Site icon HashtagU Telugu

Ideathon 2024 : ఐడియాథాన్ 2024 కు విశేష స్పందన – స్మితా సబర్వాల్

Ideathon 2024

Ideathon 2024

తెలంగాణ ప్రభుత్వానికి పట్టణాలతో పాటు గ్రామాల నుంచి ఆదాయం సృష్టించే ఇన్నోవేషన్ ఐడియాలను.. నెటిజన్ల నుంచి ఆహ్వానించారు. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఆధ్వర్యంలో ఐడియాథాన్ 2024 (Ideathon 2024) పేరుతో ప్రకటన చేశారు. స్థానిక సంస్థలు సుస్థిర అభివృద్ధి సాధించడంలో ప్రజల అభిప్రయాలను, ఆకాంక్షలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ప్రజలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలనేదే ఈ ఐడియాథాన్ నిర్వహించడం వెనక ప్రధాన ఉద్దేశం.

ప్రభుత్వం అమలు చేసే విధానాలతో పాటు రాష్ట్ర ప్రజలు ఎవరైనా ప్రభుత్వానికి ఆదాయం సృష్టించే మార్గాల గురించి అదిరిపోయే ఐడియా ఇవ్వాలని కోరారు. ప్రజల నుంచి వచ్చే ఐడియా నచ్చితే దానిని ఫ్రీగా తీసుకోమనీ.. రూ.లక్ష ఇస్తామని స్మితా సబర్వాల్ (Smita Sabharwal) ప్రకటించారు. దీనికి యువత నుండే కాక అనేక సంస్థల నుండి విశేష స్పందన వచ్చింది. వేలాదిమంది తమ ఐడియా లను తెలిపారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి విదేశాల నుండి కూడా తామ అభిప్రాయాలను షేర్ చేసారు.

Ideathon2 2024

Ideathon3 2024


12 ఏరియాల నుండి 47 మంది, 29 రకాల ఆలోచనలను పంపించడం జరిగినట్లు ఆర్ధిక సంఘం తెలియజేసింది. ఆగస్టు 16 2024 నుండి అప్లికేషన్ల స్వీకరణ మొదలైంది, వచ్చినా అప్లికేషన్స్ అన్నిటినీ ప్రీనింగ్ కమిటీ ఎప్పటికప్పుడు రివ్యూ చేసినట్లు తెలిపారు. సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. అనేక రౌండ్స్ లో ఈ ఆలోచనలను మరింత వివరంగా తెలుసుకొని, నచ్చిన ఆలోచనలను గ్రాండ్ ఫినాలేకి ఎంపిక చేశారు. అక్టోబర్ 1 న చివరి, రౌండ్ తో ఐడియాల పై చర్చ ముగిసింది. ఇలా నాలుగు రౌండ్లు నిర్వహించి, ఫైనల్ విజేతలను, కొన్ని అద్భుతమైన ఐడియా య లను ఎంపిక చేసినట్లు తెలిపారు.

వ్యర్థాల నిర్వహణ, సోలార్ ఎనర్జీ, ఉద్యోగ కల్పన, స్మార్ట్ ఎకనామిక్ జోన్స్, గ్రామాల్లో వ్యర్థాల నుండి సంపదను సృష్టించడం, నగరపాలక సంస్థల కోసం డిజిటల్ ప్రచారం, నగర పాలక సంస్థల్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ స్టేషన్స్, వ్యవసాయ భూములకు లేజర్ సరిహద్దు, వత్తి పన్ను పద్దతులు, మున్సిపాలిటీల పచ్చదనం, స్థానిక సంస్థల బడ్జెట్ రూపకల్పన, స్థానిక సంస్థలను రుణ గ్రహీతలుగా మార్చే ప్రచారం, స్థానిక సంస్థల ద్వారా ప్రభుత్యానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉండటం ..ఇలా అనేక అంశాల మీద కొత్త ఆలోచనలు తెలియజేసారు.

Read Also : PM-Kisan 18th Installment: రైతుల ఖాతాలోకి రూ.20,000 కోట్లు పంపిణీ చేసిన పీఎం మోడీ