Site icon HashtagU Telugu

Smartphone: చార్జింగ్ విషయంలో అలాంటి తప్పులు చేస్తున్నారా.. అయితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే?

Mixcollage 03 Dec 2023 02 43 Pm 415

Mixcollage 03 Dec 2023 02 43 Pm 415

ప్రస్తుత రోజుల్లో మనిషి జీవితంలో స్మార్ట్ ఫోన్ ఒక భాగం అయిపోయింది. దీంతో ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే రోజు గడవని పరిస్థితుల్లో నేడు మనం చూస్తున్నాము. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎదురయ్యే ప్రధాన సమస్య చార్జింగ్. ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది. దీంతో పదే పదే మొబైల్ కి ఛార్జింగ్ పెట్టాల్సి వస్తూ ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు మనం ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు అక్కడ చార్జింగ్ పెట్టుకునే వెసులుబాటు లేకపోతే సెల్లు స్విచ్ ఆఫ్ అవడం ఖాయం.

అయితే కొందరు పగలు మొత్తం సెల్ ఫోన్ ని ఉపయోగించి రాత్రి మొత్తం అలాగే ఛార్జింగ్ పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం అసలు మంచిది కాదు. ఎందుకంటే నైట్ అంతా చార్జింగ్ పెట్టడం వల్ల సెల్ ఫుల్ గా ఛార్జింగ్ అవడంతో పాటు మొబైల్ ఓవర్ హీట్ అయ్యి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే రాత్రి మొత్తం చార్జింగ్ పెట్టే అలవాటు ఉంటే అలా చేయడం మానుకోవాలి. కొందరు మొబైల్ కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి తక్కువ నాణ్యత ఉన్న చార్జర్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆ ఫోన్ బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఫోన్ పనితీరు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాగా స్మార్ట్‌ ఫోన్స్‌ లో లిథియం,అయాన్‌ బ్యాటరీ లను ఉపయోగిస్తారు. వీటికి సహజంగానే మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్‌ ను వెంటిలేషన్‌ ఉన్న ప్రాంతంలోనే ఛార్జింగ్ పెట్టాలి. బాక్స్‌లు, డెస్క్‌ ల్లో ఫోన్‌ లను పెట్టి ఛార్జింగ్ చేయకూడదు. అలాగే ఇంకొందరు రాత్రి సమయంలో తల దిండు కింద ఛార్జింగ్ పెట్టి పడుకుంటూ ఉంటారు. అలా చేయడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు మొబైల్ ఛార్జింగ్ అయిపోయి ఓవర్ హీట్ అయినప్పుడు పేలితే అది ప్రాణాలకే ప్రమాదం. అలాగే చార్జింగ్ 90% ఎక్కిన తర్వాత వెంటనే చార్జర్ వైర్ ని రిమూవ్ చేయాలి. కానీ కొందరు మాత్రం పూర్తిగా 100% వచ్చేవరకు ఉండి ఆ తర్వాత చార్జింగ్ తీసేస్తూ ఉంటారు. అలా చేయడం అస్సలు మంచిది కాదు. ఇలా మనం చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లే మొబైల్ ఫోన్ పేలిపోవడానికి కారణం అవుతాయి.

Exit mobile version