Election Budget : బ‌డ్జెట్ తో `ముంద‌స్తు`దూకుడు, తెలంగాణ బ‌డ్జెట్ హైలెట్స్

తెలంగాణ బ‌డ్జెట్ ను నెంబ‌ర్ 1(Election Budget)గా హ‌రీశ్‌రావు వ‌ర్ణించారు.

  • Written By:
  • Updated On - February 6, 2023 / 02:46 PM IST

ద‌క్షిణ భార‌త దేశంలోనే నెంబ‌ర్ 1 బ‌డ్జెట్ (Election Budget) గా తెలంగాణ బ‌డ్జెట్ ను ఆర్థిక మంత్రి మంత్రి హ‌రీశ్‌రావు వ‌ర్ణించారు. అంతేకాదు, తెలంగాణ ఆచ‌రిస్తోంది, దేశం అనుస‌రిస్తోంది అంటూ కొటేష‌న్ వినిపించారు. జాతీయ వృద్ధి రేటును దాటి తెలంగాణ(Telangana) దూసుకుపోతోంద‌ని వెల్ల‌డించారు. గ‌త ఏడాది (2022-2023) మార్చి 7న రూ.2.71 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విష‌యాన్ని గుర్తు చేస్తూ వ‌చ్చే ఆర్థిక ఏడాదికి(2023-2024) రూ. 2ల‌క్ష‌లా 90వేల 396 కోట్ల‌తో రాష్ట్ర బ‌డ్జెట్ రూపొందించారు. నిశితంగా ఈ బ‌డ్జెట్ ను ప‌రిశీలిస్తే, ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి కేసీఆర్ స‌ర్కార్ సిద్ధ‌ప‌డుతుంద‌ని ఆర్థిక వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. బ‌డ్జెట్ లోని హైలెట్ పాయింట్స్ ఇలా ఉన్నాయి.

దేశంలోనే నెంబ‌ర్ 1 బ‌డ్జెట్ (Election Budget)

*2023-24 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.2,90,396 కోట్లు. ఇందులో రెవ్యెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు, మూలధన వ్యయం రూ. 37,525 కోట్లుగా ప్రతిపాదిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పారు.

*ఏప్రిల్‌ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్‌ నెల నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ చేయబోతున్నాం. సెర్ఫ్‌ ఉద్యోగుల పేస్కేల్‌ సవరణ కూడా చేయబోతున్నాం.

* కొత్తగా నియమించబడే ఉద్యోగుల జీత భత్యాల కోసం రూ. 1000 కోట్లు. 2014 జూన్‌ నుంచి ఫిబ్రవరి 2022 దాకా ప్రత్యక్ష నియామక విధానం ద్వారా 1,61,572 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో 1,41,735 పోస్టుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. వీటితో పాటు కొత్తగా 2022 మార్చి నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039 పోస్టులను వివిధ కేటగిరీల్లో భర్తీ చేస్తామని ప్రకటించారు. వీటి ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. కొత్తగా నియమించబడే ఉద్యోగుల జీత భత్యాల కోసం ఈ బడ్జెట్‌లో రూ. 1000 కోట్లు అదనంగా ప్రతిపాదించడమైనది.

Also Read : Telangana Budget : ఎన్నిక‌ల బ‌డ్జెట్‌, ఎస్సీల‌కు పెద్ద పీట‌, బీసీల‌కు నామ‌మాత్రం

*అటెండర్‌ నుంచి ఆర్డీవో దాకా స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు. లోకల్‌ కేడర్ల ఏర్పాటు మరియు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ల వ్యవస్థ రాజ్యాంగంలోని 371 (ఢీ ) ఆర్టికల్‌ కింద రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదలతో కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులను తెలంగాణ కోసం ప్రత్యేకంగా సాధించారు. ఈ ఉత్తర్వుల ద్వారా తెలంగాణలో 33 జిల్లాలు, 7 జోన్లు, రెండు మల్టీ జోన్లుగా ఉద్యోగ నియామకాల కోసం ఏర్పాటు చేసుకున్నాం.

*గతంలో స్థానికులకు 60 నుంచి 80 శాతం వరకు మాత్రమే రిజర్వేషన్లు ఉండేవి. ఇప్పుడు అమలు చేస్తున్న నూతన నియామక విధానంతో అటెండర్‌ నుంచి ఆర్డీవో దాకా స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు లభిస్తాయి. కొత్త నియామకాలు ఈ పద్ధతిలోనే జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సాధించిన చారిత్రాత్మక విజయం ఇది.

ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం కొత్త ఈహెచ్‌ఎస్‌ విధానం.

*ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం కొత్త ఈహెచ్‌ఎస్‌ విధానం. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు కొత్త ఈహెచ్‌ఎస్‌ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంప్లాయిస్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ను ఏర్పాటు చేసి ఇందులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులు, రిటైర్డ్‌ ఉద్యోగుల ప్రతినిధులను భాగస్వామ్యులుగా చేస్తుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుంది.

*ఉద్యోగుల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులది కీలకమైన భాగస్వామ్యం. పలు విభాగాలను పరిశీలిస్తే తెలంగాణ ఉద్యోగులు దేశంలోకెల్లా అత్యధిక వేతనాలు పొందుతున్నారని సగర్వంగా తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా, ఇతర రాష్ట్రాల ఉద్యోగుల కన్నా మన ఉద్యోగుల మెరుగైన జీతభత్యాలు పొందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా అంగన్‌ వాడీ, ఆశా, ఇంకా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ఇవ్వటం.. దానిని ఏకకాలంలో వర్తింపచేయటం దేశంలోనే ప్రథమం.

*అమరుల స్మారక కేంద్రం త్వరలో ప్రారంభం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల స్మృతిలో ప్రభుత్వం రూ.178 కోట్ల వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా స్మారక కేంద్రాన్ని నిర్మించింది. ఈ కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

*మార్చి నాటికి 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణం పూర్తి. సచివాలయ సమీపంలో సమున్నతంగా 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని రూ. 147 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తున్నది. సామాజిక న్యాయ స్ఫూర్తికి సమున్నత ప్రతీకగా నిర్మిస్తున్న అంబేద్కర్‌ మహానీయుని విగ్రహం యావద్దేశానిఇక గర్వకారణంగా నిలవబోతున్నది. ఈ ఏడాది మార్చి నాటికి విగ్రహం పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.

* కాలంతో పోటీ పడుతూ కొత్త సచివాలయాన్ని నిర్మించాం. తెలంగాణ అస్తిత్వాన్ని సమున్నతంగా చాటే విధంగా నిర్మితమైన సెక్రటేరియట్‌ భవనానికి ప్రభుత్వం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టడంతో దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. అధునాతన వసతులతో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో 7 అంతస్తుల సచివాలయ భవనం నిర్మాణం పూర్తయింది. ఈ సచివాలయాన్ని ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నాం. రాష్ట్రానికే గర్వకారణమైన సెక్రటేరియట్‌ భవనాన్ని కాలంతో పోటీ పడుతూ వేగంగా నిర్మింపజేసిన అధికారులకు, ఇంజినీర్లకు, కార్మికులకు అభినందనలు.

మరో 11 కలెక్టరేట్ల పనులు తుది దశలో..

*రూ. 1,581 కోట్ల 29 జిల్లాల్లో కలెక్టరేట్లు..రాష్ట్ర ప్రభుత్వం 29 జిల్లాల్లో రూ. 1581 కోట్లతో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టింది. వీటిలో 17 భవనాలను ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మరో 11 కలెక్టరేట్ల పనులు తుది దశలో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కలెక్టరేట్‌ భవనాలు కొన్ని రాష్ట్రాల సచివాలయ భవనాలకన్నా మిన్నగా ఉన్నాయని పలువురు ప్రముఖులు ప్రశంసించారు.

*పూర్తయిన 350 వంతెనల నిర్మాణం..తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో రహదారులు, భవనాల శాఖ పరిధిలో 24,245 కిలోమీటర్ల రోడ్లు మాత్రమే ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.2,727 కోట్లతో 1875 కిలోమీటర్ల మేర డబుల్ రోడ్ల నిర్మాణాన్ని కొత్తగా చేపట్టింది. వీటిలో 1684 కిలోమీటర్ల రోడ్లు పూర్తయ్యాయి. రూ. 3,134 కోట్ల ఖర్చుతో 717 వంతెనల నిర్మాణం చేపట్టగా వాటిలో 350 వంతెనల నిర్మాణం పూర్తయింది.

*ప్రతిష్టాత్మకంగా బుద్ధవనం నిర్మాణం. ప్రాచీన కాలం నుంచీ తెలంగాణ బౌద్ధ, జైన మతాలకు కేంద్రంగా విలసిల్లింది. ఆచార్య నాగార్జునుడు నడయాడిన నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం బుద్ధవనాన్ని అద్భుతంగా నిర్మించింది. 274 ఎకరాల విస్తీర్ణంలో బుద్ధవనం ప్రాజెక్టును రూ.71 కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అనేక ఆకర్షణలతో ప్రత్యేకతలను సంతరించుకొన్న ఈ ప్రాజెక్టు.. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధులను.. ఇతర పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నది.

*అభివృద్ధి పథంలో తెలంగాణ వెళుతోంది. 2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయం వృద్ధి రేటు 11.8 శాతం నమోదు చేసి రికార్డు సృష్టించింది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్‌ నివేదికలో పేర్కొన్నది. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ప్రతి సంవత్సరం రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు, దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువ నమోదు అవుతుంది.

*2014-15 సంవత్సరంలో దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.1 శాతం ఉండగా, 2020-21 నాటికి 4.9 శాతానికి పెరిగింది. దేశ జనాభాలో కేవలం 2.9 శాతం మాత్రమే తెలంగాణలో ఉండగా.. దేశ జీడీపీలో తెలంగాణ భాగస్వామ్యం 4.9 శాతానికి కావడం మనందరికీ గర్వకారణం. దేశంలోని 18 ప్రధాన రాష్ట్రాలతో పోల్చితే.. తెలంగాణ మెరుగైన వృద్ధి రేటు సాధిస్తున్నది. 2015-16 నుంచి 2021-22 వరకు 12.6 శాతానికి జీఎస్డీపీ సగటు వార్షిక వృద్ధి రేటుతో తెలంగాణ 3వ స్థానంలో ఉంది.

* వివిధ కేటాయింపులు

ఆరోగ్య శ్రీ, ఈహెచ్‌ఎస్‌ కోసం రూ.1,463 కోట్లు
ఫారెస్ట్‌ కాలేజీకి రూ. 100 కోట్లు
కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ రూ. 200 కోట్లు
ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌నాన్‌వెజ్‌ మార్కెట్లకు రూ. 400 కోట్లు
ఆలయాల కోసం రూ. 250 కోట్లు
మిషన్‌ భగీరథకు రూ. 600 కోట్లు
మిషన్ భగీరథ అర్భన్‌ రూ. 900 కోట్లు
వడ్డీ లేని రుణాల కోసం రూ. 1500 కోట్లు
ఎప్లాయిమెంట్‌ హెల్త్‌ స్కీమ్‌ కోసం రూ. 362 కోట్లు
ఆరోగ్య శ్రీ కోసం రూ. 1,101 కోట్లు

కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌ కోసం రూ. 750 కోట్లు
కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌ కోసం రూ. 750 కోట్లు
సుంకేశుల ఇన్‌టెక్‌ ప్రాజెక్టు కోసం రూ. 725 కోట్లు
యాదాద్రి డెవలప్‌మెంట్‌ అథారిటీ కోసం రూ. 200 కోట్లు
ఎస్సీ సంక్షేమ శాఖకు రూ. 21,022 కోట్లు
ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి రూ. 1500 కోట్లు
మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి రూ. 200 కోట్లు
మహిళా వర్సిటీకి రూ. 100 కోట్లు

పల్లె ప్రగతి, పంచాయతీరాజ్‌ శాఖకు భారీగా నిధులు
పల్లె ప్రగతి, పంచాయతీ రాజ్‌ శాఖకు రూ. 31,426 కోట్లు
ఓల్డ్ సిటీ మెట్రో రైలు కనెక్టివిటీ కోసం రూ. 500 కోట్లు
యూనివర్సిటీల అభివృద్ధికి రూ. 500 కోట్లు
స్పషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌కు రూ.10,348 కోట్లు
మెట్రో రైల్‌ ప్రాజెక్టు కోసం రూ. 1500 కోట్లు

దళిత బంధుకు రూ.17,700 కోట్లు

కొత్తగా నియమించే ఉద్యోగుల జీతభత్యాలకు రూ. 1000 కోట్లు
జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 100 కోట్ల కార్పస్‌ ఫండ్‌
ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ. 3,117 కోట్లు
దళిత బంధుకు రూ.17,700 కోట్లు
ఎయిర్‌పోర్టు మెట్రో కనెక్టివిటీ కోసం రూ. 500 కోట్లు
ఆసరా పెన్షన్ల కోసం రూ.12,000 కోట్లు
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకానికి రూ. 3,210 కోట్లు
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకానికి రూ. 3,210 కోట్లు

ప్రణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు
ఐటీ కమ్యూనికేషన్ల శాఖకు రూ. 366 కోట్లు
న్యాయ శాఖకు రూ. 1,665 కోట్లు
ఉన్నత విద్యా శాఖకు రూ. 3,001 కోట్లు

డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ప‌థ‌కానికి రూ. 12,000 కోట్లు
డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ప‌థ‌కానికి రూ. 12,000 కోట్లు
ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి రూ. 1463 కోట్లు..
ప్ర‌ణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు
ఐటీ, క‌మ్యూనికేష‌న్ల శాఖ‌కు రూ. 366 కోట్లు

కేసీఆర్ న్యూట్రిష‌న్ కిట్ ప‌థ‌కానికి రూ. 200 కోట్లు
కేసీఆర్ న్యూట్రిష‌న్ కిట్ ప‌థ‌కానికి రూ. 200 కోట్లు
ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మానికి రూ. 4,834 కోట్లు

రుణ‌మాఫీ ప‌థ‌కానికి రూ. 6,385 కోట్లు..
రుణ‌మాఫీ ప‌థ‌కానికి రూ. 6,385 కోట్లు..
రైతుబందు ప‌థ‌కానికి రూ. 1575 కోట్లు
రైతుబీమా ప‌థ‌కానికి రూ. 1589 కోట్లు

హోంశాఖ‌కు రూ. 9,599 కోట్లు
హోంశాఖ‌కు రూ. 9,599 కోట్లు

ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు రూ. 4,037 కోట్లు

పుర‌పాల‌క శాఖ‌కు రూ. 11,372 కోట్లు
రోడ్లు భ‌వ‌నాల శాఖ‌కు రూ. 2,500 కోట్లు

ఆయిల్ పామ్‌కు అధిక ప్రాధాన్యం..
ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌కు రూ. 3,117 కోట్లు
ఆయిల్ ఫామ్‌కు రూ. 1000 కోట్లు
అట‌వీ శాఖ కోసం రూ. 1,471 కోట్లు
పంచాయ‌తీ రాజ్‌కు రూ. 31,426 కోట్లు
హ‌రిత‌హారం ప‌థ‌కానికి రూ. 1471 కోట్లు

విద్య‌, వైద్య రంగాల‌కు అత్య‌ధిక ప్రాధాన్యం..

విద్య రంగానికి రూ. 19,093 కోట్లు
వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు..

సంక్షేమానికి భారీగా నిధులు

ఆస‌రా పెన్ష‌న్ల కోసం రూ. 12 వేల కోట్లుక‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కాల‌కు రూ. 3,210 కోట్లు
ద‌ళిత‌బంధు కోసం రూ. 17,700 కోట్లు
బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు
మ‌హిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు.
ఎస్సీ ప్ర‌త్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
గిరిజ‌న సంక్షేమం, ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధికి రూ. 15,223 కోట్లు

వ్య‌వ‌సాయానికి, నీటిపారుద‌ల శాఖ‌కు భారీగా కేటాయింపులు

వ్య‌వ‌సాయానికి కేటాయింపులు రూ. 26,831 కోట్లు.

నీటిపారుద‌ల శాఖ‌కు రూ. 26,885 కోట్లు.

విద్యుత్ కేటాయింపులు రూ. 12,727 కోట్లు.