Chadarghat Fire:చాదర్ ఘాట్ అగ్ని ప్రమాదంలో కుట్రకోణం

నూతన సంవత్సరం జోష్ తో ప్రపంచమంతగా తెల్లారితే నూతన సంవత్సరం సాక్షిగా హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ లోని నలభై కుటుంబాలు తమ అస్థిత్వాన్నే కోల్పోయారు.

నూతన సంవత్సరం జోష్ తో ప్రపంచమంతగా తెల్లారితే నూతన సంవత్సరం సాక్షిగా హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ లోని నలభై కుటుంబాలు తమ అస్థిత్వాన్నే కోల్పోయారు.

హైదరాబాద్‌ చాదర్ ఘాట్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 40 పూరి గుడిసెలు కాలి బూడిదయ్యాయి. అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూసీ నది ఒడ్డున సాయిబాబా ఆలయానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ప్రాణనష్టం ఏమీ లేకపోయినా భారీగా ఆస్తి నష్టం జరిగింది.

40గుడిసెలు పూర్తిగా దగ్దమై ఎలాంటి ఆనవాళ్లు లేకుండా అయ్యింది. బుట్టలమ్ముకొని బ్రతికే ఆ కుటుంబాలకు కట్టుబట్టలు తప్పా ఏమీ లేకుండా పోయింది. కాలిపోయిన తమ ఇళ్లలోనే తాము అమ్ముకోవడానికి పెట్టుకున్న బుట్టలు, డబ్బులు, బట్టలు, వస్తువులు, వంట పాత్రలు, వంట సామాగ్రి, పిల్లల పుస్తకాలు ఇలా అన్ని కాలిపోయి రోడ్లపైకి వచ్చారు. చివరికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇలా ప్రభుత్వం ఇచ్చిన ఎలాంటి గుర్తింపు లేకుండా ఉత్త చేతులతో మిగిలారు.

ఈ అగ్నిప్రమాదంలో కుట్ర ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. తమని ఆ స్థలం వదిలిపెట్టమని రాజకీయ నాయకులు, అధికారులు ఒత్తిడి చేశారని అయినా వెనక్కి తగ్గకపోవడంతో కావాలనే ఇలా చేశారని ప్రతి ఇంట్లో దాదాపు 5 నుండి పది లక్షల ఆస్తినష్టం జరిగిందని బాధితులు తమ బాధను వ్యక్తం చేసారు.

ఇక్కడున్న నలభై కుటుంబాలకు వేరే ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇచ్చామని, అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నారని ప్రభుత్వం చెబుతోంది.

గత అరవై ఏండ్లుగా తమ పూర్వీకుల నుండి ఇక్కడే ఉంటున్నారని, ఇక్కడ మార్కెట్ కి దగ్గర ఉంటుందని బాధితులు చెప్తున్నారు. ఇక్కడి నుండి దూరంగా వెళ్ళమంటున్నారని అక్కడ కనీస వసతులు లేవని, ఇక్కడి నుండి ఖాళీ చేయించడానికి తమని ఎంతో ఇబ్బంది పెట్టారని, ఇప్పుడైతే సర్వం కోల్పోయి ఇక్కడి నుండి కదలడానికి కూడా నిస్సహాయంగా ఉన్నామని, ప్రభుత్వం ఇక్కడే షెటర్స్ వేసి తమని ఆదుకోవాలని బాధితులు చెప్తున్నారు.

మూసీ చుట్టూరా ఉన్న ఇలాంటి గుడిసెలను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకోవాలనే ప్రయత్నం చేస్తోందని, అందుకే కావాలని కుట్రలు చేస్తోందని హక్కుల సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద సంఘటన జరిగి నలభై కుటుంబాలు సర్వం కోల్పోతే కనీసం భరోసా ఇవ్వడానికి అధికారులు, నాయకులు ఒక్కరు రాకపోవడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు.

బాధితులు తినడానికి, కట్టుకోవడానికి ఏమీ లేకుండా దిక్కుతోచక ఉన్న బాధితులకు చుట్టుపక్కలవాళ్ళు ఆహారం, బట్టలు తెచ్చిస్తున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మాత్రం బాధ్యతారాహిత్యంగా ఉంది.

&nbsp