Kavitha’s Arrest: కవిత అరెస్ట్ చుట్టూ ఢిల్లీ రాజకీయం! మోడీ పై విపక్షాల లేఖాస్త్రం

ఢిల్లీ మద్యం స్కామ్ లో తరువాత అరెస్ట్ ఎవరు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఆ కేసు గురించి ఏమాత్రం అవగాహన ఉన్న వాళ్ళైన తెలంగాణ సీఎం కుమార్తె కవిత అరెస్ట్

  • Written By:
  • Publish Date - March 5, 2023 / 03:30 PM IST

ఢిల్లీ మద్యం స్కామ్ లో తరువాత అరెస్ట్ ఎవరు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఆ కేసు గురించి ఏమాత్రం అవగాహన ఉన్న వాళ్ళైన తెలంగాణ సీఎం కుమార్తె కవిత అరెస్ట్ (Kavitha’s Arrest) అవుతారని చెబుతారు. కానీ సీబీఐ మాత్రం ఆచితూచి అడుగు వేస్తుంది. పలు రకాల ఆధారాలను సేకరించిన సీబీఐ ఇప్పటికే ఒకసారి ఆమెను విచారించింది. సౌత్ డీల్ ఆమె ద్వారా జరిగినట్టు గుర్తించింది. మూడు నెలల కాలంలో ఎన్ని మొబైల్స్ మార్చిందో తెలుసుకుంది. మనీ లాండరింగ్ ఎలా జరిగింది ? అని నిరూపించడానికి సీబీఐ ప్రయత్నిస్తుంది. ఆ దిశగా ఇప్పటికే లేగర్ సినిమా నిధుల గురించి ఆరా తీసింది. కవిత ఢిల్లీ స్కాం ప్రమేయంపై ఫైల్ తయారు అయింది. అయితే ఆమెను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేది ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తరువాత కవిత అరెస్ట్ (Kavitha’s Arrest) అంటూ హస్తిన టాక్. ఆ లోపు ఆమె అరెస్ట్ ను వీలున్నంత రాజకీయ కోణం నుంచి తీసుకెళ్లడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఢిల్లీ వేదికగా తెలంగాణ కోసం ధర్నాకు కవిత సిద్ధం అవుతున్నారు. మరో వైపు సమాంతరంగా తెలంగాణ గ్రామాల వరకు మోడీ వ్యతిరేక ధర్నాలకు పిలుపు ఇవ్వడం గమనార్హం.

ఈ నెల 9న కేంద్ర హోమ్ మంత్రి, బీజేపీ కింగ్ పిన్ అమిత్ షా వస్తున్నారు. ఆయన ఇక నుంచి తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెడతారని బీజేపీ చెబుతుంది. అంటే ఇక తెలంగాణ రాజకీయం కవిత అరెస్ట్ (Kavitha’s Arrest) నుంచి మరింత వేడి ఎక్కనుంది. ఆ లోపు కేసీఆర్ కూడా జాతీయ స్థాయిలో లౌకిక పార్టీలను కలుపుకొని పోవడానికి పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద విపక్ష పార్టీలు ప్రధాని మోదికి లేకాస్త్రాన్ని ఆదివారం సంధించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ నేత సిసోడియాకు మద్దతుగా నిలిచాయి. మోడీకి ఘాటు లేఖ రాశాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి దేశంలోని సీఎంలు విపక్ష నేతలు కలిసి లేఖ రాశారు. సీఎంలు కే చంద్రశేఖర్ రావు మమతా బెనర్జీ భగవంత్ మాన్ అరవింద్ కేజ్రీవాల్ సహా ప్రతిపక్ష నేతలు సంతకం చేసిన లేఖలో మోడీ సర్కార్ తీరును తూర్పారపట్టాయి. ఈ లేఖకు కాంగ్రెస్ దూరంగా ఉంది. అధినేత శరద్ పవార్ సేనకు చెందిన ఉద్దవ్ ఠాక్రే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తదితరులు ఈ లేఖపై సంతకం చేశారు.

నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను నడుపుతున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ను యంగ్ ఇండియన్ టేకోవర్ చేయడంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ ఆరోపణలపై గాంధీజీలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తోంది. గత ఏడాది రాహుల్ గాంధీని ఆయన తల్లి సోనియా గాంధీని ఇడి ప్రశ్నించింది. “భారతదేశం ఇప్పటికీ ప్రజాస్వామ్య దేశమని మీరు అంగీకరిస్తారని మేము ఆశిస్తున్నాము. ప్రతిపక్ష సభ్యులపై కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం మనం ప్రజాస్వామ్యం నుండి నిరంకుశంగా మారినట్లు సూచిస్తోంది” అని లేఖలో పేర్కొన్నారు.

” మనీష్ సిసోడియాపై ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమాలకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఆయనను అరెస్టు చేసింది” అని ప్రతిపక్ష నాయకులు పిఎం మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. “2014 నుండి మీ పరిపాలనలో ఉన్న దర్యాప్తు సంస్థలతో బుక్ చేయబడిన అరెస్టు చేయబడిన దాడి చేయబడిన లేదా విచారించిన మొత్తం కీలక రాజకీయ నాయకులలో గరిష్టంగా ప్రతిపక్షాలకు చెందినవి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బిజెపిలో చేరిన ప్రతిపక్ష రాజకీయ నాయకులపై కేసులపై దర్యాప్తు సంస్థలు నెమ్మదిగా సాగుతున్నాయి.” అని లేఖలో పేర్కొన్నారు.

కాంగ్రెస్లో ఉన్నప్పుడు శారదా చిట్ఫండ్ స్కామ్పై 2014 మరియు 2015లో సీబీఐ మరియు ఈడీ స్కానర్లో ఉన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బీజేపీలో చేరగానే సీఎం అయిపోయారు. ఆయనపై కేసులన్నీ ఆగిపోయాయని ఈ ఉదాహరణను ప్రతిపక్ష నాయకులు ఉదహరించారు.

“ఈ శర్మ బిజెపిలో చేరిన తర్వాత కేసు పురోగతి సాధించలేదు. అదేవిధంగా మాజీ టిఎంసి తృణమూల్ కాంగ్రెస్ నాయకులు సువేందు అధికారి ముకుల్ రాయ్ నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో ఇడి మరియు సిబిఐ స్కానర్లో ఉన్నారు అయితే కేసులు రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వారు బిజెపిలో చేరిన తర్వాత వారు ముందుకు సాగలేదు” అని లేఖలో ఆరోపించారు.

“2014 నుండి దాడులు నిర్వహించడం ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేయడం.. అరెస్టు చేయడం వంటివి గణనీయంగా పెరిగాయి. లాలూ ప్రసాద్ యాదవ్ (రాష్ట్రీయ జనతాదళ్) సంజయ్ రౌత్ (శివసేన) ఆజం ఖాన్ (సమాజ్వాదీ పార్టీ) ) నవాబ్ మాలిక్ అనిల్ దేశ్ముఖ్ (ఎన్సీపీ) అభిషేక్ బెనర్జీ (టీ యమ్ సీ) కేంద్ర ఏజెన్సీలు తరచుగా కేంద్రంలోని పాలక వ్యవస్థకు విస్తృత విభాగాలుగా పనిచేస్తున్నారనే అనుమానాన్ని రేకెత్తిస్తాయి. అరెస్టులు ఎన్నికల సమయంలో జరిగాయి అవి రాజకీయ ప్రేరేపితమని స్పష్టంగా తెలియజేస్తున్నాయి” అని ప్రతిపక్ష నాయకులు లేఖలో పేర్కొన్నారు.

ఢిల్లీకి మద్యం పాలసీని రూపొందించడంలో అవినీతి ఆరోపణలపై సిసోడియాను అరెస్టు చేశారు. దీంతోనే ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. తప్పుడు ఆరోపణలతో వ్యక్తులను అరెస్టు చేయకూడదని.. వారి రాజకీయ నేపథ్యంతో సంబంధం లేకుండా సమగ్ర విచారణ తర్వాత దోషులుగా తేలితే మాత్రమే వదిలివేస్తామని కేంద్ర సంస్థలు సంవత్సరాలుగా ఈ కక్షసాధింపులు ప్రతిపక్ష నేతలపై కొనసాగిస్తున్నాయి. ఈ ఆరోపణలు చేస్తూ రాసిన లేఖ రాబోయే రోజుల్లో విపక్షాలను ఏకం చేస్తాయని అధికార పక్షం భావిస్తుంది. అందుకే చట్టం తన పని తాను చేసుకు పోతుందని బీజేపీ చెబుతూ కవిత అరెస్ట్ ఖాయమని సంకేతాలు ఇస్తుంది. కవిత అరెస్ట్ పై ఇప్పటికే బీజేపీ తెలంగాణ చీఫ్ బండి, మాజీ ఎంపీ వివేక్, ఎంపీ అరవింద్ కుమార్ తదితరులు ప్రతిరోజు ఏదో ఒక సందర్భం లో చెబుతున్నారు. అంటే , బీజేపీ ఢిల్లీ పెద్దలు చాలా వ్యూహం ప్రకారం కవిత అరెస్ట్ విషయంలో ముందడుగు వేస్తున్నారని అర్థం అవుతుంది.

Also Read:  Chandrababu: ఈ చిన్న లాజిక్ గమనిస్తే చంద్రబాబే సీఎం