CBN in surveillance : చంద్ర‌బాబు స‌భ‌ల‌పై ఢిల్లీ నిఘా నేత్రం!

నిజామాబాద్ బ‌హిరంగ స‌భ‌కు టీటీడీపీ సిద్ధమ‌వుతోంది.

  • Written By:
  • Updated On - December 30, 2022 / 04:10 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని ఖ‌మ్మం స‌భ ప్ర‌కంప‌న ఇంకా త‌గ్గ‌క‌ముందే నిజామాబాద్ బ‌హిరంగ స‌భ‌కు (CBN in surveillance) టీటీడీపీ సిద్ధమ‌వుతోంది. జ‌న‌వ‌రి మూడో వారంలో రోడ్ షో(Road Show), స‌భ‌ను నిర్వ‌హించాల‌ని ప్రాథ‌మికంగా నిర్ణ‌యించార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే కేంద్ర నిఘా వర్గాలు(CBN in surveillance) చంద్ర‌బాబు స‌భ‌ల మీద దృష్టి పెట్టాయి. ఖ‌మ్మం స‌భ‌తో పాటుగా ఏపీలోని నెల్లూరు జిల్లా కందుకూరు స‌భ‌లో జ‌రిగిన తొక్కిస‌లాట జాతీయ మీడియాకు ఎక్కింది. ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు కూడా ఆరా తీస్తున్నార‌ని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోవు ఎన్నిక‌ల మీద చంద్ర‌బాబు స‌భ‌ల ప్ర‌భావం ఎంత ఉంటుంద‌నే అంశంపై క‌మ‌ల‌నాథులు అధ్య‌యనం చేస్తున్నారని ఢిల్లీ వ‌ర్గాల స‌మాచారం.

 చంద్ర‌బాబు స‌భ‌ల మీద కేంద్ర నిఘా(surveillance)

నెల్లూరు జిల్లా కందుకూరులో జ‌రిగిన చంద్ర‌బాబు స‌భకు జ‌నం అనూహ్యంగా హాజ‌ర‌య్యారు. దీంతో తొక్కిస‌లాట జ‌రిగిన ఎనిమిది మంది మృతి చెందిన విష‌యం విదిత‌మే. వాళ్ల కుటుంబీకుల‌కు తెలుగుదేశం పార్టీ వివిధ రూపాల్లో 15ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం ప్ర‌క‌టించింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వేర్వేరుగా 2ల‌క్ష‌ల స‌హాయాన్ని ప్ర‌క‌టించాయి. ఇక టీడీపీ ఎన్నారై సెల్ ల‌క్ష రూపాయల‌ను తాజాగా ప్ర‌క‌టించింది. మొత్తంగా ఒక్కో కుటుంబానికి రూ. 23 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆర్థిక స‌హాయం అంద‌నుంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా సంఘ‌ట‌న‌పై దిగ్భ్రాంతిని వ్య‌క్త‌ప‌రిచారు. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కందుకూరు ఘ‌ట‌న‌పై శుక్ర‌వారం సీరియ‌స్ అయ్యారు. పోలీసులు అధికారుల‌పై ఫైర్ అయ్యార‌ని తెలుస్తోంది. ఇదంతా సంఘ‌ట‌న జ‌రిగిన త‌రువాత జ‌రిగే అధికారిక ప్ర‌క్రియ‌కాగా, రాజ‌కీయంగా కందుకూరు ఇష్యూను తీసుకెళ్ల‌డానికి వైసీపీ ప్ర‌య‌త్నం చేసింది.

Also Read : Nellore CBN : వైసీపీ అడ్డాలోకి చంద్ర‌బాబు! హాట్‌గా `ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..` !

జ‌నం పెద్ద‌గా రాక‌పోయిన‌ప్ప‌టికీ వ‌చ్చిన‌ట్టు చూపించ‌డానికి ఇరుకు రోడ్ల‌లో చంద్ర‌బాబు రోడ్ షో (Road show) ల‌ను పెడుతున్నార‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. అంతేకాదు, చంద్ర‌బాబు ప‌బ్లిసిటీ పిచ్చకు ఎనిమిది మంది బ‌ల‌య్యార‌ని మంత్రి కాకాని గోవ‌ర్థ‌న్ రెడ్డి ఆరోపించారు. రాజ‌కీయ కోణంలో కందుకూరు సంఘ‌ట‌న‌ను తీసుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నిస్తోన్న త‌రుణంలోనే 24 గంట‌ల‌కు గ‌డ‌వ‌క‌ముందే కావ‌లిలో చంద్ర‌బాబు(Road show) స‌భ జ‌రిగింది. ఆ స‌భ‌లోనూ జ‌న‌సందోహం క‌నిపించింది. ప‌క్క‌నే జ‌రిగిన కందుకూరు అప‌శృతిని ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా కావ‌లి స‌భ‌కు జ‌నం విర‌గ‌బ‌డి వ‌చ్చారు. `ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..` ప్రోగ్రామ్ మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి ఎక్క‌డ‌కు వెళ్లి చంద్ర‌బాబు స‌భ‌లు పెట్టిన‌ప్ప‌టికీ స్వ‌చ్చంధంగా జ‌నం వ‌స్తున్నార‌ని టీడీపీ భావిస్తోంది. తెలంగాణ‌, రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర నుంచి నెల్లూరు వ‌ర‌కు స‌భ‌ల‌కు హాజ‌ర‌వుతున్న యువ‌త ఉత్సాహంగా క‌నిపిస్తోంది.

స‌భ‌ల మీద జాతీయ మీడియా (CBN in surveillance)

గ‌త రెండు నెల‌లుగా చంద్ర‌బాబు నిర్వ‌హించిన స‌భ‌ల మీద జాతీయ మీడియా క‌న్నేసింది. కేంద్ర నిఘా వ‌ర్గాలు కూడా ఆయా స‌భ‌ల గురించి ఆరా తీస్తున్నారు. రోడ్ షోలు, బ‌హిరంగ స‌భ‌లు జ‌రిగిన తీరును అధ్య‌య‌నం చేస్తున్నారు. జ‌నం స్వ‌చ్చంధంగా వ‌స్తున్నారా? త‌ర‌లిస్తున్నారా? జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంపై విసుగెత్తారా? అనే అంశాల‌పై నివేదిక‌ను త‌యారు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇక జాతీయ మీడియా కూడా రంగంలోకి దిగ‌డంతో రాజ‌కీయ పొత్తుల అంశం తెర మీద‌కు వ‌స్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవ‌డం ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ల‌క్ష్యాన్ని చేరుకోవాల‌ని ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల ఆలోచ‌న‌గా ఉంద‌ని తెలుస్తోంది. అయితే, క‌మ‌ల‌నాథుల మ‌ధ్య భిన్నాభిప్రాయాలు ఉండ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు పొత్తు అంశంపై క్లారిటీ రాలేదు. కానీ, ఇప్పుడు చంద్ర‌బాబు స‌భ‌లు ఏపీతో పాటు తెలంగాణాలోనూ సూపర్ హిట్ కావ‌డంతో ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు చంద్ర‌బాబు వైపు చూస్తున్నార‌ని తెలుస్తోంది.

Also Read : Nellore Postmortem : చంద్ర‌బాబు స‌భపై పోస్ట్ మార్టం! తొక్కిసలాటపై రాజ‌కీయం!!

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే బీజేపీకి అనివార్యంగా టీడీపీ మ‌ద్ధ‌తు అవ‌స‌రం. ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా బ‌ల‌హీనంగా ఉన్న బీజేపీ బ‌ల‌ప‌డాలంటే మ‌రో మార్గం క‌మ‌ల‌నాథులకు క‌నిపించ‌డంలేదు. ఉత్త‌ర తెలంగాణ‌లో బీజేపీ బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ టీడీపీ సీరియ‌స్ గా రంగంలోకి దిగితే ఓట్ల‌ను చీల్చుకునే అవ‌కాశం ఉంది. పైగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల ఓట్ల‌ను భారీగా టీడీపీ లాగేసుకునే ఛాన్స్ లేక‌పోలేదు. దీంతో బీసీ ఓట‌ర్ల‌ను బీజేపీ కోల్పోవాల్సి వ‌స్తుంది. ఇలాంటి ఈక్వేష‌న్ల న‌డుస్తున్న త‌రుణంలో నిజామాబాద్ స‌భ నిర్వ‌హించ‌డానికి టీడీపీ ప్లాన్ చేస్తోంది. అక్క‌డి బోధ‌న్, నిజామాబాద్ త‌దిత‌ర ప్రాంతాల్లో టీడీపీ ప‌ట్టు ఉంది. పైగా మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు లాంటి వాళ్లు తిరిగి టీడీపీలో చేర‌డానికి రంగం సిద్దం చేసుకుంటున్నార‌ని వినికిడి. ఖ‌మ్మం త‌ర‌హాలో నిజామాబాద్ స‌భ కూడా విజ‌య‌వంతమైతే, బీజేపీ ఓటు బ్యాంకుకు భారీ గండిప‌డిన‌ట్టే.!

Also Read : Chandrababu Naidu: మైనార్టీల వైపు చంద్రబాబు!