Nuclear Fusion : భూమిపై సూర్యుడి తరహా కేంద్రకం నిర్మాణం.. అణు విద్యుత్ ఉత్పత్తి ప్రయోగాల్లో భారత శాస్త్రవేత్త

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ముఖ్య ప్రయోగాల్లో భారత శాస్త్రవేత్తలు భాగం అవుతున్నారు. వాటిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - July 12, 2022 / 08:00 AM IST

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ముఖ్య ప్రయోగాల్లో భారత శాస్త్రవేత్తలు భాగం అవుతున్నారు. వాటిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచానికి వెలుగులు అందించి.. కాలుష్యాన్ని రూపుమాపే ఓ ప్రాజెక్టులో పాల్గొంటున్నారు ఇండియన్ సేజల్ షా. ఆమె గుజరాత్ లోని గాంధీనగర్ లో ఉన్న ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ సంస్థ లో పరిశోధకురాలిగా పనిచేస్తున్నారు. యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తున్న ఒక రీసెర్చ్ ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్య వివరాలు ఇవి..

సూర్యుడి కేంద్రకమే ఫోకస్..

ప్రపంచంలోనే విద్యుత్ ఉత్పత్తికి అత్యంత అనువైన ప్రదేశం ఏదో తెలుసా ? సూర్యుడి కేంద్రకం!! ఔను .. ఇది నిజం!! ఎందుకంటే.. సూర్యుడి కేంద్రకంలో ఉష్ణోగ్రత చాలా చాలా ఎక్కువ. అక్కడ దాదాపు కోటి 50 లక్షల డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత ఉంటుంది.
అదే తరహా వాతావరణాన్ని భూమిపై ఒక ల్యాబ్ లో క్రియేట్ చేసే దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఫ్రాన్స్ లోని సెయింట్ పాల్ లెజ్ డ్యూరాన్స్ దగ్గర ఇందుకోసం ఒక రియాక్టర్ నిర్మించారు. దాని పేరు.. ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పరిమెంటల్ రియాక్టర్ (ఐటీఈఆర్). దీని నిర్మాణానికి అయిన ఖర్చు రూ.1,75,909 కోట్లు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద న్యూక్లియర్ ఫ్యూషన్ (అణు విచ్చిత్తి ) ప్రాజెక్టు. వాస్తవానికి దీని నిర్మాణం ఇంకా మధ్య దశలోనే ఉంది. మరో మూడేళ్ళలో నిర్మాణ పనులు పూర్తవుతాయి.ఈ భారీ ప్రాజెక్టును భారత్, చైనా, అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా కలిసి చేపట్టాయి.నిర్మాణ ఖర్చును అన్ని దేశాలూ భరిస్తున్నాయి.

న్యూక్లియర్ ఫ్యూషన్ అంటే..

సూర్యుడి కేంద్రకం వద్ద ఉండే భారీ ఉష్ణోగ్రత వల్ల.. అక్కడ అప్పటికే ఉండే హైడ్రోజన్ గ్యాస్ దాని అణువుల్లోని ఎలక్ట్రాన్స్ ను కోల్పోతుంది. ఎలక్ట్రాన్స్ ను కోల్పోయి అయోనైజ్ అయిన హైడ్రోజన్ అనువులనే “ప్లాస్మా” అని పిలుస్తారు. హైడ్రోజన్ గ్యాస్ నుంచి విడిపోయిన ఎలక్ట్రాన్స్.. ప్లాస్మాను ఢీకొని హీలియం గ్యాస్ గా మారుతుంది. ఈ మొత్తం ప్రక్రియను న్యూక్లియర్ ఫ్యూషన్ అంటారు.

ఐటీఈఆర్ ప్రాజెక్టులో ఏం చేస్తారు ?

* ఐటీఈఆర్ ప్రాజెక్టులో భాగంగా థర్మో న్యూక్లియర్ ఎక్స్పరిమెంటల్ రియాక్టర్ ను ఉపయోగించి సూపర్ హాట్ ప్లాస్మా ను ఉత్పత్తి చేస్తారు. దీని ద్వారానే అణు విద్యుత్తు తయారవుతుంది.

* ప్లాస్మా అనేది పదార్థానికి నాలుగో రూపం. సూర్యుడిపై ఉండే పదార్థం ఈ ప్లాస్మానే. అది అత్యంత వేడిగా ఉంటుంది.

* అలాంటి ప్లాస్మాను ఉత్పత్తి చేయడానికి ఈ భారీ ప్రాజెక్టును చేపట్టారు.

* ప్రస్తుతం ఉన్న విధానాలతో కరెంటు ఉత్పత్తి వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతోంది. అదే న్యూక్లియర్ పవర్ అయితే… చాలా పరిశుభ్రమైనది.
* ప్రస్తుతం అణు విద్యుత్‌ను న్యూక్లియర్ ఫిష్షన్ ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. దీనికి పూర్తి విరుద్దమైనది అణువిచ్చిత్తి (న్యూక్లియర్ ఫ్యూషన్) విధానం.
* అణువిచ్చిత్తి విధానంలో తేలికపాటి మూలకాల్ని కలిపి… బరువైన మూలకాన్ని తయారుచేస్తారు. ఇందుకోసం అణువుల్ని కలుపుతారు. సూర్యుడిపై ఇదే జరుగుతోంది. అతి తక్కువ రేడియో ధార్మికతతో అత్యధిక విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

* అణు విచ్చిత్తి రియాక్షన్లను తట్టుకోవడానికి టోకమార్క్ అనే భారీ నిర్మాణం చేపడుతున్నారు.
* అణు సంలీనం అనేది వాణిజ్యపరంగా కలిసొస్తుందా లేదా అనే అంశాన్ని ఈ ప్రాజెక్టు ద్వారా తెలుసుకోనున్నారు. .