విస్త‌రించే కొద్దీ పులి, చిరుత‌లు మ‌నుషుల‌ను వేటాడంలో ఆశ్చ‌ర్యంలేదు. సో..బీ కేర్ ఫుల్