Online Hacking : జాగ్రత్త…ఆన్ మోసాలు ఏ రోజు ఎక్కువ జరుగుతన్నాయో తెలుసా…?

కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ట్రాన్స్ క్షన్స్ భాగా పెరిగిపోయాయి. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ డిజిటల్ సేవలు అందుతున్నాయి.

  • Written By:
  • Updated On - February 28, 2022 / 12:11 PM IST

కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ట్రాన్స్ క్షన్స్ భాగా పెరిగిపోయాయి. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ డిజిటల్ సేవలు అందుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఇంటర్నేట్ వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సమాచారాన్ని దొంగలించడం, సేకరించడంతోపాటుగా హ్యాకింగ్ కు కూడా పాల్పడుతున్నారు. మీరు ఏమాత్రం అలసత్వంగా ఉన్నా మీ డేటాతోపాటు…డబ్బులు పోవడం ఖాయం.

హ్యాకింగ్ ఎలా చేస్తారు…?
మనకు సంబంధించిన లావాదేవీలన్నీ కూడా బ్యాకింగ్ కు ముడిపడి ఉంటాయి. చాలాసార్లు అధికారులు, ఈ వ్యాలెట్ ప్రొవైడర్స్, టెలికాం సర్వీసు ప్రొవైడర్స్ లా సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బ్యాంకు, వంటి వివరాలను అడిగి తెలుసుకుంటారు. కేవైసీ అప్ డేట్ చేయాలని బ్యాంక్ అకౌంట్ ను అన్ బ్లాక్ చేయాలని…మీ అకౌంట్లో డబ్బు జమ అవుతుందని…ఏటీఎం పనిచేయదని, సిమ్ కార్డు యాక్టివేషన్ కోసమని రకరకాలుగా అబద్దాలు చెప్పి నమ్మిస్తారు. వారి మాటలు విన్న ప్రజలు సమాచారన్ని అందించి మోసపోతారు. ఓటీపీలు కూడా తెలుసుకుని క్షణాల్లోనే నగదు కాజేస్తారు కేటుగాళ్లు.

అయితే ఏదైనా అప్లికేషన్, యాప్ ను ఫోన్ కానీ కంప్యూటర్ లో కానీ ఇన్ స్టాల్ చేసేలా చేస్తారు. దాంతో మొత్తం సమాచారాన్ని అంతా కూడా సేకరిస్తారు. అంతేకాదు పేమెంట్ యాప్ లోని కలెక్ట్ రిక్వెస్ట్ ఆప్షన్ ద్వారా నగదును కాజేస్తారు. ఫేక్ పేమెంట్ రిక్వెస్టును ‘ఎంటర్ యువర్ యూపిఐ పిన్ ’అని మెసేజ్ పంపిస్తారు. అక్కడ ప్రెస్ చేయగానే ఆ యూపీఏ అడ్రెస్ కు నగదు ట్రాన్స్ ఫర్ అవుతుంది. సామాజిక మాధ్యమాల్లో తపపుడు నెంబర్లు, వెబ్ సైట్ అడ్రస్సులను ప్రచారం చేస్తుంటారు. ఎవరైనా కానీ నమ్మి బ్యాంకువే అనుకుని సంప్రదించినట్లయితే ఇక అంతే సంగతులు.

పోయినఏడాది రిపోర్టుల ప్రకారం ఎక్కువ సైబర్ నేరాలు నెలలో రెండు, నాలుగు శుక్రవారాల్లోనే జరిగినట్లు తేలింది. మొబైల్ యాప్స్ ద్వారానే ఎక్కువగా ప్రజలు మోసపోయారు. కంప్యూటర్లను వినియోగిస్తే ఈజీగా ఎక్కడి నుంచి చేశారో తెలుసుకునే ఛాన్స్ ఉంది. పని కంప్లీట్ అవ్వగానే ఫోన్ పక్కన పడేయవచ్చు. ఇక ఫోన్ తక్కువ ధరలో దొరుకుతుంది. అందుకే సైబర్ నేరగాళ్లు ఈ దారిని ఎంచుకున్నారు. కాగా ఆర్బిఐ సైబర్ నేరాల బారిన పడకుండా బ్యాంకులకు ప్రజలకు పలు సూచనలు చేస్తోంది. ఎవరైనా ఫోన్ చేసి బ్యాంకు అకౌంట్ వివరాలు, ఓటీపీలతోపాటు ఇతర పర్సనల్ డేటా అడిగినా ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదని అవగాహన కల్పిస్తోంది. బ్యాంకుల నుంచి యూజర్ల ఫోన్లకు మెసేజ్ లను పంపిస్తోంది.

ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. బ్యాంకులు ఎప్పుడూ కూడా మిమ్మల్ని వివరాలు అడగదు. ఎవరైనా అడిగితే బ్యాంకు ద్రుష్టికి తీసుకువెళ్లాలని అప్రమత్తం చేస్తున్నాయి. అంతేకాదు గుర్తుతెలియని ఈమెయిల్ ఒపెన్ చేయవద్దని లింక్ ను ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయకూడదని చెబుతోంది. ఎక్కడా వివరాలు నమోదు చేయకూడదని ఆర్బిఐ తెలుపుతోంది. ఇక అధికారిక యాప్ అయితేనే ఇన్ స్టాల్ చేయాలని…ఎలాంటి ఆఫర్లను నమ్మి యాప్స్ డౌన్ లోడ్ చేయకూడదని హెచ్చరిస్తోంది ఆర్బిఐ.