Cyber Security: మీ ఫోన్లో ఇటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ ఫోన్ ట్యాపింగ్ అయినట్టే?

రోజురోజుకీ టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో సైబర్ మోసాలు కూడా అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అమాయకమైన

  • Written By:
  • Publish Date - January 21, 2023 / 07:00 AM IST

రోజురోజుకీ టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో సైబర్ మోసాలు కూడా అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అమాయకమైన ప్రజలను మోసం చేస్తున్నారు. నిత్యం ఏదో ఒక ప్రదేశంలో సైబర్ నేరగాళ్ళ చేతిలో పడి మోసపోతూనే ఉన్నారు. టెక్నాలజీ కీ అనుగుణంగానే ఫైబర్ నేరగాళ్లు కూడా కొత్త కొత్త విధానాలను అమలుపరుస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. మరి ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అనే సమస్య ప్రస్తుత కాలంలో కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఒకరి మొబైల్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులు దొంగిలించి అక్రమ కార్యకలాపాలకు అనువుగా మలుచుకొని బ్యాంక్‌ అకౌంట్‌ రహస్య వివరాలను తెలుసుకొని అకౌంట్ లో డబ్బులను దొంగలిస్తున్నారు. అయితే వీటి నుంచి మనం బయట పడాలి అంటే కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సాధారణంగా మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అనవసరమైన శబ్దాలు వినిపించాయి అంటే మీ ఫోన్ ట్యాపింగ్‌ గురైందని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అలా సమస్యలు వస్తాయి. అలా కాకుండా ఫోన్ సైలెంట్ లో ఉన్నా కూడా అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది ట్యాపింగ్‌ అని అర్థం. ఈ సెన్సార్‌ను ట్యాపింగ్‌కు గురైన ఫోన్‌ దగ్గర పెట్టినట్లయితే అలారం మోగుతుంది. ఒకే నిమిషంలో ఎక్కువ సార్లు అలారం మోగినట్లయితే ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైందని నిర్ధారించుకోవచ్చు. అలాగే మన ఫోన్ లో మనకు తెలియకుండా మన ఫోన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో ట్యాపింగ్‌ సాఫ్ట్‌వేర్‌ రన్‌ అవుతుంటే బ్యాటరీ లైఫ్‌ భారీగా పడిపోతుంది. ఒకవేళ ఇలా జరుగుతుంటే దీనికి సరైన కారణాలు వెతుక్కోవాలి.

ఛార్జింగ్ సమయం, కాల్స్ సమయం, యాప్స్ వాడక, నెట్ బ్రౌజ్ లాంటి అంశాలను చెక్ చేసుకోవాలి. అలాగే ఫోన్ లో సెట్టింగ్స్‌,బ్యాటరీ సెట్టింగ్స్,బ్యాటరీ యూసేజ్ ఆప్షన్‌తో ఈ వివరాలు తెలుసుకోవచ్చు. లేదంటే బ్యాటరీ లైఫ్‌, కోకోనట్‌ బ్యాటరీ తదితర యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.‌ కొత్త ఫోన్ బ్యాటరీ సామర్ధ్యం సంవత్సరం వరకు బాగా ఉంటుంది. ఆ తరువాత తగ్గిపోతుంది. అదేవిధంగా మీ ప్రమేయం లేకుండానే ఫోన్‌ ఆన్‌ ఆఫ్ అవుతుంటే మీ ఫోన్‌ను ఎవరో హ్యాక్‌ చేసినట్లే మీ మొబైల్‌లో కొన్ని స్పై యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసి మీ వ్యక్తిగత సమాచారాన్ని దొరకబుచ్చుకుంటారు. తద్వారా మీ కాల్స్‌ను ట్యాప్‌ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం గేమింగ్‌ యాప్స్ ఈ గేమింగ్‌ యాప్స్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటె వాటిని ఇన్‌స్టాల్‌ చేసినప్పుడు కాల్‌ హిస్టరీ, అడ్రస్‌ బుక్‌, కాంటాక్ట్‌ లిస్ట్‌ కోసం పర్మిషన్‌ అడిగితే వాటిని వాడాలా వద్దా అనేది ఆలోచించుకోవాలి. కొన్ని కొన్ని సార్లు మనకు తెలిసిన పేర్లతో ఉన్న సైట్లు కూడా మనల్ని మోసం చేయవచ్చు.