Self-Driving Cars: వామ్మో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు.. వాహనదారుల బెంబేలు

నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే కార్లు అంటే జనానికి ఎంతో భయం. 

నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే కార్లు అంటే జనానికి ఎంతో భయం. ఇక డ్రైవరే ఉండని సెల్ఫ్ డ్రైవింగ్ (Self-Driving) కార్లంటే ఇంకా చాలా భయం. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఎప్పుడు ఎలా టర్నింగ్ తీసుకుంటాయో అర్ధం కాక అమెరికాలోని వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. అవి అదుపు తప్పితే.. ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో ఇప్పటికే టెస్లా కంపెనీ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. గూగుల్ కు చెందిన అనుబంధ కంపెనీ Waymo, జనరల్ మోటార్స్ కు చెందిన అనుబంధ కంపెనీ Cruise రెండు కూడా వేటికి అవిగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను (Self-Driving) తయారు చేశాయి. ఈ కంపెనీలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లతో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో సహా పలు నగరాల్లో ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. వీటిని చూసి జనం కొంత భయానికి గురవుతున్నారు. ఇంకా అవి టెస్టింగ్ మోడ్ లోనే ఉన్నందున ఎప్పుడు ఎలా నడుస్తాయో అనే ఆందోళన కూడా ఇతర వాహనదారుల్లో ఉంది.వోల్వో, నిస్సాన్, ఆడి మరియు ఇతర ఆటోమేకర్లు కూడా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై పనిచేస్తున్నాయి.

3.63 లక్షల కార్లు రీకాల్ చేసిన టెస్లా

టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అమెరికాలో ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలకు సంబంధించి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా టెస్లా కార్లవే ఉన్నాయి. ఈనేపథ్యంలో  గత నెలలో ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని టెస్లా కంపెనీ 3,63,000 సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను రీకాల్ చేసింది. ఎందుకంటే కొన్ని సెల్ఫ్ డ్రైవింగ్ టెస్లా కార్లు అకస్మాత్తుగా నిర్దిష్ట వేగానికి మించి దూసుకువెళ్తున్నాయి.

సెల్ఫ్ డ్రైవింగ్ (Self-Driving) కార్లపై సర్వే విశేషాలు

అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) విభాగం 2016 నుంచి జరిగిన 35 వేర్వేరు టెస్లా కార్ల ప్రమాదాలపై పరిశోధనలు చేసింది. ఆ యాక్సిడెంట్లలో 19 ప్రాణాంతకం అయినవని గుర్తించింది.ఇక ఇతర వాహనాలను నడిపే వారిని కూడా సర్వే చేశారు. దీంతో దాదాపు 70% మంది ప్రజలు సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలకు భయపడు తున్నారని తేలింది. గత ఏడాది కంటే ఇది 55% ఎక్కువని వెల్లడైంది.ప్రతి 10 మందిలో 1 వ్యక్తి వాహనాన్ని సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్‌లో ఉంచి నిద్రపోతారని సర్వే తేల్చింది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీ కంపెనీలు వాటిని మరింత ఖచ్చితత్వంతో మెరుగు పర్చాల్సిన అవసరం ఉందని వాహన రంగ నిపుణులు అంటున్నారు.

ఆటోపైలట్, ప్రో పైలట్, పైలట్ అసిస్ట్

  1. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో ఆటోపైలట్, ప్రో పైలట్, పైలట్ అసిస్ట్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. కారు డ్రైవర్ పర్యవేక్షణలోనే ఆటోపైలట్ ఆప్షన్ వాడుతారు.
  2. ఆటోపైలట్ కారు చాలా అడ్వాన్స్డ్. ఇందులో బ్రేక్, గేర్, స్టీర్, స్పీడ్ యాక్సిలరేషన్ ఇవన్నీ కారు కంట్రోల్ లోకి వెళ్లిపోతాయి. ప్రస్తుతానికి ఈ రకం కార్లను టెస్లా మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. అయితే ఈ కార్లలోనూ ఆటోపైలట్ సిస్టం పూర్తిగా అందుబాటులోకి రాలేదు. డ్రైవర్ పర్యవేక్షణలోనే
    ఆటోపైలటింగ్ ద్వారా కారు నడుస్తుంది.
  3. ప్రో పైలట్ ఆప్షన్ ను సింగిల్ లేన్ రూట్లలో కారు నడిపేటప్పుడు వాడొచ్చు.
  4. పైలట్ అసిస్ట్ అనే ఆప్షన్ కారు నడిపే వ్యక్తికి స్టీరింగ్ కు సంబంధించిన నావిగేషన్ ఇస్తుంది. ఎదుట ఉన్న కారు ఎంత దూరంలో ఉంది.. ఇంకా ఎంత సేపట్లో ఆ కారు దగ్గరికి చేరుకుంటారు అనే సమాచారాన్ని చూపించి అలర్ట్ చేస్తుంది.

Also Read:  Chetak: 2023 చేతక్ వచ్చేసింది. ప్రీమియం మోడల్ తో చేతక్ రేంజ్ అదుర్స్.