Sim Swapping : దడ పుట్టిస్తున్న సిమ్ స్వాపింగ్.. ముప్పు నుంచి భద్రత ఇలా!!

సైబర్ నేరాలు దడ పుట్టిస్తు న్నాయి.. సిమ్ స్వాపింగ్ తో కేటుగాళ్ళు హల్ చల్ చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ చేసేందుకు తెగబడుతున్నారు. ఇంతకీ సిమ్ స్వాపింగ్ అంటే ఏమిటి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అప్రమత్తంగా ఉందాం..

  • Written By:
  • Publish Date - July 14, 2022 / 07:00 PM IST

సైబర్ నేరాలు దడ పుట్టిస్తు న్నాయి.. సిమ్ స్వాపింగ్ తో కేటుగాళ్ళు హల్ చల్ చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ చేసేందుకు తెగబడుతున్నారు. ఇంతకీ సిమ్ స్వాపింగ్ అంటే ఏమిటి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అప్రమత్తంగా ఉందాం..

కొత్త సిమ్ తీసుకొని..

మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కోసం కొత్త SIM కార్డ్‌ని సైబర్ నేరగాడు పొందుతాడు.కొత్త SIM కార్డ్ సహాయంతో మీ బ్యాంక్ ఖాతా ద్వారా ఆర్థిక లావాదేవీలు చేయడానికి చేసే ప్రయత్నమే సిమ్ స్వాపింగ్. దీనివల్ల మీ మొబైల్‌ నంబర్‌కు వచ్చే అలర్ట్స్‌ మోసగాళ్లు తీసుకున్న మొబైల్‌ నంబర్‌కు చేరిపోతాయి. వ్యక్తి ఖాతా సంబంధిత అలర్ట్‌లు, వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP), యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్ (URN), 3D సెక్యూర్ కోడ్ మొదలైనవాటిని సైబర్ నేరగాళ్లే పొందుతారు. దీని వల్ల కేటుగాళ్లు మీ బ్యాంకు ఖాతాల వివరాలను తెలుసుకుని మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

జాగ్రత్తలు సుమా..

తొలుత మీ స్మార్ట్‌ఫోన్ నెట్‌వర్క్ కనెక్టివిటీ స్థితి గురించి తెలుసుకోండి. మీరు చాలా కాలంగా నుంచి ఎటువంటి కాల్ లేదా SMS నోటిఫికేషన్‌లను పొందడం లేదని భావిస్తే, అప్పుడు ఏదో తప్పు జరిగి ఉండొచ్చని అనుమానించాలి. వెంటనే మొబైల్ ఆపరేటర్‌ని సంప్రదించాలి. మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను ఎల్లప్పుడూ తనిఖీ చేయండి. ఎవరైనా , ఏవైనా లింక్‌లు పంపినా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వారు పంపిన లింక్‌లను ఎట్టి పరిస్థితులలో ఓపెన్‌ చేయవద్దు. ఎందుకంటే మీరు ఆ లింక్‌ను ఓపెన్‌ చేస్తే మీ వ్యక్తిగత వివరాలు వాళ్లకు తెలిసిపోతాయి.