తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా బిజెపి (BJP)ని అధికారంలోకి తీసుకరావాలని మొదటి నుండి మోడీ ట్రై చేస్తూనే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే బయట రాష్ట్రాల్లో బిజెపి కి మంచి పట్టు ఉంది..కొన్ని రాష్ట్రాల్లో అధికారం చేపట్టారు..మరికొన్ని చోట్ల అధికపార్టీ కి ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బిజెపిని పెద్దగా ప్రజలు పట్టించుకోవడం లేదు. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో కాషాయం జెండా ఎగురవేయాలని బిజెపి అధిష్టానం చూస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఫై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
తెలంగాణ ఉద్యమంతో ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చి..సీఎం అయినా కేసీఆర్ (CM KCR)..గత రెండు సార్లు తెలంగాణ లో విజయకేతనం ఎగురవేసి..ఇప్పుడు మూడోసారి అధికారం చెప్పట్టాలని చూస్తున్నారు. అదే విధంగా జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ట్రై చేస్తున్నాడు. ఇప్పటీకే టిఆర్ఎస్ ను కాస్త బిఆర్ఎస్ (BRS) గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈసారి తెలంగాణ లో విజయం సాధించి..జాతీయ స్థాయిలో పట్టు పెంచుకోవాలని చూస్తున్నారు. అయితే ఆ ఛాన్స్ కేసీఆర్ కు ఇవ్వకూడదని బిజెపి గట్టి ప్రయత్నాలే చేస్తుంది. తెలంగాణ బిజెపి నేతలకు (BJP Leaders) భారీ ఆఫర్లు అందజేస్తూ..పట్టును పెంచుకోవాలని చూస్తుంది. ఇప్పటీకే పలువురికి కీలక బాధ్యతలు అప్పగించడం చేసింది.
Read Also : Earth Creature Vs Life On Moon : చంద్రుడిపైనా బిందాస్ గా బతకగలిగే జీవి ఏదో తెలుసా ?
మరో మూడు , నాల్గు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో అధికారపార్టీ బిఆర్ఎస్ ముందుగానే తమ అభ్యర్థులను (BRS Candidates) ప్రకటించి ఎన్నికల ప్రచారం (Election Campaign) మొదలుపెట్టింది. బిఆర్‌ఎస్ అభ్యర్ధులకు ధీటుగా కాంగ్రెస్, బిజేపిలు సైతం అభ్యర్ధులని ప్రకటించే విషయంలో కాస్త ఆచితూచి అడుగులేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకునేవారు దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే. ఇటు బిజేపి సైతం తమకు పట్టున్న స్థానాల్లో బలమైన అభ్యర్ధులని నిలబెట్టేందుకు చూస్తుంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర విషయం రాజకీయా వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. బిజెపి సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ లను టార్గెట్ గా పెట్టుకుందనే వార్త వినిపిస్తుంది. అలాగే బిఆర్ఎస్ కీలక నేతలపై బిజెపి అగ్ర నేతలను బరిలోకి దించాలని చూస్తుందట. అందులో భాగంగా సీఎం కేసీఆర్ ఫై ఈటెల తో పాటు అరవింద్ లను బరిలోకి దించాలని , అటు కేటీఆర్ ఫై బండి సంజయ్ ని దింపాలనే ప్లాన్ లో ఉందట.
ఈసారి కేసీఆర్ గజ్వేల్ (KCR Gajwel) తో పాటు కామారెడ్డి (Kaamareddy) లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మొదట నుంచి గజ్వేల్ లో కేసిఆర్ పై తాను పోటీ చేస్తానని ఈటల రాజేందర్ (Etela Rajender) చెబుతూ వస్తున్నారు. దీంతో గజ్వేల్ లో ఈటలని బరిలో దింపి, కామారెడ్డిలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind)ని బరిలో దింపాలని బిజెపి అధిష్టానం చూస్తుందట. అటు సిరిసిల్లలో కేటిఆర్ (KTR) పై బండి సంజయ్ (Bandi Sanjay)ని పోటీకి దింపాలని భావిస్తోందట. అలాగే సిద్ధిపేటలో హరీష్ రావు (Harish Rao)పై బూర నర్సయ్య గౌడ్, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి పై కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ పై డీకే అరుణ పోటీ చేయనున్నారని వినికిడి. మరి నిజంగా వీరిని ఆలా దింపుతుందా..లేదా అనేది చూడాలి.