BRS Posters: గోవా విమోచన దినోత్సవానికి 300 కోట్లు.. తెలంగాణకు జీరో

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఘనంగా జరపాలని భావిస్తుంది.

BRS Posters: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఘనంగా జరపాలని భావిస్తుంది. అందులో భాగంగానే హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో భారీ ఏర్పాట్లు చేశారు. కేంద్రం మంత్రి అమిత్ షా ఈ వేడుకలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వినూత్న దాడికి దిగింది.

హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా వెలసిన పోస్టర్లు రాజకీయ అలజడి సృష్టించాయి. గోవా విమోచన దినోత్సవానికి మోదీ సర్కార్ 300 కోట్లు వెచ్చించింది. అయితే తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం ఉత్సవానికి మాత్రం రూపాయి కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ పోస్టర్లో పేర్కొంది. ఆదివారం జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి అమిత్ షా హాజరు కానున్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఈ పోస్టర్లు కలకలం రేపాయి. ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణకు నిధులు విడుదల చేయని కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నగర పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పోస్టర్లు ఏర్పాటు చేసింది.

సెప్టెంబరు 17 1948న హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్‌లో విలీనం చేశారు. ఈ క్రమంలో కేంద్రం వేడుకల్ని రెండో ఏడాది అధికారికంగా నిర్వహిస్తుంది. కాగా బిఆర్ఎస్ మరియు ఇతర పార్టీలు జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. కానీ బీజేపీ మాత్రం దీనిని తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుతుంది.

Also Read: Janasena Meeting: పవర్ షేరింగ్ ముచ్చట తరువాత.. ముందు జగన్ ని ఓడించాలి