Site icon HashtagU Telugu

KCR Injured: మాజీ సీఎం కేసీఆర్ కు తీవ్ర గాయం.. ఆసుపత్రిలో చేరిక..!

KCR Injured

Compressjpeg.online 1280x720 Image 11zon

KCR Injured: తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ (KCR Injured) యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయన ఇంట్లో కాలు జారి పడటంతో గాయమైనట్లు సమాచారం. కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం అర్థరాత్రి రాత్రి బాత్రూంలో జారి కింద పడడంతో సీఎం కేసీఆర్‌ కు గాయాలు అయినట్లు సమచారం అందుతోంది. యశోద హాస్పటల్ కు మాజీ సీఎం కేసీఆర్‌ ను ఆయన కుటుంబ సభ్యులు తరలించినట్లు సమచారం.

Also Read: Whats Today : సీఎం రేవంత్ ప్రజాదర్బార్.. గుంటూరు జిల్లాలో చంద్రబాబు టూర్

అర్ధరాత్రి రెండున్నర గంటలకు ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. కాలు జారి పడటంతో తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ తుంటి ఎముక విరిగినట్టు వైద్యులు గుర్తించారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

We’re now on WhatsApp. Click to Join.