Heating Rod Mistakes: వేడినీటి కోసం రాడ్ ని ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

మామూలుగా శీతాకాలంలో నీరు చల్లగా ఉండడంతో చాలామంది ముఖం కడుక్కోవడానికి స్నానం చేయడానికి ఎక్కువగా వేడి నీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఒకప్పుడు కట్టెల

  • Written By:
  • Publish Date - December 1, 2023 / 07:30 PM IST

మామూలుగా శీతాకాలంలో నీరు చల్లగా ఉండడంతో చాలామంది ముఖం కడుక్కోవడానికి స్నానం చేయడానికి ఎక్కువగా వేడి నీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఒకప్పుడు కట్టెల పొయ్యి మీద నీటిని వేడి చేసుకునే వారు. కానీ ఆ తర్వాత కాలంలో గ్యాస్ రావడంతో గ్యాస్ మీద నీటిని వేడి చేసుకునేవారు. ఇప్పటికీ చాలామంది ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు. దీంతో పాటుగా టెక్నాలజీ పూర్తిగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా వాష్ రూమ్ లో గీజర్ ని ఉపయోగిస్తున్నారు. అలాగే కొంతమంది హీటర్ ని కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో హీటర్ కారణంగా ఇద్దరు ముగ్గురు చిన్నారుల ప్రాణాలు పోవడం చాలామంది వాటి వినియోగాన్ని తగ్గించేశారు.

అయితే మీరు కూడా వేడి నీటి కోసం తాపన రాడ్‌ను ఉపయోగిస్తూ ఉంటే, మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రస్తుతం చలికాలం మొదలైంది. చలికాలంలో చల్లని గాలులు వీచడంతో పాటు సూర్య రశ్మి కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఒకవేళ ఉదయం పూట స్నానం చేయాల్సి వస్తే మాత్రం తప్పకుండా వేడి నీరు ఉపయోగించే స్నానం చేస్తారు. ఇప్పుడు మనం వేడినీరు లేకుండా స్నానం చేయలేము. గీజర్లు ఉన్నవారికి సులభంగా వేడినీరు వస్తుంది. గ్యాస్ స్టవ్‌లపై నీటిని వేడి చేయడం కంటే, ఇమ్మర్షన్ రాడ్ వాడటం మేలని చాలా మంది దాన్నే వాడుతున్నారు. అయితే హీటింగ్ రాడ్ లేదా ఇమ్మర్షన్ రాడ్‌ ఉపయోగించేటప్పుడు చాలా విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

ఇమ్మర్షన్ రాడ్‌ను స్నానపు గదిలో ఉంచకూడదు. ఎందుకంటె ఇవి మాన్యువల్‌గా పనిచేస్తాయి. ఆటో స్విచ్చాఫ్ ఆప్షన్ వీటిలో ఉండదు. అందువల్ల మీరు దీన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇమ్మర్షన్ రాడ్‌ని పూర్తిగా నీటిలో ముంచిన తర్వాతే, దానిని స్విచ్ ఆన్ చెయ్యాలి. నీరు వేడెక్కిందో లేదో తెలుసుకోవడానికి వేడి నీటిలో అలాగే వేలు పెట్టకూడదు. స్విచ్చాఫ్ చేసిన తర్వాత రాడ్డును నీటి నుంచి పూర్తిగా తీసేసిన తర్వాతే నీటి వేడిని చెక్ చేయాలి. అలాగే రాడ్డును స్విచ్చాఫ్ చేశాక, 10 సెకండ్ల తర్వాత నీటి నుంచి తియ్యడం మేలు. మెటల్, విద్యుత్తు యొక్క మంచి కండక్టర్. అందువల్ల, ఎప్పుడూ మెటల్ బకెట్ ఉపయోగించ కూడదు.

ఇది ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుంది. అలాగే ఎప్పుడు కూడా చవకైన హీటింగ్ రాడ్లను ఉపయోగించవద్దు. భద్రత విషయంలో రాజీ పడకుండా ఎప్పుడూ మంచి నాణ్యతతో ఉన్నవి మాత్రమే కొనుగోలు చేయాలి. నాణ్యత లేని వాటి వల్ల ప్రజలకు కరెంటు షాక్ కొట్టిన సంఘటనలు చాలాసార్లు జరిగాయి. హీటింగ్ రాడ్ల కోసం ప్లాస్టిక్ బకెట్ ఉపయోగించడం సురక్షితం. అయితే ప్లాస్టిక్ బకెట్‌లో రాడ్‌ను ఎక్కువసేపు ఉంచితే, బకెట్ కరిగిపోతుంది. లేదంటే కాయిల్ కాలిపోతుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా నీరు కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆఫ్ చేస్తే సరి. అలాగే ఈ రాడ్ల సహాయంతో నీటిని వేడి చేసుకునే వారు పసిపిల్లలకు వీలైంనత దూరంగా ఉండేలా చూసుకోవాలి.